himacream Posted March 13, 2018 Report Posted March 13, 2018 as per eenadu Q/A, its obvious that AP will not gain anything జోన్‌ఝాటం రైల్వేజోన్ కుదరదని కుండబద్దలు కొట్టిన రైల్వే అధికారులు జనరల్‌మేనేజర్ వచ్చి కూర్చోవడం తప్ప ఏమీ ఉండదని వెల్లడి 13వ షెడ్యూల్ అమలుపై సమీక్షించిన హోంశాఖ కార్యదర్శి పాల్గొన్న రాష్ట్ర అధికార బృందం తాత్కాలిక క్యాంపస్‌లలో గిరిజన, కేంద్రీయ విశ్వవిద్యాలయాల తరగతుల ప్రారంభానికి అనుమతి కొత్త విధానం ప్రకారమే విశాఖ, విజయవాడ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్దేశం దుగరాజపట్నానికి ప్రత్యామ్నాయం చూడాలని సూచన ఈనాడు - దిల్లీ రైల్వే అధికారులు విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటు ఆశలపై నీళ్లు చల్లారు. అది సాధ్యం కాదని కుండబద్దలు కొట్టారు. కొత్త జోన్ లాభదాయకంకాదని ఇప్పటికే నివేదిక వచ్చిందని స్పష్టంచేశారు. దానివల్ల మీకేం లాభం ఉంటుందని ఏపీ అధికారులను ప్రశ్నించారు. జోన్ ఏర్పాటువల్ల కొత్తగా ఒక జనరల్ మేనేజర్ వచ్చి కూర్చోవడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అనవసరంగా పరిపాలన ఖర్చులు పెంచుకొనే స్థితిలో రైల్వేబోర్డు లేదని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల ఏర్పాటుపై హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గాబా, అదనపుకార్యదర్శి టీఎస్‌ఎన్‌వీ ప్రసాద్... వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, ఏపీ, తెలంగాణ అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని రైల్వేశాఖ అధికారులు విస్పష్టంగా చెప్పారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గాబా: విజయవాడ, విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులనూ కొత్త మెట్రో విధానంప్రకారమే చేపట్టాలి. ఏపీ అధికారులు: ఈ 2 మెట్రో ప్రతిపాదనలు పాత విధానం అమల్లో ఉన్నప్పుడే పంపినందున ఆ ప్రకారమే చూడాలి. రాజీవ్: మీ విజ్ఞప్తితో ఏకీభవించట్లేదు. కొత్త విధానం వచ్చాక పాతదాని ప్రకారం వెళ్లడం కుదరదు. అందువల్ల మీరు పదేపదే అదే డిమాండ్ చేయడంవల్ల ఉపయోగం ఉండదు. పాత విధానంలో ఉన్నవన్నీ కొత్త విధానంలోనూ ఉన్నాయి. పాత దాంట్లో ఉండి కొత్త దాంట్లో లేనివేంటో చెప్పండి. మీరు ఇక్కడ కూర్చున్నా పాతపాలసీ ప్రకారం వెళ్లడం సాధ్యంకాదు. కాబట్టి కొత్త విధానం ప్రకారం రెండు మెట్రోలను పరిశీలించండి. కొత్త విధానంలో పీపీపీ తప్పనిసరి చేసినప్పటికీ అందుకు తగ్గ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(నష్ట నివారణ నిధి) ఉంది. కాబట్టి ఆ ప్రయోజనాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. (అయితే ఈ సమావేశానికి ఏపీ పట్టణాభివృద్ధిశాఖ అధికారులు హాజరుకానందున ఈ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగలేదని సమాచారం.) విశ్వవిద్యాలయాలపై... రాజీవ్: కేంద్ర, గిరిజన విశ్వవిద్యాలయాలకు ఆర్థికశాఖ వ్యయ విభాగం ఆమోదముద్ర వేసింది. ఈ అంశం ఇంకా కేబినెట్ దాకా వెళ్లలేదు. సీఎస్... కేంద్ర ఉన్నత విద్యాశాఖ అధికారులతో: ఆ రెండింటికి సంబంధించిన బిల్లులు పార్లమెంటుకు వచ్చేలోపే ఈ విద్యాసంవత్సరం నుంచే తాత్కాలిక క్యాంపస్‌లలో తరగతులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోండి. రాజీవ్: అవును. అలాగే ముందుకెళ్తే బాగుంటుంది. వెంటనే అనుమతులు తీసుకొని తాత్కాలికంగా తరగతులు ప్రారంభించండి. విద్యా సంస్థల నిర్మాణం... ఏపీ అధికారులు: రాష్ట్రంలో ఇప్పటివరకూ ఏర్పాటుచేసిన విద్యాసంస్థల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలు మినహాయించి మిగిలిన సంస్థల నిర్మాణ పనులేవీ ప్రారంభంకాలేదు. ఇప్పటికే అన్నింటికీ స్థలాల కేటాయింపు పూర్తయినందున నిర్మాణాలను వేగవంతం చేయాలి. శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించాలి. రాజీవ్.. హెచ్‌ఆర్‌డీ అధికారులతో: అన్ని భవనాలకూ డీపీఆర్ సాధ్యమైనంతత్వరగా ఖరారుచేయండి. అది పూర్తయితేనే దేనికెంత నిధులు కావాల్సి వస్తుందో తెలుస్తుంది. ఏపీ అధికారులు: మేం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారాన్ని కోరుతున్నాం. ఏ డీపీఆర్ ఏస్థాయిలో ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రాజధాని నిర్మాణ నిధులపై... ఏపీ అధికారులు: