Jump to content

Recommended Posts

Posted

రాష్ట్ర రాజధానిలో నరకం చూపిస్తున్న దోమలు

రాత్రి వేళల్లో వీర విజృంభణ

మార్చిలో విచ్చలవిడిగా పెరిగిన దోమలు

దోమల నివారణకు ఏటా రూ. 700 కోట్లు ఖర్చు

అనుకూల వాతావరణంలో పెరిగిపోయిన దోమలు

పెరుగుతున్న మలేరియా, డెంగీ కేసులు  

మశకమన్నాక కుట్టక తప్పదు.. కుట్టాక దద్దుర్లూ రాకా తప్పదు.. అనివార్యమగు ఈ విషయము గురించి శోకింప తగదు.. 
జనన మరణాల గురించి భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని ప్రస్తుతమున్న పరిస్థితులకు తగ్గట్లు మార్చేసుకుని.. నగరవాసులు ఇలా సర్దుకుపోతున్నారు.. దోమ(మశకం).. బతికేది కేవలం 20 నుంచి 30 రోజులే.. అయితే, చప్పట్లు కొడితే చచ్చిపోయే ఈ చిన్నప్రాణి ఇప్పుడు నగరవాసులతో కబడ్డీ ఆడేస్తోంది.. పిసినారి చేత కూడా డబ్బులు ఖర్చు పెట్టిస్తోంది.. దోమల నియంత్రణ కోసం నగరవాసులు ఏడాదికి ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసా? దాదాపుగా రూ.700 కోట్లు! అయితే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ప్రతి కుటుంబం దోమల నివారణకు నెలకు రూ.100 నుంచి రూ.300 ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని ఆరోగ్య శాఖతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.  

ఎండాకాలం మరింత వ్యథే.. 
మళ్లీ దోమల టార్చర్‌ మొదలైంది. చలికాలంలో కొంత ఊపిరిపీల్చుకున్న ప్రజలకు.. వేసవి ప్రారంభంలోనే దోమల బాధ పట్టుకుంది. రాత్రిళ్లు అయితే.. వీర విజృంభణే.. గుంపులుగా వచ్చేస్తున్నాయి.. అలాగనీ పగటి పూట కనికరం చూపడం లేదు. గతంలో సీజనల్‌గా మాత్రమే కనిపించే దోమలు.. ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా గడిచిన నెలన్నర మొత్తం దోమలకు అనువుగా మారింది. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న దోమలు.. ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఎనాఫిలిస్, క్యూలెక్స్‌ వంటి దోమలు పగటి పూట ఇళ్లల్లోనే మకాం వేసి రాత్రులు స్వైరవిహారం చేస్తుండడంతో జనాలు మలేరియా, డెంగీ బారిన పడుతున్నారు. 

అన్ని మార్గాల్లోనూ.. 
దోమలను శాశ్వతంగా వదిలించుకోవడం అంత సులభం కాకపోవడంతో తాత్కలిక ఉపశమనానికి పెట్టే ఖర్చు తెలియకుండానే కోట్లకు చేరిపోతోంది. అటు దోమలు సైతం ప్రజలు చేస్తున్న నివారణ చర్యలను ధీటుగానే ఎదుర్కొంటున్నాయి. దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ చేసే ఫాగింగ్‌ ఓ పథకం ప్రకారం లేకపోవడంతో వాటి విజృంభణ మరింత పెరిగింది. ఇందుకు ప్రజలు కాయిల్స్‌ ప్రయోగించడం, అవి పనిచేయకపోవడంతో లిక్విడ్, మస్కిటో బ్యాట్స్‌ వాడకం పెంచారు. ఇలా రాజధానిలోని ఒక్కో కుటుంబం దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు ప్రతి నెలా రూ.100 నుంచి రూ.300 ఖర్చు చేస్తున్నట్టు జాతీయ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. అంటే ప్రతి కుటుంబం ఏటా కనీసం రూ.2 వేల నుంచి రూ.2,500 ఖర్చు చేస్తున్నాయని ఆరోగ్య సంస్థలు స్పష్టం చేశాయి. ఇలా రాజధానిలో నివసించే 35 లక్షల కుటుంబాలు దోమల నివారణకు ఏటా రూ.700 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నాయని జాతీయ ఆరోగ్య సంస్థల అధ్యయనంలో తేలింది. 

 

20 నుంచి 30 రోజులు..
దోమల జీవితకాలం చాలా తక్కువే. ఓ దోమ 20 రోజుల నుంచి నెల రోజుల వరకే బతుకుతుంది. కానీ ఒకే సమయంలో వేల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. వాటి నుంచి పిల్ల దోమలు బయటకు రావడానికి 7 రోజులు పడుతుంది. ఆ లోపు యాంటీ లార్వా ఆపరేషన్‌ చేస్తేనే.. దోమల ఉత్పత్తిని నివారించగలం. కానీ సరైన సమయానికి మందులు చల్లకపోవడం వల్ల దోమలు వీరవిహారం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న దోమల నియంత్రణ చర్యలు పెద్దగా ఫలితం చూపించడం లేదు. యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్‌ వంటివి విఫలం అవుతున్నాయి.

