Jump to content

Recommended Posts

Posted

 

ఉద్యోగుల వేతనాల చెల్లింపులో ఆలస్యాన్ని దూరం చేసేందుకు.. ప్రతి నెలా ఒకటో తేదీనే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఈ-కుబేర్‌ విధానాన్ని అమలు చేయనుంది. ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు వివిధ బిల్లులకు వర్తించనుంది. వేతనాలను సంబంధిత ఉద్యోగుల ఖాతాలలోకి జమ అయ్యేలా ప్రతి నెలా 1వ తేదీన అందేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో దాదాపు 40 వేలకు పైగా ఉద్యోగులు, 20 వేలకు పైగా పింఛనుదారులకు ఈ విధానంలో లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ శాఖలో వేతనాలకు సంబంధించి అధికారులు బిల్లులు తయారుచేసి ఖజానా కార్యాలయాలకు పంపిస్తున్నారు. ఆ తరువాత వారు బ్యాంకులకు పంపిస్తారు. బ్యాంకుల్లో పాసైన తరువాత ఉద్యోగుల ఖాతాల్లోకి జమ అవుతాయి. ఈ ప్రక్రియ జరిగేసరికి మూడు రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి వారం రోజులు పట్టిన సందర్భాలుంటున్నాయి. ఏప్రిల్‌ నుంచి అమలు చేసే ఈ-కుబేర్‌ విధానంతో సమస్యలన్నీ తీరనున్నాయి.

సాంకేతిక బాటలో 
ఖజానా శాఖ కూడా సాంకేతిక బాట పట్టింది. కార్యాలయాలలో ఆర్థిక లావాదేవీల నిర్వహణ జాప్యంపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. ఖజానా శాఖను ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే వచ్చేనెల ఏప్రిల్‌ ఒకటో తేదీ  నుంచి మాన్యువల్‌ బిల్లులకు స్వస్తి పలికింది. నూతన విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ విధానంలో మొబైల్‌, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా ఖజానాలో నిధులను జమ చేయవచ్చు. ఖజానా శాఖ ద్వారా అందిస్తున్న సేవలన్నీ ఇక నుంచి ఈ-కుబేర్‌ విధానంలో అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మాన్యువల్‌ పద్ధతిలో బిల్లులకు స్వస్తి పలికి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్‌ఎంఎస్‌)ను అమలు చేస్తున్నారు. ఇందుకోసం సంబంధిత శాఖ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానం అమలు అయితే ఉద్యోగులు, పింఛన్‌దారులు, గుత్తేదారులకు ఎంతో ఉపయోగ¢ం. గతంలో బిల్లులు మంజూరు కావాలంటే అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉండేవి. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో ఆన్‌లైన్‌ చేసిన 24 గంటల్లోనే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుత వ్యవస్థ నిలిపివేత.. 
ఈ నెల 31వ తేదీతో అన్ని ఖజానా శాఖల్లోనూ ప్రస్తుత వ్యవస్థను నిలిపివేయనున్నారు. 20వ తేదీలోగా డీడీవోలు బిల్లులను ఆయా ఖజానాలలో సమర్పించాలని తెలిపారు. ఆ తరువాత ఖజానాలలో ఎటువంటి బిల్లులు స్వీకరించరని సంబంధిత శాఖ అధికారులు చెప్పారు. మార్చి 31వ ఆర్థిక సంవత్సరం ముగింపు ఉండేది. ఈసారి కొత్త విధానం ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు చేస్తున్న నేపథ్యంలో ఖజానా శాఖలో ఈ నెల 24వ తేదీలోపు బిల్లుల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంటుంది. 26 నాటికి ఆమోదం పొందిన అన్ని బిల్లులూ చెల్లించనున్నారు. 27, 28 తేదీలలో జిల్లాలోని అన్ని ఖజానా కార్యాలయాలను కొత్త విధానంలోకి మార్పు చేయనున్నారు. 29న మొదటి దశ పరిశీలన పూర్తి చేసి అన్ని ఖజానా శాఖల్లోనూ ప్రస్తుతం అమలు అవుతున్న విధానాన్ని 31వ తేదీతో నిలిపి వేయనున్నారు.

