Jump to content

3 and half kgs gold


Recommended Posts

Posted
జల్సాల కోసం యువతులకు ఎర 
ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌ల ద్వారా పరిచయం 
పవన్‌ కల్యాణ్‌ అభిమానులమంటూ మోసం 
ఓ యువతి వద్ద 3.50 కిలోల బంగారం స్వాహా 
ఏడుగురు యువకులను అరెస్టుచేసిన పోలీసులు 
9crime-news10a.jpg

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: వారంతా యువకులు.. జల్సాలకు అలవాటుపడి మధ్యలోనే చదువు మానేసి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ హడావిడి చేసేవారు. చివరకు దాన్నే పెట్టుబడిగా చేసుకుని యువతుల దృష్టిని ఆకర్షించేందుకు యత్నించారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో యువతులను పరిచయం చేసుకుని వారితో చాటింగ్‌ చేస్తూ మాయమాటలు చెప్పేవారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానులమని, ఆయనతో పరిచయం ఉందంటూ,  ఆయనను పరిచయం చేస్తామని.. ఆయనతో ఫొటోలు దిగవచ్చని నమ్మబలికారు. ఆ క్రమంలో కొందరు యువతులు వారి ఉచ్చులో పడ్డారు. ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ఓ బంగారు వ్యాపారి కుమార్తె వీరి మాయలో పడి ఏకంగా మూడున్నర కేజీల బంగారు ఆభరణాలను ఇచ్చింది. తొలుత కొన్ని నగలు ఆమె ఇష్టపూర్వకంగా ఇచ్చినా, మరికొన్ని ఆభరణాలను బెదిరించి తీసుకున్నారు. చివరకు ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో వారి ఆగడాలకు అడ్డుకట్ట పడింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారివద్ద రూ.1.23 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరులసమావేశంలో ఎస్పీ రవిప్రకాష్‌ వివరాలను వెల్లడించారు. ఏలూరుకు చెందిన యువకులు దత్తి బాలాజీ, సింహాద్రి బాలచందర్‌ అలియాస్‌ బాలు, పిల్లా సాయిదేవేంద్ర నాయుడులు తాము జనసేన పార్టీ నాయకులమని, పవన్‌ కల్యాణ్‌తో బాగా పరిచయం ఉందని చెబుతూ మోసం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో యువతుల ప్రొఫైల్స్‌ చూసి వారికి ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ పెట్టి అలా పరిచయమైన అమ్మాయిలకు మాయమాటలు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తామని.. విమానాల్లో తిరుగుతామని చెప్పేవారు. ఈ క్రమంలో ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన బంగారు వ్యాపారి కుమార్తెతో పరిచయం పెంచుకున్నారు. ఆమెతో చాటింగ్‌ చేసే వారు. తాము చేసే వ్యాపారానికి కొంత డబ్బు అవసరమైందని చెప్పి.. మళ్లీ ఇచ్చేస్తామని అప్పుగా ఇవ్వాలంటూ ముందుగా కొన్ని బంగారు అభరణాలు తీసుకున్నారు. ఆ తరువాత మరికొన్ని తీసుకున్నారు. బంగారం ఇవ్వమని యువతి అడిగితే.. విడిపించాలంటే మరికొంత బంగారం కావాలని.. మొత్తం ఒకేసారి ఇస్తామని మళ్లీ బంగారాన్ని తీసుకున్నారు. ఆ తరువాత బెదిరించడం మొదలు పెట్టారు. నగలు ఇంకా ఇవ్వాలని.. లేదంటే నీతో చాటింగ్‌లు చేసిన ఫొటోలు మీ తల్లిదండ్రులకు చూపెడతామని చెప్పారు. మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని బెదిరించడంతో ఆ యువతి భయపడి మరికొన్ని నగలను ఇచ్చింది. అలా దఫదఫాలుగా మూడున్నర కేజీల బంగారు నగలను ఇచ్చింది. వాటిని ఏలూరులోని ముత్తూట్‌, మణిప్పురం, యూఏఐ ఎక్స్ఛేంజ్‌, యాక్సిస్‌ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని జల్సాలు చేసేవారు. చివరకు చేసేది లేక ఆ యువతి ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి మాయలో మరో ముగ్గురు యువతులు పడినట్లు తెలిసిందని, వారివద్ద డబ్బు గానీ, బంగారునగలు గానీ ఇలా మోసగించి తీసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