అక్కడా..ఇక్కడా అని లేదు.. 
జీహెచ్‌ఎంసీ పరిధిలోని శివారు ప్రాంతాల నుంచి సెంటర్‌ సిటీ వరకు అన్నీ చోట్లా దోమలు విజృంభిస్తున్నాయి. మెహిదీపట్నం, ఆసీఫ్‌నగర్, షాలిబండ, మారేడ్‌పల్లి, న్యూబోయిన్‌పల్లి, అల్వాల్, కీసర, కొండాపూర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లిలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. దోమ పోటుతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. గత ఏడాది 296 మలేరియా కేసులు నమోదుకాగా, డెంగ్యూ కేసులు 117 నమోదయినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రతీ ఒక్కరు పరిశుభ్రత పాటిస్తేనే దోమల నివారణ సాధ్యమవుతుందని జీహెచ్‌ంఎసీ అధికారులు చెప్తున్నారు. నల్లా గుంతలు, నీటి సంపులు ఇంటి పరిసరాల్లోని టైర్లు, పూల కుండీలు, పాత బకెట్లలో ఉండే నీటిలో దోమలు వృద్ధి చెందుతాయని, నీరు నిలవకుండా చర్యలు చేపడితే దోమల నివారణ సగం పూర్తయినట్లే అని వైద్యులు సూచిస్తున్నారు.

దోమల నివారణకు రాజధానిలో ఓ కుటుంబ నెల ఖర్చు రూ.100-300
దోమల నివారణకు రాజధానిలో ఓ కుటుంబ ఏడాది ఖర్చు రూ.2000-2500
దోమల నివారణకు రాజధానిలో  ఏడాదికయ్యే ఖర్చు రూ.700 కోట్లు

Posted

GHMC is a total failure. Oka roads levu , full domalu  , full land kabja lu , illegal constructions.

Bribes theesukovatam lone busy motham employees. 

Posted

అధికారుల నిర్లక్ష్యం నీటి వనరుల పాలిట శాపంగా మారింది. ఒకప్పటి మంచినీటి కుంటలు నేడు కాలుష్య కాసారాల్లా మారాయి. మురుగు జలాలతో వాటి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్తాచెదారం, గుర్రపు డెక్కతో కుంచించుకుపోతున్నాయి. నింగి, నీరు, నేలను పూర్తిస్థాయిలో దెబ్బతీస్తున్న ఈ పరిణామాలను పూర్తిగా మార్చేస్తామని ఏడాదిక్రితం జీహెచ్‌ఎంసీ చేసిన ప్రకటన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. జల వనరుల అభివృద్ధిపై నగరవాసుల్లో ఆందోళన మరింతగా పెరుగుతోంది. హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు 3 వేల చెరువులు ఉన్నాయి. అవన్నీ దాదాపుగా మురుగుతో నిండి ఉన్నాయని అధికారులే అంగీకరిస్తున్నారు. నగర బృహత్తర అభివృద్ధి ప్రణాళికలో నిర్మాణాలు, రహదారుల విషయంపైనే దృష్టి పెట్టారని, వాటి నుంచి విడుదలయ్యే మురుగునీటి గురించి మాస్టర్‌ప్లాన్‌ తయారీలో ఎలాంటి కసరత్తూ సాగలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ మండలంలోని కూకట్‌పల్లి, పికెట్‌నాలా, బంజార, బుల్కాపూర్‌ నాలాలు తీసుకొచ్చే పరిశ్రమల వ్యర్థాలతో హుస్సేన్‌సాగర్‌ దుఃఖసాగరంలా మారిందని, ఆయా జలాలను నేరుగా మూసీలోకి వదిలేయాలని వేసిన పైపులైను పూర్తిస్థాయిలో ఫలితం ఇవ్వక పోవడమే అందుకు కారణమని అంటున్నారు. సంజీవయ్య పార్కు దగ్గర సాగర్‌ కోసం అదనంగా నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రం(ఎస్టీపీ) ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితి సాగర్‌కే కాదని, రూ.401.98 కోట్లతో ఎస్టీపీల ఏర్పాటు కోసం 20 చెరువుల్ని ఎంపిక చేశామన్న బల్దియా ప్రకటనకూ పట్టిందని గుర్తు చేస్తున్నారు.