లాభం ఇలా.. 
ఈ-కుబేర్‌ ద్వారా బ్యాంకుల చుట్టూ ఉద్యోగులు తిరగాల్సిన పని లేదు. రిజర్వుబ్యాంకు నుంచి పింఛన్‌దారులకు, ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలు జమ కానున్నాయి. ప్రభుత్వ శాఖల డీడీవోలు వేతనాల బిల్లులను ఆన్‌లైన్‌లో సంబంధిత ఖజానా శాఖలకు పంపిస్తారు. అక్కడ నుంచి ఖజానా శాఖ అధికారులు ఈ-కుబేర్‌ సాంకేతిక పద్థతిలో ఆన్‌లైన్‌లో బిల్లులకు పరిశీలిస్తారు. ఉద్యోగుల బ్యాంకు ఖాతా,  ఐఎస్‌ఎఫ్‌సీ కోడ్‌, ఆధార్‌ సంఖ్యలను పరిశీలించి వేతనాలను నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానంలో ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలను అందిస్తారు. ఆర్‌బీఐ నుంచి వాణిజ్య, ప్రాంతీయ బ్యాంకులకు నగదు బదిలీ చేసే విధానాన్ని ఇకపై అమలు చేయరు. గతంలో ఆర్‌బీఐ ప్రధాన వాణిజ్య బ్యాంకు ఎస్‌బీఐకీ అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల వేతనాల సొమ్మును ఉద్యోగుల ఖాతాలకు జమ చేయనున్నారు.

మూడు అంచెలలో.. 
బిల్లుల సమర్పించే చెల్లింపులు మూడు అంచెలలో ఉంటాయి. ఈడీవో స్థాయిలో మేకర్‌, చెక్కర్‌ అనుమతులు ఉంటాయి. ఖజానా శాఖకు వచ్చేసరికి సీనియర్‌ అకౌంటెంట్‌, ఎస్టీవో, ఏటీవోలు ఆన్‌లైన్‌లో పరిశీలించి ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇస్తారు. ప్రతి ఒక్కరూ వేలిముద్రలు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. ఈ మూడు దశలు పూర్తయిన తరువాత రిజర్వు బ్యాంకు నుంచి వ్యక్తిగత ఖాతాలో సొమ్మును జమ చేస్తారు. చలానాలు కూడా ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. నూతన విధానంలో సత్వరమే బిల్లులు చెల్లించేందుకు ఆస్కారం ఉంటుంది.

డీవోలకు శిక్షణ.. 
జిల్లాలోని కొత్త విధానం అమలుపై ఖజానా శాఖ అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 23 నుంచి 29 వరకు బందరు, విజయవాడ, గుడివాడ, నూజివీడు తదితర రెవెన్యూ మండలాలకు సంబంధించిన అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. కంప్యూటర్లతో పాటు విద్యుత్తు అంతరాయం కలిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో బ్యాక్‌ అప్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా బిల్లులు ఎలా సమర్పించాలో ఈ శిక్షణ ద్వారా తెలియజేయనున్నారు.

బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత 
ఈ-కుబేర్‌ విధానంలో బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమలుల్లోకి వస్తుంది. దీని ద్వారా ఉద్యోగులు, పింఛన్‌దారులకు కూడా నేరుగా జీతాలు పడతాయి. దీనిపై జిల్లాస్థాయిలో డీడీవోలకు శిక్షణ ఇవ్వనున్నాం.

Posted

EEnadu/ABN lo pratee news item ni kathirinchi ikkada vesthe elaa bayyaa ... ads laaga annee oka post lo veseyyi opika unnavaadu

susthaadu kadaaa ... kotha news emo anukoni open chesthunnaam

akkada sadivi ikkadaa sadivi thala vaachipothondi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...