Navyandhra Posted March 12, 2018 Author Report Posted March 12, 2018 During the 53rd Polavaram review held in the Secretariat, the Chief Minister enquired the progress of all priority projects in the state. In the list of the 21 projects that were added to the list of priority projects last week, the Chief Minister added 2 more: Quote
Navyandhra Posted March 14, 2018 Author Report Posted March 14, 2018 పోలవరం ప్రాజెక్టుకు.. 16లోగా కొత్త డీపీఆర్! 14-03-2018 03:09:00 రెండ్రోజుల్లో జలవనరుల శాఖ ఉత్తర్వులు? కేంద్ర కార్యదర్శులతో ఢిల్లీలో కీలక భేటీ డీపీఆర్‌ను వెంటనే ఆమోదించాలని.. ఆర్థిక శాఖకు యూపీ సింగ్ వినతి అలా చేస్తేనే నాబార్డు నుంచి రుణం 1800 కోట్లు రీయింబర్స్‌కు హామీ త్వరలోనే సీడబ్ల్యూసీకి సమగ్ర నివేదిక అమరావతి/న్యూఢిల్లీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరుతో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టు కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. 16వ తేదీలోపే దీనికి ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్, జలవనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక, జలవనరులు, జలసంఘం అధికారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. పోలవరం నిధులు, డీపీఆర్ ఆమోదం, భూసేకరణ, సహాయ పునరావాసం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం కొత్త డీపీఆర్‌ను ఆమోదిస్తామని కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టుపై వారం వారం జరుగుతున్న సమీక్షల నివేదికను శశిభూషణ్ ఆయనకు అందజేశారు. పోలవరం పనుల పురోగతిని కూడా వివరించారు. డీపీఆర్‌ను త్వరితగతిన ఆమోదిస్తే ..ఆ అంచనా వ్యయాల మేరకు పనులు చేపట్టేందుకు వీలవుతుందని తెలిపారు. శశిభూషణ్‌తో ఏకీభవించిన యూపీ సింగ్..వెంటనే కేంద్ర ఆర్థిక కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ నెల 16లోగా పోలవరం కొత్త డీపీఆర్‌కు ఆమోదం తెలిపితే..రెండురోజుల్లో దానిపై తాము ఉత్తర్వు ఇస్తామని ఆయనతో అన్నారు. ఆ తర్వాతే నాబార్డు రుణం తీసుకునేందుకు వీలవుతుందని తెలిపారు. శశిభూషణ్ సమక్షంలోనే ఫోన్ సంభాషణ సాగడంతో..2-3 రోజుల్లో కొత్త డీపీఆర్‌పై స్పష్టత వస్తుందని రాష్ట్రం ఆశాభావంతో ఉంది. కాగా.. కేంద్ర ఆర్థిక కార్యదర్శిని దినేశ్‌కుమార్ కలిశారు. వారిరువురూ సంభాషిస్తున్న తరుణంలోనే శశిభూషణ్ కూడా అక్కడకు వెళ్లారు. పోలవరం కోసం రాష్ట్రం ఖర్చుపెట్టిన మొత్తంలో రూ.1800 కోట్లను త్వరలోనే రీయింబర్స్ చేస్తామని కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. మా గణాంకాలన్నీ పక్కా 8సీడబ్ల్యూసీకి శశిభూషణ్ స్పష్టీకరణ కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్ రవికుమార్, సీఈ దాస్‌లతో శశిభూషణ్, ఈఎన్‌సీ సమావేశమయ్యారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను సమగ్రంగా వివరించి ఎట్టకేలకు ఒప్పించారు. గత డీపీఆర్ ప్రకారం..పోలవరం అంచనా వ్యయం రూ.10,016 కోట్లు కాగా..2013-14 ధరలకు అనుగుణంగా దానిని రూ.58వేల కోట్లకు రాష్ట్రప్రభుత్వం సవరించింది. ఇందులో రూ.33 వేలకోట్ల దాకా భూసేకరణ, పునరావాసాలకే అవుతోంది. 2005లో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అగ్రికల్చరల్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన రిపోర్టుకూ..ప్రస్తుతం ఏపీ ప్రభు త్వం చేపట్టిన భూ సేకరణ, సహాయ పునరావాసానికి మధ్య భారీ అంతరం ఎందుకొచ్చిందని సీడబ్ల్యూసీ మంగళవారం ప్రశ్నించింది. ‘ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో పేర్కొన్న 1,10,000 ఎకరాల నుంచి 1,60,000 ఎకరాలను ఎందుకు సేకరించాల్సి వచ్చింది? పునరావాస కుటుంబాలు 44,000 నుంచి లక్షకు పైగా ఎలా పెరిగాయి’ అని అడిగింది. వీటికి శశిభూషణ్ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. ‘2005లో భూసేకరణ, నిర్వాసితులపై ప్రాథమిక అంచనాలు వేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అగ్రికల్చరల్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో కేంద్ర జల సంఘం నిర్వహించిన ప్రాథమిక సర్వేలో ప్రాజెక్టుకు 1,10,000 ఎకరాలు సరిపోతాయని భావించింది. తర్వాత ఒడిసా, ఛత్తీ్‌సగఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాలను పరిశీలించాక.. రిజర్వాయరు గరిష్ఠ జలాల స్థాయి(ఎఫ్‌ఆర్‌ఎల్) నిల్వను లెక్కిస్తే..1,60,000 ఎకరాలకు పెరిగింది. గ్రామాల సంఖ్య 275 నుంచి 372కి చేరింది. ఇక నిర్వాసిత కుటుంబాల సంఖ్యకు వస్తే 2013కి ముందు కుటుంబం అంటే..