Jump to content

Recommended Posts

Posted

636568084847439537.jpg

chakram thippabothunnaru... bl@stbl@st

ఎన్డీయేకు చెక్ పెట్టేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నట్లు ఓ జాతీయ ఛానల్ కథనం పేర్కొంది. 11 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వచ్చే నెలలో మహానాడు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. యునైటెడ్ ఫ్రంట్ మొదటి సమావేశం వచ్చే నెల 7న జరుగుతుందని పేర్కొంది. శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్), మమత బెనర్జీ (టీఎంసీ), మాయావతి (బీఎస్‌పీ), స్టాలిన్ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), నవీన్ పట్నాయక్ (బీజేడీ), ఓం ప్రకాశ్ చౌతాలా (ఇండియన్ నేషనల్ లోక్‌దళ్), అసోం గణపరిషత్ (ఏజీపీ)లతో చంద్రబాబునాయుడు మాట్లాడినట్లు ఆ కథనం పేర్కొంది.

Posted

బాబూ...భేష్ : మమతా బెనర్జీ
కోల్‌కతా: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ స్వాగతించారు. ప్రతి రాష్ట్రానికి సొంత సమస్యలు, అంశాలు ఉన్నాయని, టీడీపీకి కూడా అలాంటి సమస్యలే ఉన్నాయని ఆమె అన్నారు. మొదట్లో ఎన్డీయేతో జతకట్టినప్పటికీ ఇప్పుడు ఒక నిర్దిష్టమైన కారణంతో కూటమి నుంచి వైదొలగాలని టీడీపీ నిర్ణయించుకుందని అన్నారు. టీడీపీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆమె సమర్ధించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో పొత్తు తెంచుకున్నట్టు టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించిన కొద్ది సేపటికే మమతాబెనర్జీ స్పందించారు.

 
Posted
XvAx1zFG_bigger.jpgMamata BanerjeeVerified account @MamataOfficial
FollowFollow @MamataOfficial
MoI welcome the TDP's decision to leave the NDA. The current situation warrants such action to save the country from disaster
Posted

నేను ప్రిపేర్ అయి రాలేదు, ప్లీజ్ నన్ను ఏమి ప్రశ్నలు అడగకండి, నెక్స్ట్ టైం మళ్ళీ కూర్చుందాం, ప్రిపేర్ అయివొస్తా : పవన్ కళ్యాణ్

out of syllabus questions అడిగితే ఇంతే.. Waiting.. కొత్త స్క్రిప్టు కోసం

Pulka PK gaaa @3$%

Posted
‘ఏ రాజకీయ నాయకుడు నాలా కష్టపడలేదు. ఇన్ని సంక్షోభాలూ ఎదుర్కోలేదు. ప్రతిది అవకాశంగా, ఛాలెంజ్‌గా తీసుకున్నా. భయమంటే తెలియదు. 2004-09లో విపక్షంలో ఉన్నపుడు మామూలు వాళ్లయితే అన్ని సమస్యలు ఎదుర్కోలేరు. పరిటాల రవిని పార్టీ కార్యాలయంలో చంపేశారు. అనంతపురంలో కొన్ని హత్యలు జరిగాయి. ఇలాంటి సంఘటనల్లో చనిపోయినవారి పిల్లల కోసం ఎన్టీఆర్‌ మెమోరియల్‌ స్కూల్‌ పెట్టి మంచి చదువు చెప్పిస్తున్నాం.
15ap-main4d.jpg‘మొదటి నుంచి ఎన్టీఆర్‌తో కలసి జాతీయ రాజకీయాల్లో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. కాంగ్రెసేతర ప్రతిపక్షాలను, సిద్ధాంతపరంగా వేర్వేరు దారుల్లో ఉన్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చింది ఎన్టీఆర్‌. నేషనల్‌ ఫ్రంట్‌కు ఎన్టీఆర్‌ ఛైర్మన్‌, వీపీ సింగ్‌ ప్రధాని... అదీ తెదేపా సత్తా. 1985లో పార్లమెంటులో తెదేపా ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. భాజపా రెండే సీట్లు గెలుచుకుంది. ప్రజల కోసం రాజీలేకుండా పోరాడతా. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం.
15ap-main4e.jpg‘మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కడితే పోరాడినందుకు నన్ను అరెస్టు చేశారు. నేను తప్పు చేయలేదు. మా సరిహద్దు దాటి వచ్చి మీ వాళ్లే అరెస్టు చేశారని వాదించా. చాలా దారుణంగా ప్రవర్తించారు. పాదయాత్ర చేస్తున్నపుడు గ్రామగ్రామాన కరెంటు లేక రాత్రుళ్లు మంటలు వేసుకుని కాపలాకాసిన వారిని చూశా. నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచి వెళుతున్న మహిళలను గమనించా.
15ap-main4c.jpg‘ఎన్టీఆర్‌ నుంచి క్రమశిక్షణ, కఠోర శ్రమ, నిరంతరం ప్రజల గురించి ఆలోచించడం, ధైర్యంగా ముందుకువెళ్లే చొరవ అలవడ్డాయి. మా తల్లిదండ్రులకంటే గొప్పగా ఎన్టీఆర్‌ను గుర్తు పెట్టుకుంటా. ఇక్కడ ఎమ్మెల్యేలకు, పార్టీ కార్యకర్తలకు ఏ క్రమశిక్షణ ఉందో లోకేష్‌కు, బ్రాహ్మణికి, దేవాంశ్‌కు అదే క్రమశిక్షణ...నా భార్య లోకేష్‌ను, బ్రాహ్మణిని బాగా చదివించేందుకు స్టాన్‌ఫోర్డ్‌కు పంపించేందుకు చేసిన కృషిని మర్చిపోలేను. శుభసందర్భాల్లో కొంత సమయం ఇవ్వమని ఆమె అడిగారు. వారానికి గంట రెండు గంటలు సమయం అడుగుతారు. ఆ కోరిక తీర్చలేకపోతున్నా’.
Posted

Yaayyyy Chakram tirguthundhi @3$%CITI_c$y

Posted
17 minutes ago, perugu_vada said:

Lol e erripu dhaani stmts n dheenni encouraging ah chivariki :o 

She is a dynamic leader and she will be a PM Ani feminist vargalu cheptjunaru

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...