Raithu_bidda_ Posted March 7, 2018 Report Posted March 7, 2018 దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సిందేనని....ఇందుకోసం కాంగ్రెస్ - బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు కావాలని ప్రకటించడమే కాకుండా...ఆ ఫ్రంట్ కు తానే శ్రీకారం చుడతానని వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లో సంచలనానికి వేదికగా మారిన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేసీఆర్ ప్రకటన హాట్ టాపిక్ అయినట్లు ఢిల్లీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రధాని మోడీని టార్గెట్ గా చేసిన కేసీఆర్ ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే మోడీని టార్గెట్ చేసిన ఈ ఎపిసోడ్ పై కేంద్రం పెద్దలు నజర్ వేశారని అంటున్నారు. కేసీఆర్పై సీబీఐ అస్త్రం ప్రయోగించే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని కేసీఆర్ కేంద్రమంత్రి బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన కుంభకోణం కేంద్రంగా సీబీఐ దాడులు జరగవచ్చని అంటున్నారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రముఖ బ్యాంకింగేతర సేవల సంస్థ అయిన సహారాలో ఉద్యోగుల పీఎఫ్ కుంభకోణం చోటుచేసుకుంది. సహారాకు చెందిన 11 లక్షల మంది ఉద్యోగుల పీఎఫ్ మొత్తాలను సంస్థ పీఎఫ్ నిధికి సమర్పించలేదని ఆరోపణలు వచ్చాయి. 2006లో చోటుచేసుకున్న ఈ కుంభకోణంలో రూ.7000 కోట్లు నిధులు మల్లింపు జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై గతంలో సీబీఐ దర్యాప్తు జరిగినప్పటికీ...చర్యలు తీసుకోలేదు. అయితే ఈ కేసును మళ్లీ సీబీఐ తిరగతోడనుందని అంటున్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఈ కుంభకోణాన్ని మళ్లీ తెరమీదకు తీసుకురావడం ద్వారా తమ మార్క్ హెచ్చరికను తెలంగాణ సీఎంకు అందించాలని బీజేపీ ముఖ్యనేతలు ఉన్నట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే నిజంగా సీబీఐ దాడులు జరుగుతాయా? ఒకవేళ జరిగితే టీఆర్ ఎస్ వర్గాలు - ఆ పార్టీ సానుభూతిపరులు ఎలా స్పందిస్తారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. Quote
Paidithalli Posted March 7, 2018 Report Posted March 7, 2018 em peektharu... naa gochi kuda peekaleru annadu Dora... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.