Jump to content

Recommended Posts

Posted
ఉద్యోగ సంపద 
20 లక్షల ఉద్యోగాలొస్తాయ్‌ 
 భాగస్వామ్య ఒప్పందాలతో   ప్రయోజనమిదీ.. 
పారదర్శకంగానే భూ కేటాయింపులు 
ఆరోపణలను పట్టించుకుంటే ముందుకు సాగలేం 
  ముఖ్యమంత్రి వెల్లడి 
 విశాఖలో 4 ఐటీ సంస్థల  ప్రారంభం 
29ap-main1a.jpg

ఈనాడు, విశాఖపట్నం: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆ మేరకు భాగస్వామ్య ఒప్పందాల్లో కుదిరిన రూ.17 లక్షల కోట్ల విలువైన ఎంఓయూల్లో... రూ.10 లక్షల కోట్ల ఎంఓయూలు సాకారమయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. పెట్టుబడి పెట్టేవారికి సహకరిస్తే ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని, సంపద పెరుగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి నిరోధించే వాళ్లకు సహకరిస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయని పేర్కొన్నారు.  గురువారం విశాఖలోని మధురవాడ ఐ.టి.హిల్‌-2పై కాండ్యుయంట్‌, తురాయా, ప్రొసీడ్‌ ఐ.టి. సంస్థలను ఆయన ప్రారంభించారు. అలాగే ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఇన్వెస్టిమెంట్స్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న క్యాంపస్‌కు శిలాఫలకాన్ని సీతమ్మధారలో ఆవిష్కరించారు. అనంతరం ఆయా సంస్థల ఉద్యోగులు, ఐ.టి.నిపుణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు స్థలాల కేటాయింపులో అవినీతి జరుగుతోందంటూ వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, పరిశ్రమలకు నేలపై భూములివ్వకుండా ఆకాశంలో స్థలాల్ని కేటాయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గతంలో హైదరాబాద్‌లో ఐ.టి. సంస్థలకు స్థలాలిచ్చినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని, అవాస్తవ ఆరోపణల్ని పట్టించుకుంటే నేడు హైదరాబాద్‌ ఐ.టి.రంగంలో ఇంతగా అభివృద్ధి చెందేదా అని ప్రశ్నించారు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థ ఫార్చ్యూన్‌-500 కంపెనీ అన్న ఉద్దేశంతో స్థలాల్ని కేటాయించామని, అందులో తన స్వార్థం ఏదీ లేదని స్పష్టం చేశారు. స్థలాల్ని ఒకింత తక్కువ ధరకు ఇవ్వకపోతే, వాటికి లాభాలు రాకపోతే ఆయా సంస్థలు ఛారిటీ కోసం పెట్టుబడులు పెడతాయా? అని ప్రశ్నించారు. పరిశ్రమలకు జరిపే కేటాయింపులన్నీ ఎంతో పారదర్శకంగా, నిజాయతీగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నామని, పది సంస్థలతో సంప్రదింపులు జరిపితేగానీ ఒక సంస్థ పెట్టుబడి పెట్టదని గుర్తించాలన్నారు. విమర్శలు చేసేవాళ్లు పరిశ్రమల యాజమాన్యాల్ని ఒప్పించి పెట్టుబడులు పెట్టిస్తే వారికి కూడా పలు రాయితీలు ఇస్తామని, ఏపీలో పెట్టుబడులు పెట్టేవాళ్లను తీసుకురావాలని సవాలు విసిరారు. లేనిపోని ఆరోపణలకు భయపడితే విశాఖ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందన్నారు. లూలూ కంపెనీని విశాఖకు తీసుకువచ్చినప్పుడు కూడా పలు ఆరోపణలు చేశారని, కేరళలోని లూలూ సంస్థకు రోజుకు 80 వేల మంది వస్తున్నారని, ఆ స్థాయిలో సందర్శకులు రావాలంటే ఇక్కడ కూడా ఏదో ఒక ఆకర్షణ ఉండాలన్న ఉద్దేశంతో లూలూ మాల్‌ను విశాఖలో ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. 
ఇక్కడ ఒకేరోజు నాలుగు సంస్థలను ప్రారంభిస్తుండడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. 2019లో లక్ష ఐటీ ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌లో మరో లక్ష చొప్పున ఉద్యోగాలు కల్పించాలని ఆ శాఖ అధికారులను కోరుతున్నానన్నారు. రూ.649కోట్ల పెట్టుబడితో వచ్చిన కాండ్యుయంట్‌ సంస్థ ఐదువేల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, అక్కడితో ఆగిపోకుండా మరిన్ని వేల ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. 40 దేశాల్లో 93 వేల మందికిపైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఏపీలో మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క విశాఖలోనే 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతపురంలాంటి మారుమూల జిల్లాకు ప్రఖ్యాత కియా మోటార్స్‌ పరిశ్రమ వచ్చిందని గుర్తుచేశారు. 20 సంవత్సరాలకు పైగా దేశంలో ఐ.టి.ని ప్రోత్సహించిన ముఖ్యమంత్రిని తానేనని అంటూ... ఐ.టి.రంగంపై మాట్లాడడానికి తనకే పేటెంట్‌ ఉందని చమత్కరించారు.

