Jump to content

durga fly over avvakunda central addupulla


Recommended Posts

Posted

durga.jpg

durga2.jpg

పై వంతెనకు అడ్డుపుల్ల..! 
బిల్లుల ఆమోదానికి కేంద్ర పీఏఓలో వ్యంగ్య వాఖ్యానాలు 
amr-top1a.jpg

‘ఇక నుంచి మీరు పంపే బిల్లులు అంత సులభంగా ఆమోదించం. అన్నీ సక్రమంగా ఉండి పైనుంచి అనుమతి ఉంటేనే అప్రూవల్‌ చేస్తాం.. సమీకరణాలు మారాయి..’

- కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి బిల్లుల చెల్లింపు (పీఏఓ) కార్యాలయంలో సిబ్బంది వ్యాఖ్యలు ఇవి.

కనకదుర్గ పైవంతెన పనులకు సంబంధించి బిల్లులు పంపుతున్న సిబ్బంది, గుత్తేదారుల ప్రతినిధులతో కేంద్ర పీఏఓ కార్యాలయం సిబ్బంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇక నుంచి అప్రూవల్‌ కావంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అహంభావంతో ప్రవర్తిస్తున్నారు.. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో మరి..!’

- కనకదుర్గ పైవంతెన నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను చూస్తున్న ఓ అధికారి ఆవేదన
ఈనాడు, అమరావతి

కనకదుర్గ పైవంతెన నిర్మాణంపై కేంద్ర రాజకీయ పరిణామాల ప్రభావం పడుతోంది. అసలే నిధుల సమస్య వల్ల నత్తతో పోటీ పడుతూ.. విజయవాడ నగరవాసులకు ట్రాఫిక్‌ కష్టాలు ఎలా ఉంటాయో చూపిస్తున్న కనకదుర్గ పైవంతెన మరింత జాప్యం కానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పైవంతెనకు నిధులు మంజూరు చేయాల్సిన కేంద్రం అడ్డంకులు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. బిల్లులను   ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు డీవియేషన్లకు ముప్పుతిప్పలు పెట్టి ఆరుసార్లు దస్త్రాలను తిప్పి కొట్టిన కేంద్రం ఇక ముందు బిల్లుల మంజూరుకు అడ్డుపుల్లలు వేయనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనకదుర్గ పైవంతెనను ఈఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. కానీ కనీసం నవంబరు 2018నాటికి ఇవ్వాలని గుత్తేదారులను కోరుతోంది. 2018 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని గుత్త సంస్థ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కేంద్రం దయ... ప్రజల ప్రాప్తంలా మారింది.

నిధుల కోసం ముప్పుతిప్పలు..! 
మొత్తం వ్యయంలో 75శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది. భూసేకరణ పరిహారం, పునరావాసం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. నాలుగు వరసల రహదారి, కనకదుర్గ పైవంతెన కలిపి రూ.448.60 కోట్లకు దక్కించుకుంది. అంచనా వ్యయం ప్రకారం ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ.334కోట్లు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.114.60కోట్లు కేటాయించాల్సి ఉంది. వాస్తవానికి రూ.282.4 కోట్లు మాత్రమే కేంద్రం భరించనుంది. పునరావాసం, భూసేకరణ ఖర్చు మినహాయించింది. కృష్ణలంక వద్ద అండర్‌పాస్‌ డీవియేషన్‌ రూ.11.40కోట్లు భరించేందుకు అంగీకరించింది. మొత్తం కలిపి రూ.293.8కోట్లు మాత్రమే కేంద్రం ఇవ్వనుంది. మిగిలిన మొత్తం రాష్ట్రం భరించాల్సి ఉంది. వాస్తవంగా ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు చేర్పులు ఉంటే సాంకేతిక కమిటీ, నిపుణుల కమిటీ ఆమోదం తెలిపితే ఆ మేరకు అనుమతిస్తారు. ఒకే ఒక్క డీవియేషన్‌ మినహా మిగిలిన డీవియేషన్లను అనుమతించబోమని కేంద్రం ఖరాఖండిగా చెప్పింది. దస్త్రాలను తిప్పికొట్టింది. దీంతో గుత్త సంస్థ వద్ద నిధుల లేమితో పాటు కేంద్రం నుంచి బిల్లులు ఆమోదం పొందక జాప్యం అవుతోంది.  రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారి వంతెనకు రూ.114.60 కోట్లు కేటాయిస్తే ఇప్పటికే రూ.170 కోట్లు చెల్లింపులు జరిపింది. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.144 కోట్లు బిల్లులు మంజూరు అయ్యాయి. ఈ జాతీయ రహదారి ప్రాజెక్టును రహదారులు, భవనాల శాఖ ఎన్‌హెచ్‌ విభాగం పర్యవేక్షిస్తుంది. కేంద్రానికి సంబంధించిన నిధులను బెంగళూరులో ఉన్న కేంద్ర చెల్లింపులు, గణాంక కార్యాలయం(పీఏఓ) నుంచి బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. విజయవాడలో ఉన్న ప్రాంతీయ పీఏఓ ప్రతినిధి బిల్లులను బెంగళూరుకు పంపిస్తారు. అక్కడి నుంచి గుత్తేదారుకు మంజూరు కావాల్సి ఉంటుంది. పైవంతెన పనులు ప్రారంభమైన నుంచి ఇంత వరకు రూ.144 కోట్ల వరకు కేంద్ర పీఏఓ నుంచి బిల్లులు మంజూరు అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్రం తన పరిధికి మించి నిర్మాణం జాప్యం కాకూడదనే ఉద్దేశ్యంతో రూ.170 కోట్లు వెచ్చించింది. ఇప్పటి వరకు 80శాతం కాంక్రీట్‌ పనులు అయిపోయాయి. 20శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం కాలువ, నదిలో పిల్లర్ల నిర్మాణం జరుగుతోంది. బిల్లులు ఆమోదించడానికి స్పైన్లు, వింగ్స్‌ అయితేనే కలిపి పెట్టాలని కేంద్ర పీఏఓ కార్యాలయం సూచిస్తోంది. నిధుల సమస్య వల్ల స్పైన్లు అయినంత వరకు ఇవ్వాలని గుత్త సంస్థ, పర్యవేక్షణ ఏజెన్సీ కోరినా అనుమతించలేదు. 23 పిల్లర్ల వరకు స్పాన్లు బిగించారు. అయితే 10 స్తంభాలకు వింగ్స్‌ బిగించాల్సి ఉంది.

