SonyKongara Posted March 14, 2018 Report Posted March 14, 2018 నాకే రాజకీయాలు నేర్పుతారా! 60 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు పోతే మీకు బాధ కలగదా? రాజకీయ నిర్ణయాలు తీసుకోలేరా? రైల్వే జోన్ కాదంటున్నారంటే ఏమనుకోవాలి? సెంటిమెంట్‌ను అప్పుడు గౌరవించి ఇప్పుడు తిరస్కరిస్తారా? కేంద్రం అనుకుంటే ఏదైనా సాధ్యమే! అసెంబ్లీలో నిప్పులు చెరిగిన చంద్రబాబు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నాకు భాజపా నాయకులు రాజకీయాలు నేర్పుతున్నారు. 1995లోనే ముఖ్యమంత్రినై తొమ్మిదేళ్లు పదవిలో ఉన్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి గత నాలుగేళ్లుగా సీఎంగా ఉన్నా. రాష్ట్రానికి సంబంధించి నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఆర్థిక సంస్కరణలతో లాభాలు వస్తాయని మొదటిసారి చెప్పింది నేనే. అలాంటి నాకు రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలియదా? విభజన హమీలపై భాజపా నేతలు అన్యాయంగా మాట్లాడుతున్నారు? భారత ప్రభుత్వం అంటే పెద్ద వ్యవస్థ. కేంద్రం ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇద్దరు, ముగ్గురితో కమిటీవేసి... ‘రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఈ విధంగా హామీలిచ్చాం... వారికి న్యాయసమ్మతంగా రావాల్సిన వాటిని ఇచ్చేసి, మాకు నివేదించండ’ని సూచిస్తే అన్నీ పనులు చకచకా పూర్తవుతాయి. కేంద్రానికి ఒక నిర్దిష్టమైన రాజకీయ విధానం ఉందా? అధికారుల నిర్ణయాలే కాదు... రాజకీయంగా తీసుకునే విధాన నిర్ణయాలు కూడా పాలనలో ప్రధానం. అసంబద్ధంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను ప్రజలు తుడిచిపెట్టేశారు. ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నా. అప్పటి ప్రధానమంత్రి ఏం చెప్పారో, తర్వాత ప్రధాని అయిన మోదీ ఏం హామీలిచ్చారో అవన్నీ పూర్తి చేయాలని డిమాండు చేస్తున్నా. సీమాంధ్ర రెవెన్యూ లోటును తప్పకుండా భర్తీ చేయలని రాజ్యసభలో ఆనాడు ప్రతిపక్ష నేతగా ప్రకటన చేసిన జైట్లీ ఇప్పుడు ఆర్థికమంత్రిగా ఏం మాట్లాడుతున్నారు? విభజన తరువాత రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుగా కాగ్, ఆర్థిక సంఘం నిర్థరించి 2014-15 బడ్జెట్లో కేటాయించాలని సూచిస్తే ఎందుకు కేటాయించలేదు? రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని అడగడానికి రాష్ట్ర భాజపా నేతలకు మొహమాటం ఉందేమో? నాకైతే లేదు. ఈనాడు - అమరావతి విభజన హామీల అమలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మరోసారి నిప్పులు చెరిగారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రంపై పుండు మీద కారం జల్లే విధంగా వ్యవహరిస్తారా? అని నిలదీశారు. శాసనసభలో మంగళవారం సాయంత్రం గంటన్నరపాటు ఆయన ‘2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం అమలు’పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడారు. కేంద్రం తలచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని కేంద్రానికి సూచించలేదని, కేంద్రం ఎప్పుడైనా ఇవ్వొచ్చని 14వ ఆర్థిక సంఘ ఛైర్మన్ వైవీ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో, సంఘ సభ్యుడు గోపాలరావు మరో సందర్భంగా స్పష్టంగా చెప్పారన్నారు. అయినప్పటికీ 14వ ఆర్థిక సంఘం ఇవ్వొద్దన్న కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామని కేంద్రం చెప్పడం ఎంతవరకు భావ్యమని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘‘నిన్న ఒక అధికారి...విశాఖలో రైల్వే జోన్ సాధ్యం కాదని చెప్పారంటే ఏమనుకోవాలి? ఏ సమయంలో ఏం చేయాలో చేయకుండా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా? ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత మోదీ, అమిత్‌షా, జైట్లీ వివిధ సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి అన్యాయం జరగదని, ఇతోధికంగా సహకరించి ఆదుకుంటామని హామీ లిచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయమంటే నిరాదరణ ప్రదర్శించడం బాధేస్తోంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడడంలేదు’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగని అధైర్యపడాల్సిన అవసరం లేదని, హోదా రాష్ట్ర ప్రజల హక్కని, ఇందుకోసం చివరివరకు రాజీలేని పోరాటం చేస్తానని అన్నారు. కేంద్రాన్ని మంత్రి పదవి కావాలని, గవర్నర్, కార్పొరేషన్ ఛైర్మన్ ఇవ్వాలని ఏ రోజూ అడగలేదని చెప్పారు. నేను కేంద్రంతో లాలూచీ పడినా, భయపడినా కేందాన్ని ప్రత్యేక హోదా కోసం నిలదీసేవాణ్ని కాదన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు రాష్ట్రాభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపవని, సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయని వివరించారు. ‘సెంటిమెంట్’తో తెలంగాణ ఇవ్వలేదా? సెంటిమెంట్‌తో నిధులు రావని చెప్పిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అదే సెంటిమెంట్‌ను గౌరవించి భాజపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్లో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినపుడు ఆమోదించలేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వం, రెవెన్యూ లోటు ఇచ్చేశాం అంటే ఒప్పుకోవాలా? 60 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు పోతే మీకు బాధ కలగదా? అని సభలోని భాజపా శాసనసభా పక్ష నాయకుడు విష్ణుకుమార్రాజుని ఉద్దేశించి అన్నారు. ‘‘40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన నేను దేశంలోనే సీనియర్ నాయకుడ్ని... ఇందిరాగాంధీని మా నాయకుడు ఎన్టీఆర్ ధైర్యంగా ఎదుర్కొని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. యునైటెడ్ ఫ్రంట్‌కు నేను కన్వీనర్‌గా చేశాను. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించకుండా రాష్ట్రాన్ని విభజించడంతో అడ్రస్ లేకుండా పోయింది’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాల్ని గౌరవించి భాజపా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. శాసనసభా స్థానాలను 175 నుంచి 225కు పెంచాలని కోరినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. గతంలో ఆరు సూత్రాల విధానంతో పెంచారు, ఇప్పుడేమో కొత్త మెలిక పెడుతున్నారని చెప్పారు. బ్యూరోకాట్లు వద్దంటే వదిలేస్తారా? రాజకీయంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని, బ్యూరోక్రాట్లు కాదన్నారని ఊరుకుంటే రాష్ట్రంలోని కిడ్నీ బాధితులకు పింఛన్లు అందించేవారమా? అని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. విశాఖలో రైల్వే జోన్పైగా రాజకీయంగా ఎందుకు నిర్ణయం తీసుకోరని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఐదేళ్లలో పూర్తి చేస్తామన్న హామీలు నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించలేదంటే రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. ‘‘మా పార్టీ నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ గౌరవం కోసం పోరాడితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఆత్మ విశ్వాసంతో చివరి వరకు పోరాటం చేస్తాను’’ అని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేవరకు కేంద్రం సహకరించేలా కేంద్రంపై ఒత్తిడి ఉంటుందని అన్నారు. రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు.. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ స్వార్ధం కోసం అప్పుడు, ఇప్పుడు పని చేస్తున్నందునే ఒక ఆయన (జగన్‌ను ఉద్దేశించి) అడ్రస్ లేకుండా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడనని, నంబరు వన్ రాష్ట్రంగా చేసేవరకు పోరడతానని అన్నారు. ‘‘ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదలేసి వైకాపా నన్ను విమర్శిస్తోంది. మోదీపై విశ్వాసం ఉంటే అవిశ్వాసం ఎందుకు? ప్రజలు మోసపోరు. శాశ్వతంగా శిక్షిస్తారు. ఎ1, ఎ2 నిందితులు ప్రధానిని ఎందుకు కలుస్తున్నారు. భాజపాలో జరిగే కీలక నిర్ణయాలు వైకాపాకు ముందుగానే ఎలా తెలుస్తున్నాయి. భాజపా రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో వైకాపా పార్లమెంటుసభ్యుడు విజయసాయిరెడ్డికి ముందుగానే తెలిసినట్లుంది. కోవింద్‌ను విజయసాయిరెడ్డి కలిసిన ఫొటో పేపర్లో ప్రచురితమైంది. ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్ చేసి చెప్పే వరకు తనకు తెలియదు. పవర్ఫుల్ లాబీయింగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. తప్పులు చేసే వారికి అధికారం వద్ద స్వేచ్ఛ ఉండనే కూడదు. ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ఇస్తారని విజయసాయిరెడ్డి అంటున్నారు. అలాంటప్పుడు వారి పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెడుతుందో అర్థంకావడంలేదు. పైగా మా సంతకాలు ఎందుకు అడుగుతారు ..’’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘‘పోలవరానికి సంబంధించి డీపీఆర్-2 ప్రకారం నిధులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,500 కోట్లకుపైగా మొత్తం కేంద్రం నుంచి రావాల్సి ఉంది. 2019 నాటికి పోలవరాన్ని పూర్తిచేసి తీరుతాం. ఈ ప్రాజెక్టును వైకాపా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది’’ అని సీఎం అన్నారు. చంద్రబాబు నోట మోదీ మాట ఈనాడు డిజిటల్, అమరావతి: అసెంబ్లీలో మంగళవారం కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలను హిందీతోపాటు, తెలుగులోనూ ప్రస్తావించారు. ‘‘సీమాంధ్ర వికాసానికి సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఒకే ఒక వ్యక్తికి మొత్తం ఘనత దక్కుతుంది. ఆయనే నెల్లూరు జిల్లా బిడ్డ వెంకయ్యనాయుడు. నేను మీకు ప్రమాణం చేస్తున్నా. మేం దిల్లీలో అధికారం దక్కించుకుంటే మీకు ఇచ్చిన వాగ్దానాల కంటే ఇంకా ఎక్కువ చేస్తామని మాటిస్తున్నా’’ అని మోదీ చేసిన ప్రసంగాన్ని ముఖ్యమంత్రి హిందీలో చదివి వినిపించారు. అలాగే‘‘బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురిట్లోనే చంపేసిన చందంగా ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరించింది. తామే గనుక అధికారంలో ఉంటే తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా రెండు ప్రాంతాలకు న్యాయం చేసే వాళ్లం’ అని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా గుల్బర్గాలో మోదీ చేసిన వ్యాఖ్యను గుర్తుచేశారు. తెలుగు వారు గర్వపడేలా రాజధాని... ‘‘రాష్ట్రానికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? ఆర్థికంగా బలంగా ఉన్న బెంగుళూరు మెట్రోకు రూ.17వేల కోట్లు ఇచ్చారు. బెంగుళూరు, ముంబయి నగరాలకు నిధులిచ్చి, ఏపీకి ఎందుకివ్వరు? రాజధాని నిర్మాణం పూర్తయితే కేంద్రానికే ఎక్కువ ఆదాయం వస్తుంది. పన్నులో రాయితీలను కల్పించాలి. పొరుగు రాష్ట్రాలకంటే బాగా రాజధానిని నిర్మించాలన్నది నా నిర్ణయం. తెలుగువారు గర్వపడేలా రాజధాని నిర్మాణాలు ఉంటాయి. 2018లో దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలని చట్టంలో ఉంది. నాలుగేళ్ల తరువాత మరోప్రాంతాన్ని చూపించాలని తాజాగా కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ వచ్చింది. సంస్థల విభజనలో ఆలస్యంవల్ల రూ.3820 కోట్ల ఆదాయం తెలంగాణకే పోతోంది. విశాఖ మెట్రోరైలు ఎందుకు సాధ్యంకాదు. కేంద్ర ప్రభుత్వ వైఖరివల్లనే విజయవాడ కనకదుర్గ గుడిదగ్గర ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. జాతీయ విద్యా సంస్థల నిర్మాణాల్లో పురోగతి కనిపించడంలేదు. తిరుపతి ట్రిపుల్ఐటీ విద్యార్థులు కంచిలో చదువుతున్నారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో విద్యా సంస్థల నిర్మాణాల పురోగతి సంతృప్తికరంగా లేదు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తా. వాటి ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది. జగన్ దోచుకున్న రాష్ట్ర సంపదను, తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే చెందేలా చూడాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగాను’’ అని చంద్రబాబు అన్నారు. Quote
Coolindian Posted March 14, 2018 Report Posted March 14, 2018 when NTR ni vennupoti podichinappudu CBN ki aa rajakeeyalu evaru nerparoooooooooooooo Quote
chedugudu_chidambaram Posted March 14, 2018 Report Posted March 14, 2018 1 hour ago, Coolindian said: when NTR ni vennupoti podichinappudu CBN ki aa rajakeeyalu evaru nerparoooooooooooooo every thing is waived off with "CBN Development" Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.