Jump to content

Recommended Posts

Posted
‘అమెరికా కల’ ఆలస్యమవుతోంది!

09015828BRK-USA-NRI1A.JPG

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని.. అక్కడే స్థిరపడిపోవాలన్నది చాలా మంది భారతీయ యువత కల. దానికోసం అహోరాత్రులు కష్టపడుతుంటారు.  కానీ డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక విదేశీయులకు అమెరికా పౌరసత్వం ఇచ్చే విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. గత దశాబ్దకాలంలోని గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రస్తుతం పౌరసత్వం విషయంలో అమెరికా ధోరణి చూస్తుంటే .. భారతీయులు తమ ‘అమెరికా కల’  కోసం ఎంతో సహనంతో నిరీక్షించాల్సిందేన్ననది నిపుణుల మాట.

గత 30ఏళ్ల గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే.. 2008లో అమెరికా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందని చెప్పక తప్పదు. ఆ ఏడాది 65,971 మందికి పౌరసత్వాన్ని ఇచ్చింది. 1995-2000 మధ్య కాలంలో ఏడాదికి 1,20,000 చొప్పున భారత్‌కు నుంచి అత్యంత నైపుణ్యం గల వారు అమెరికాకు వలస వెళ్లారు.

అయితే పౌరసత్వాల విషయానికొస్తే 2017లో ఈ సంఖ్య 49,601గా ఉండగా.. 2014లో ఇది ఆ దశాబ్దానికే అతి తక్కువ సంఖ్యలో 37,854గా ఉంది. అమెరికాలోని ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తూ ..హెచ్‌ 1బీ వీసా అంశం ఓ మేలుకొలుపులాంటిదని రాండ్‌స్టడ్‌ ఇండియా కార్యనిర్వాహణాధికారి పాల్‌ డుపిస్‌ చెప్పారు. విధివిధానాలు మారడంతో కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే అమెరికా కంపెనీలకు భారతీయ నిపుణులు ఇప్పుడు ఆ స్థాయిలో అవసరం లేదని చెప్పారు. 1990 నుంచి అమెరికా పౌరసత్వం పొందుతున్న వలసదారుల్లో చైనా, మెక్సికో దేశీయులు తొలి రెండు స్థానాల్లో, భారతీయులు మూడో స్థానంలోనూ ఉన్నారు. భారతీయుల్లో చాలా మంది అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు..  నైపుణ్య వీసా ద్వారా గ్రీన్‌కార్డు పొంది తద్వారా అమెరికా పౌరసత్వం సంపాదించే మార్గాన్ని ఎంచుకునేవారు. కానీ అమెరికా కార్పొరేట్ సంస్థలు స్థానికులవైపు చూస్తుండటంతో భారతనుంచి వలస వచ్చే ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇక గ్రీన్‌కార్డు ప్రాసెస్‌ చేసేందుకు పట్టే కాలం ఏకంగా 7 నుంచి 8 ఏళ్లకు పెరిగింది. ప్రపంచంలోని ఇతర దేశాలకంటే భారతీయులే ఎక్కువ దరఖాస్తులు చేసుకున్నారని వారు ఎంతో కాలం వేచి చూడాల్సి ఉంటుందని మార్క్‌ డేవిస్‌ అనే ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాది చెప్పారు. 

Posted
Quote

ఇక గ్రీన్‌కార్డు ప్రాసెస్‌ చేసేందుకు పట్టే కాలం ఏకంగా 7 నుంచి 8 ఏళ్లకు పెరిగింది. 

evadu man ee articles raasedi. 8 years ki GC vasthundi anta @3$%

Posted
1 minute ago, TampaChinnodu said:

evadu man ee articles raasedi. 8 years ki GC vasthundi anta @3$%

E lekkana naku inko 2years lo ocheyyali GC @3$%

Posted
1 hour ago, Bitcoin_Baba said:

E lekkana naku inko 2years lo ocheyyali GC @3$%

thats an average. Consider, for example Pakistan gets in 1 year, ....

Posted
1 hour ago, Bitcoin_Baba said:

E lekkana naku inko 2years lo ocheyyali GC @3$%

Aithe aa lekkana naaku already ochhesindhi .. next elections ki malla thatha ki vote gudhhude ettagu adhi b ochhesthadhi aalopu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...