భార్య, భర్త, అవివాహిత పిల్లలు. కానీ 2013 భూసేకరణ చట్టం వచ్చాక కుటుంబంలో 18 ఏళ్లు దాటిన వారిని ప్రత్యేకంగా నిర్వాసితులుగా చూడాల్సి వస్తోంది. అందువల్ల వీరి సంఖ్య 44,574 నుంచి 1,05,601కి చేరింది. పునరావాస వ్యయం కూడా పెరిగింది. భూముల వివరాలన్నీ ప్రభుత్వం గెజిట్‌లో కూడా ప్రచురించింది. ఇంకా ఏమైనా సందేహాలుంటే కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా గానీ, మరే ఇతర ఏజెన్సీ ద్వారా గానీ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసుకోవచ్చు’ అని శశిభూషణ్ స్పష్టం చేశారు. అవసరమైతే తనిఖీ చేసుకోవచ్చని సూచించారు. కొత్త చట్టం (2013) అమల్లోకి వచ్చాక భూసేకరణ వ్యయం భారీగా పెరిగిందన్నారు. ఈ వివరణతో సీడబ్ల్యూసీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన వెంటనే.. సమగ్ర నివేదికను సీడబ్ల్యూసీకి మరోసారి పంపాలని శశిభూషణ్ బృందం నిర్ణయించింది. Quote
Navyandhra Posted March 20, 2018 Author Report Posted March 20, 2018 అమరావతి/పోలవరం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు రాం రాం చెప్పిన నేపథ్యంలో తొలిసారిగా జరిగిన పోలవరం ప్రాజెక్టు పనుల సమీక్షలో జల వనరులశాఖ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక కర్తవ్య బోధ చేశారు. పోలవరం పనుల్లో మరింత అప్రమత్తత అవసరమన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం సచివాలయంలో వర్చువల్ రివ్యూ చేశారు. ఈ సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో సూపరింటెండింగ్ ఇంజనీరు రమేశ్‌బాబుతో సీఎం మాట్లాడుతూ.. ఎక్కడా ఏచిన్న పొరపాటు చోటు చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఇదే సమయంలో పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలోని 25 కెమెరాలనూ ఫైబర్ గ్రిడ్‌కు అనుసంధానించాలన్నారు. నెలాఖరులోగా లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేయాలని, 2019 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నిర్మాణ పనుల ప్రగతి 54.4ు ఉందని వివరించారు. కుడి ప్రధాన కాలువ పనులు 91ు పూర్తయ్యాయని, ఎడమ ప్రధాన కాలువ పనులు 59.6ు దాకా జరిగాయని, హెడ్‌వర్క్స్ పనులు 41.2ు పూర్తయ్యాయని వివరించారు. మట్టి పనులు 70ు మేర పూర్తయ్యాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ 1,427 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 10.49 లక్షల క్యూబిక్ మీటర్ల మేర జరిగిందన్నారు. ప్రాధాన్య ప్రాజెక్టుల వేగాన్ని పెంచాలి: సీఎం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇక, గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, ఔకు టన్నెల్, పులికనుమ ఎత్తిపోతల, కృష్ణానదిపై పెదపాలెం, వీఎల్ ఎంసీ మీద చినసన ఎత్తిపోతల పథకాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. లైవ్‌లో పరిశీలన పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనుల తీరును కెమేరాల ద్వారా లైవ్‌లో సీఎం చంద్రబాబు పరిశీలించారు. నవయుగ కంపెనీ ఎండీ శ్రీధర్, ప్రాజెక్టు ఎస్ ఈ రమే్‌షబాబు ప్రాజెక్టు వద్ద పనితీరును వివరించారు. Quote
Navyandhra Posted March 20, 2018 Author Report Posted March 20, 2018 అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ. 1400 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1795 కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం.. నాబార్డు ద్వారా రూ. 1400 కోట్లు రుణం మంజూరుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం అందించింది. ప్రాజెక్టుకు సంబంధించి ఆడిట్లు వచ్చిన తరువాత మిగిలిన రూ. 300 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గతంలో పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రెండు విడతల్లో రూ.వెయ్యి కోట్లు చొప్పున నిధులు విడుదల చేయడం జరిగింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.