Navyandhra Posted March 22, 2018 Report Posted March 22, 2018 త్వరలో నందమూరి మల్టీస్టారర్ రాబోతోందా? నందమూరి కథానాయకులు కలసి నటించబోతున్నారా? అవుననే సమాధానం వస్తోంది ఫిల్మ్‌నగర్ వర్గాల నుంచి. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఇది మల్టీస్టారర్ అని, ఈ చిత్రంలో మరో కథానాయకుడు కూడా కనిపిస్తారని కల్యాణ్ రామ్ ఇది వరకే చెప్పేశారు. ఆ కథానాయకుడు ఎవరన్న ఆసక్తికరమైన చర్చ మొదలైందిప్పుడు. ఆ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపిస్తారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. బాలయ్య ఇంకా కథ వినలేదని, కథ వింటే గనుక... తప్పకుండా ఒప్పుకుంటారని, ఆయన ఒకవేళ ‘నో’ అంటే... అప్పుడు మరో కథానాయడి పేరు పరిశీలిస్తారని, తొలి ఓటు మాత్రం... బాలయ్యకే అని తెలుస్తోంది. కల్యాణ్ రామ్ నటించిన ‘ఎం.ఎల్.ఎ’ శుక్రవారం విడుదల అవుతోంది. ‘నా నువ్వే’ మేలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తరవాతే పవన్ సాధినేని సినిమా పట్టాలెక్కుతుంది. Quote
afdbzindabad Posted March 22, 2018 Report Posted March 22, 2018 Does he know who kalyan ram is ?? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.