వయాడక్ట్‌ సంగతేంటో... 
విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద వయాడక్డు నిర్మాణానికి కేంద్రం మోకాలడ్డు వేసింది. ఇక్కడ వంతెన ఆకృతిని మార్చారు. వయాడక్డు నిర్మాణం చేయాలని సీఎం ప్రతిపాదించారు. దీనికి అయ్యే వ్యయాన్ని భరించాలని కేంద్రానికి లేఖ రాస్తే తిరస్కరించింది. మూడు సార్లు అభ్యర్థన పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. స్వయంగా సీఎం లేఖ రాసినా ఆమోదించలేదు. దీంతో ఈ విభాగానికి అయ్యే ఖర్చు రూ.17.28కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. అంటే ఇప్పటికి ఖర్చు చేసిన రూ.170 కోట్లకు ఇది అదనం. గతంలోనే తిరస్కరించిన నేపథ్యంలో ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనవసర కొర్రీలు వేస్తున్నారని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకటి నుంచి విడుదల! 
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కనకదుర్గ పైవెంతన మార్గంలో ట్రాఫిక్‌ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మొదట ద్విచక్రవాహనాలను మాత్రమే అనుమతించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత కార్లు, ఇతర వాహనాలను అనుమతించాలని ప్రతిపాదించారు. దీనిపై కలెక్టర్‌ సమక్షంలో పోలీసు అధికారులు, ర.భ. అధికారులు సమీక్షించనున్నారు. 23 వ పిల్లర్‌ వరకు స్పాన్లు భిగించడం వల్ల ద్విచక్ర వాహనాలను అనుమతించే అవకాశం ఉందన్నారు. రాత్రి పూట నిలుపుదల చేసి పనులు జరపాలనేది ప్రతిపాదన. కాలువల్లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇటీవల నీరు విడుదల చేయడం కొంత సమ్య వచ్చింది. తిరిగి జూన్‌లోనే ఖరీఫ్‌కు పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని విడుదల చేయనున్నారు. దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని ఎస్‌ఈ జాన్‌మోషే ‘ఈనాడు’తో చెప్పారు.

Posted

nenu eppudo cheppa ...NDA nunchi bayatki vachinandhuku TDP will win 2019 but A.P will loose for next 6 years ani ...

Posted
3 minutes ago, argadorn said:

nenu eppudo cheppa ...NDA nunchi bayatki vachinandhuku TDP will win 2019 but A.P will loose for next 6 years ani ...

@cc

Posted

Mana rastraniki evaru dikku ?? Denemma evadu gelichina blow job party ilage adukunedi

Posted

Probably the State will not get any funds until elections. Hope that BJP wont come to power next time 

Posted
1 hour ago, argadorn said:

nenu eppudo cheppa ...NDA nunchi bayatki vachinandhuku TDP will win 2019 but A.P will loose for next 6 years ani ...

Andhuke maa jagananna ni gelipusthe maa ViSa kaallumokkaina sare anni theppisthadu

Posted
1 minute ago, TOM_BHAYYA said:

Andhuke maa jagananna ni gelipusthe maa ViSa kaallumokkaina sare anni theppisthadu

@aathulu jalluthada ViSa

Posted
3 minutes ago, MDharmarajuMA said:

@aathulu jalluthada ViSa

Raastra prayojanalakosam gongali purugunaina mudhhadaniki ready maa ViSa

Posted
1 minute ago, TOM_BHAYYA said:

Raastra prayojanalakosam gongali purugunaina mudhhadaniki ready maa ViSa

^^ Bodi Kalini  already muddhu pettkunnadu ani pulka singh @Navyandhra pmed

Posted
2 minutes ago, TOM_BHAYYA said:

Raastra prayojanalakosam gongali purugunaina mudhhadaniki ready maa ViSa

evaru sharu akka na?

Posted
1 minute ago, MDharmarajuMA said:

evaru sharu akka na?

vodinani ala ante pebby pans feel avtharu bro 

Posted

appudu eppudoo  krishna pushkaralu lopala complete chestam annadu

 

inka raleda avi?

Posted
1 minute ago, Hydrockers said:

appudu eppudoo  krishna pushkaralu lopala complete chestam annadu

 

inka raleda avi?

vallu next krishna pushkaralu annaru.. 

Posted
14 minutes ago, Paidithalli said:

vallu next krishna pushkaralu annaru.. 

  • @3$%@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...