ప్రతిపాదనకు ఏమైంది? 
బల్దియా స్థాయీ సంఘం మే 25, 2017న జరిగిన సమావేశంలో రూ.401.98 కోట్లతో 20 చెరువులకు ఎస్టీపీల ఏర్పాటు, వాటి సుందరీకరణకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించింది. పరిపాలన పరమైన అనుమతి కోసం ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. ప్రతిపాదనలో ఉన్న చెరువుల్లో దుర్గంచెరువు, మల్కం చెరువులకే మోక్షం లభించింది. ఎస్టీపీ ఏర్పాటు మినహాయిస్తే... కనీసం గుర్రపుడెక్క తొలగింపు, సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మిగిలిన చోట్ల పనులు మొదలవక పోవడం గమనార్హం.

నిబంధనలు బేఖాతరు 
నిబంధనల ప్రకారం జలాశయాల్లోకి మురుగునీరు నేరుగా చేరకూడదు. ప్రభుత్వం మురుగునీటి శుద్ధి కేంద్రాలు(ఎస్‌టీపీ) ఏర్పాటు చేసి, వాటి ద్వారానే చెరువుల్లోకి నీరు వదలాలి. వీలుకానప్పుడు ఆ మురుగును భూగర్భ పైపులైన్ల ద్వారా మరో ఎస్టీపీకి తరలించాలి. ఈ నిబంధన నగరంలో ఎక్కడా అమలు కావడం లేదు. నగరంలో రోజూ 1,400 మిలియన్‌ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతుంటే 750 మిలియన్‌ లీటర్ల శుద్ధికి సరిపోయే ఎస్టీపీలే అందుబాటులో ఉన్నాయి. పైగా... ఉన్న ఎస్టీపీలూ పూర్తిస్థాయిలో సేవలు అందించట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్విట్టర్‌లో ఫిర్యాదులు 
మంత్రి కేటీఆర్‌కు సరూర్‌నగర్‌ చెరువు దురవస్థ గురించి కల్యాణ్‌ అనే వ్యక్తి శనివారం ఫిర్యాదు చేశారు. దానికి  సరూర్‌నగర్‌ చెరువుతోపాటు మొత్తం 20 చెరువులకు త్వరలోనే ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామని మంత్రి స్పందించారు. ఫిర్యాదుల పరంపర ఆగలేదు. ఖాజాగూడ, మణికొండ చెరువులు, మల్కాజిగిరిలోని బండచెరువు తదితర జలాశయాల దురవస్థను తొలగించాలని పౌరులు మంత్రికి విన్నవించారు.

క్లుప్తంగా... 
 నగరంలో ఉత్పత్తయ్యే మురుగునీరు.. 1,400 మిలియన్‌ లీటర్లు (రోజుకు) 
 ఉన్న ఎస్టీపీల సామర్థ్యం.. 750 మిలియన్‌ లీటర్లు 
 జలమండలి ఆధ్వర్యంలోని భారీ మురుగుశుద్ధి కేంద్రాలు.. 5 (నాగోల్‌, నల్లచెరువు, అంబర్‌పేట్‌, అత్తాపూర్‌, నానక్‌రామ్‌గూడ) 
 హెచ్‌ఎండీఏ నుంచి జలమండలికి బదిలీ అయిన చిన్న ఎస్టీపీలు.. 14 
* మురుగునీటి పైపులైన్ల పొడవు.. 5,000 కి.మీ.

Posted
21 minutes ago, TampaChinnodu said:

GHMC is a total failure. Oka roads levu , full domalu  , full land kabja lu , illegal constructions.

Bribes theesukovatam lone busy motham employees. 

tweet pittalo oka kutha pettu baaa...Ajay babu chuskuntadu

Posted
26 minutes ago, Paidithalli said:

tweet pittalo oka kutha pettu baaa...Ajay babu chuskuntadu

Image result for ktr india funny gifs

commissions 10gi tintam aapitey....domal kudutunna soya loki vastadu

  • Haha 2
Posted
1 minute ago, mettastar said:

700crs aa domalaki budget damn

It is not government budget. It is amount people spend . Most probably it is more than that considering the amount of people who get sick. 

ఇలా రాజధానిలో నివసించే 35 లక్షల కుటుంబాలు దోమల నివారణకు ఏటా రూ.700 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నాయని జాతీయ ఆరోగ్య సంస్థల అధ్యయనంలో తేలింది. 

Posted
1 minute ago, TampaChinnodu said:

It is not government budget. It is amount people spend . Most probably it is more than that considering the amount of people who get sick. 

ఇలా రాజధానిలో నివసించే 35 లక్షల కుటుంబాలు దోమల నివారణకు ఏటా రూ.700 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నాయని జాతీయ ఆరోగ్య సంస్థల అధ్యయనంలో తేలింది. 

Okk got it

Posted
1 minute ago, himacream said:

golden telangana environmental friendly 

Andariki nyayam chesthadu maa sinna Dora 

Posted

@Android_Halwa anna endee idi nuvvu atta gammuna unte andhrollu rechipotharu ask Separate State for Mosquitoes. Avasaram aithe inko Chary ni ready cheddam 

  • Haha 2

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...