weg-cri1a.jpg

విమానాల్లో గోవాకు వెళ్లేవారు 
ఈ యువకులు ఇలా తీసుకున్న బంగారు నగలను తాకట్టు పెట్టి ఆ సొమ్ముతో విలాసజీవితం గడిపేవారు. విమానాల్లో గోవా వెళ్లి జూద క్రీడలు ఆడేవారు. ఇలా 40 నుంచి 50 సార్లు గోవా వెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కొత్తపేటకు చెందిన దత్తి బాలాజీ బీటెక్‌ ద్వితీయ సంవత్సరంతోనే మానేశాడు. ఇతని తండ్రి హోటల్‌లో పనిచేస్తాడు. మరో నిందితుడు గూడ్షెడ్‌ రోడ్డుకు చెందిన సింహాద్రి బాలచందర్‌ ఎంబీఎ మధ్యలో మానేశాడు. తంగెళ్లమూడికి చెందిన పిల్లా సాయిదేవేంద్ర నాయుడు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో మానేశాడు. ఈ కేసులో వీరికి సహకరించిన గ్జేవియర్‌ నగర్‌కు చెందిన విప్పర్తి ఫ్రాన్సిస్‌ బెంగళూరులో సీఎ చదువుతున్నాడు. కొత్తపేటకు చెందిన కొండ్రి రాజేష్‌, దెందులూరు మండలం వీరభద్రపురానికి చెందిన గుజ్జుల రాజీవ్‌లు మెడికల్‌ రిప్‌లుగా పనిచేస్తున్నారు. ఏలూరు చాణక్యపురి కాలనీకి చెందిన తుమ్మలపల్లి అశోక్‌ కుమార్‌ క్యాటరింగ్‌ పనులు చేస్తుంటాడు. 
* ఎస్పీ రవిప్రకాష్‌ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో వన్‌టౌన్‌ సీఐ అడపా నాగమురళీ, ఎస్సై కిషోర్‌బాబు, సిబ్బంది నిందితులు ఏడుగురిని గురువారం రాత్రి ఆశ్రం ఆసుపత్రి వద్ద అరెస్టు చేశారు. వారివద్ద 3,424 గ్రాముల బంగారు నగలు, చవర్లెట్‌ కారు, ఖరీదైన రెండు ద్విచక్ర వాహనాలు, యాపిల్‌ చరవాణి, ట్యాబ్‌, ఏసీ, టీవీలను స్వాధీనం చేసుకున్నారు.

అమ్మాయిలూ మోసపోకండి : ఎస్పీ 
ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ చాటింగ్‌లతో అమ్మాయిలు మోసపోతున్నారని, జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ రవిప్రకాస్‌ పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్టులు పెడితే స్పందించవద్దన్నారు. దానివల్ల మంచికన్నా చెడే ఎక్కువగా జరుగుతుందన్నారు. ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. యువతులు, మహిళలను ట్రాప్‌ చేసి అనేక రకాలుగా బెదిరిస్తున్నారని, అలాంటి మోసగాళ్ల వలలో పడవద్దని హితవు పలికారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు నాగమురళీ, శ్రీనివాసరావు, ఎస్సైలు కిషోర్‌బాబు, పైడిబాబు, ఏఎస్సై ఎండీ మక్బుల్‌, హెడ్‌కానిస్టేబుల్‌ దిలీప్‌, కానిస్టేబుళ్లు సీతాదేవయ్య, బాజీలను ఎస్పీ రవిప్రకాష్‌ ప్రత్యేకంగా అభినందించారు

Posted

Ee incident tho veellu pakka pawan kalyan fans ani declare chestharu janalu.

Posted
10 minutes ago, Imperial_09 said:

Ee incident tho veellu pakka pawan kalyan fans ani declare chestharu janalu.

I strongly beleave PK is fully involved, corrupted police r not doin their job sincerely, showing small fish .     };_

Posted
20 minutes ago, Imperial_09 said:

Ee incident tho veellu pakka pawan kalyan fans ani declare chestharu janalu.

Ok

Posted
1 hour ago, LordOfMud said:

I strongly beleave PK is fully involved, corrupted police r not doin their job sincerely, showing small fish .     };_

Baga cheppav

Posted

Ipudu Kathi mahesh ...Tv9 studio ki vachi debate lu petti.... PK vachi kshmapana cheppali ani modalupedatadu 

Posted

Devuda.. kondhariki chance vasthe emaina post chestharu... pk hand undhanta.. mind matta undha meeku asalu?? Em matladuthunnaro artham aithundha?? Yerri fulkas%$#$ 

Posted

deenama PK tissue paper ayyadu ga...evadu padithe vaadu using ........

Posted
On 3/10/2018 at 2:49 AM, nallaberrry said:

Ipudu Kathi mahesh ...Tv9 studio ki vachi debate lu petti.... PK vachi kshmapana cheppali ani modalupedatadu 

Aa chapter aipoyindhi..katti Mahesh pk an episode samaptham.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...