విజయవాడ, గుంటూరులో భూగర్బడ్రెయినేజీ నిర్మాణం కోసం ఇచ్చిన నిధులను రాజధాని నిధులతో కలపొద్దు. రాజీవ్: మీ వాదన సరైనదే. నేను ఏకీభవిస్తున్నా. రాజీవ్... ఆర్థిక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులను ఉద్దేశించి: ఆ రెండునగరాలకు ఇచ్చిన వెయ్యికోట్ల రూపాయలను రాజధాని నిర్మాణంతో ముడిపెట్టొద్దు. రాజధానితో మిగతా ప్రాంతాల అనుసంధానాన్ని వేగవంతం చేయాలి. విజయవాడ-గుంటూరు-అమరావతి రైల్వేలైన్ నిర్మాణ పనులు వెంటనే మొదలుపెట్టాలి. (హైదరాబాద్-అమరావతి మధ్య వేగవంతమైన రైలు, రోడ్డు అనుంసధానంపైనా చర్చ జరిగింది.) పెట్రోకెమికల్ కాంప్లెక్స్... రాజీవ్: పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను తగ్గించాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మీ ప్రతిపాదనలేంటో ఆర్థికశాఖ పరిశీలనలకు పంపండి. వారు పరిశీలించి ఎవరు ఎంత భరించడానికి వీలవుతుందో చెబుతారు. కడప ఉక్కు పరిశ్రమ... రాజీవ్... ఉక్కుశాఖ అధికారులతో: కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి మెకాన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు వేగవంతం చేయండి. టాస్క్‌ఫోర్స్ సమావేశం ఏర్పాటుచేసి తక్షణం మెకాన్ నివేదికకు ఆమోదముద్ర వేసి చర్యలు తీసుకోండి. దుగరాజపట్నం పోర్టు... ఏపీ సీఎస్... కేంద్ర అధికారులతో: దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని నీతి ఆయోగ్ చెప్పిందని కేంద్రం చెబుతున్నందున ప్రత్యామ్నాయ స్థలాన్ని కేంద్రమే ప్రతిపాదించాలనేది మా అభిప్రాయం. ఎక్కడ పోర్టు ఏర్పాటుచేస్తే లాభదాయకంగా ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉంటుంది కాబట్టి మీరెందుకు ప్రత్యామ్నాయ పేరు సూచించకూడదు? రాజీవ్: ఈ వాదన సరైనదే. మీరే(కేంద్ర అధికారులు) ఏదో ఒక ప్రత్యామ్నాయం ప్రతిపాదించండి. కొంత సానుకూలం: ఏపీ అధికారులు సోమవారం నాటి సమావేశం కొంత సానుకూలంగానే సాగిందని ఏపీ అధికారులు చెప్పారు. హోంశాఖ కార్యదర్శి అన్నీ సావధానంగా ఉన్నారని చెప్పారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించమని చెబుతూ చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలను సానుకూలంగా పరిశీలించాలని వివిధ శాఖల అధికారులకు సూచించినట్లు చెప్పారు. ఆయా సంస్థలు ఏర్పాటుచేయాలన్న ఉద్దేశంతోనే చట్టంలో పెట్టి ఉంటారు తప్పితే సాధ్యాసాధ్యాలు పరిశీలించి వీలుకాదని చెప్పడం చట్టం ఉద్దేశం అయి ఉండదని ఆయన పేర్కొన్నట్లు వెల్లడించారు. విభజన సమస్యలపై హోంశాఖ కార్యదర్శి ఇలా పూర్తిస్థాయి సమీక్ష ఏర్పాటుచేయడం మూడేళ్ల తర్వాత ఇదే ప్రథమమని ఏపీ అధికారులు చెప్పారు. మూడునెలలకోసారి ఇలాంటి సమావేశం ఏర్పాటుచేస్తే సమస్యల పరిష్కారంలో కొంత పురోగతి ఉంటుందని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరఫున సీఎస్ దినేష్‌కుమార్, విభజన వ్యవహారాల ముఖ్యకార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి, రహదారులు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, ఉన్నతవిద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఏపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరి, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ఆరోగ్యరాజ్, ఏపీభవన్ రెసిడెంట్‌కమిషనర్ ప్రవీణ్‌ప్రకాశ్, తెలంగాణ నుంచి తెలంగాణ భవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్‌లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నత విద్య, ఉక్కు, రైల్వే, రహదారులు, నౌకాయానం, పట్టణాభివృద్ధిశాఖల అధికారులు పాల్గొన్నారు. Quote
himacream Posted March 13, 2018 Author Report Posted March 13, 2018 please post your inputs, @psycopk will intimate it to @chinababu to add it next PPT. Quote
AlaElaAlaEla Posted March 13, 2018 Report Posted March 13, 2018 1 minute ago, himacream said: please post your inputs, @psycopk will intimate it to @chinababu to add it next PPT. Quote
uttermost Posted March 13, 2018 Report Posted March 13, 2018 paapam TDP supporters ni TDP leaders aey mock chestharu ika nundi. ee db lo vaallu rest teeskovachu ika. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.