Demigod Posted March 26, 2018 Report Posted March 26, 2018 6 hours ago, SonyKongara said: రాజధానిలో ‘ఎఫ్1హెచ్2వో’ వరల్డ్ చాంపియన్‌షిప్ భవానీ ఐలాండ్‌కు ఎఫ్1హెచ్2వో ప్రతినిధులు ఓకే నవంబరు 22 నుంచి 24 వరకూ పోటీల నిర్వహణ తీవ్రంగా కృషి చేసిన సీఎం.. పర్యాటక శాఖకు ప్రతిష్ఠాత్మకం అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు మరో అవకాశం దక్కింది. ఫార్ములా1 పవర్‌బోట్ రేసింగ్‌లో ప్రసిద్ధి చెందిన ఎఫ్1హెచ్2వో ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు ఆతిథ్యమిచ్చే గొప్ప అవకాశం భారత్‌లోని అనేక నగరాలను కాదని అమరావతికి దక్కింది. అమరావతిలోని భవానీ ఐలాండ్‌లో ‘ఎఫ్1హెచ్2వో’ ప్రపంచ చాంపియన్‌షి్‌పను నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు ఎనిమిది ప్రతిష్ఠాత్మక వేదికల్లో భారత్ పేరుని కూడా చేరుస్తూ శనివారం షెడ్యూల్‌ను ప్రకటించారు. 2018 వరల్డ్ చాంపియన్‌షి్‌పలో భాగంగా ఎఫ్1 వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 8 మహానగరాల్లో వీటిని నిర్వహిస్తుంది. పోర్చుగల్, లండన్, ఫ్రాన్స్, చైనా, దుబాయ్‌తో పాటు ఈసారి భారత్‌కు కూడా చోటు కల్పించారు. మే నెల 18న పోర్చుగల్‌లో మొదలయ్యే ఈ చాంపియన్‌షిప్ డిసెంబరు 15న షార్జాలో ముగుస్తుంది. నవంబరు 22 నుంచి 24 వరకూ అమరావతి వేదికగా నిలవనుంది. ఇది వరల్డ్ చాంపియన్‌షిప్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు అమరావతికి వస్తారు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పర్యాటక శాఖ వారికి అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు స్టార్ హోటల్ రూమ్స్, అంతర్జాతీయ స్థాయి ఫుడ్‌కోర్టులు ఏర్పాటుపై దృష్టిపెట్టింది. చంద్రబాబు కృషి వల్లే.. అంతర్జాతీయ ఎఫ్1హెచ్2వో చాంపియన్‌షి్‌పను ఏపీకి రప్పించేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేశారు. ఎఫ్1హెచ్2వో ప్రతినిధులతో ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు చర్చించారు. అమరావతికి ఉన్న విశిష్టిత, ముఖ్యంగా పోటీలు నిర్వహణకు ఉన్న మౌలిక సదుపాయాల గురించి వివరించారు. ఎఫ్1హెచ్2వో ప్రతినిధులు భవానీ ఐల్యాండ్‌తో పాటు సమీపంలోని 11 ఐల్యాండ్స్‌ను పలుమార్లు పరిశీలించారు. చివరకు శనివారం అమరావతికి ఓకే చెప్పారు. ‘అమరావతిలో అద్భుతమైన 11 ఐల్యాండ్స్‌తో పాటు 23 కిలోమీటర్ల వాటర్ స్టోరేజ్ ఉంది. ఇది అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు అనువుగా ఉంటుంది. కాబట్టి మా టీమ్ అంతా ఏపీ రాజధాని అమరావతికి వెళ్లేందుకు సిద్ధమయ్యామ’ని పోటీల నిర్వాహకుల్లో ఒకరైన అలెక్స్ ప్రకటించారు. andaru happies... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.