Raithu_bidda_ Posted March 7, 2018 Report Posted March 7, 2018 రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు రకరకాలుగా మారబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ, భాజపాకు మద్దతు ఉపసంహరించడం అనే లాంఛనం పూర్తయిపోయింది. రాష్ట్రప్రభుత్వం నుంచి భాజపా తప్పుకోవడం కూడా తేలిపోయినట్టే. గురువారం ఉదయమే ఈ పర్వం కూడా పూర్తయిపోవచ్చు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఎలాగైనా పోవచ్చుగానీ.. భాజపా మీద ఈ ఎపిసోడ్ లో ఒక పట్టాన చెరిపేసుకోలేనంత మరక పడిపోయిందనే సంగతి గ్యారంటీ. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు చాలా సక్సెస్ అయ్యారు. కొన్ని సంవత్సరాలుగా తను చేసిన పాపాలు అన్నిటినీ కప్పెట్టేస్తూ.. కొన్ని వారాలుగా ఆ పార్టీ మీద అదే పనిగా బురద చల్లుతూ... ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఎలా ఉంటుందనే భయాందోళనలు పార్టీ వారిలో కలిగేలా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. పొత్తులు తెగిన తర్వాత రాష్ట్రంలో సమీకరణలు వేగంగా మారే అవకాశం ఉన్నదని కొందరు భావిస్తున్నారు. భారతీయ జనతాపార్టీ నుంచి కొందరు నాయకులు తెలుగుదేశంలో చేరవచ్చుననే ఊహాగానాలు కూడా ఉన్నాయి. పేరుకు వారు భాజపా పార్టీలోనే ఉన్నప్పటికీ.. వారు పచ్చ నాయకులే అనేంత స్ట్ర్రాంగ్ ముద్ర కొందరి మీద ఉంది. అలాంటి వారికి ఇప్పుడు చంద్రబాబునాయుడు ఆఫర్లు పెడుతున్నారని అమరావతి రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశానికి ప్రత్యేకించి చంద్రబాబునాయుడుకు అనుకూలంగా ఉండే కొందరు భాజపా ప్రజాప్రతినిధులకు ఆయన దూతలు ఇప్పటికే గాలం వేసినట్లుగా చెప్పుకుంటున్నారు. భాజపాను నమ్ముకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేసుకోవాల్సిందే తప్ప.. రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు శూన్యం అని.. తమ పార్టీలో చేరిపోయి.. భాజపా మీద మరికాస్త బురద చల్లితే కనుక.. చక్కటి భవిష్యత్తును తామే కల్పిస్తాం అని ఆయన తరఫు ఆఫర్లు కమల నాయకులకు వెల్లువలా వస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంతగా భ్రష్టు పట్టిపోయిన తర్వాత.. భాజపా తిరిగి ఇక్కడ ప్రజాదరణ చూరగొనడం అంత సులువు కాదు. ఆ నేపథ్యంలో.. ఎటూ అక్కడ భవిష్యత్తు ఉండదు గనుక.. పచ్చ తీర్థం పుచ్చుకోవడం ఉత్తమం అనే భావనతో కొందరు కాషాయధారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. Quote
TOM_BHAYYA Posted March 7, 2018 Report Posted March 7, 2018 Already okadu indhaake debate ki ochhadu kaashayam to yellow color eskoni kamineni also jumping ani talk not sure Quote
reality Posted March 7, 2018 Report Posted March 7, 2018 15 minutes ago, TOM_BHAYYA said: Already okadu indhaake debate ki ochhadu kaashayam to yellow color eskoni kamineni also jumping ani talk not sure Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.