29ap-main1b.jpg

ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌తో విశాఖ ముఖచిత్రం మారుతుంది: గతంలో మైక్రోసాఫ్ట్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌లాంటి కంపెనీలు హైదరాబాద్‌ రావడం వల్ల దాని ముఖచిత్రమే మారిపోయిందని, ఇప్పుడు విశాఖ ఆ స్థాయికి వెళ్లే అవకాశం ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ద్వారా వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నగరం ప్రపంచంలోని నాలుగైదు ఉత్తమ ఫిన్‌టెక్‌ సేవల కేంద్రీయ నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ సంస్థ శిలాఫలకం ఆవిష్కరణ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రూ. 450 కోట్ల వ్యయంతో ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఇక్కడ తన విభాగాన్ని ఏర్పాటు చేస్తోందని, దీనిద్వారా 2500 మందికి అత్యున్నత ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. ఈ సంస్థ దృష్టి కేవలం మొదటిశ్రేణి నగరాలమీదే ఉంటుందని, తొలిసారి రెండోశ్రేణి నగరమైన విశాఖకు వచ్చారని సీఎం చెప్పారు. కేవలం తన మీద ఉన్న విశ్వసనీయత వల్లే ఇక్కడకు వచ్చారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా తన పనితీరును చూసి, అలాగే వాళ్లమ్మాయి బాలీవుడ్‌ నటి అవడం వల్ల భారతదేశం మీద అభిమానంతో జెన్సీఫర్‌ హైదరాబాద్‌కు వచ్చేందుకు అంగీకరించారని, ఇప్పుడు విశాఖకు వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ సీఈవో, అధ్యక్షురాలు జెన్నీఫర్‌ ఎం జాన్సన్‌ను సీఎం అభినందించారు. ‘మీరిక్కడ విజయవంతమైతే మా ప్రజలకు ఉపాధి లభిస్తుంది’ అని జెన్నీఫర్‌తో చంద్రబాబు అన్నారు. ఇలాంటి అభివృద్ధి జరుగుతున్నప్పుడు మీడియా కూడా సానుకూలంగా ఆలోచించి కథనాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఈవో జెన్నీఫర్‌కు పట్టుచీరను, అరకు కాఫీ, బుద్ధుని ప్రతిమని బహూకరించారు. ఇన్నోవా సొల్యూషన్స్‌ సీఈవో రాజ్‌కుమార్‌నూ సన్మానించారు. వీజీఎస్‌ సొల్యూషన్స్‌ కంపెనీ పలువురు దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వడంతో ఆ పత్రాల్ని ముఖ్యమంత్రి వారికి అందించారు. ఈ కార్యక్రమాల్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ... విశాఖ టైర్‌-1 నగరాలకు పోటీ ఇచ్చే స్థాయిలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా 99 శాతం ఐ.టి. సంస్థలు హైదరాబాద్‌లో ఉండిపోయాయని, అయినప్పటికీ నూతన ఆంధ్రప్రదేశ్‌లో పలు ఐ.టి. సంస్థలు ఏర్పాటయ్యేలా కృషి చేసి విజయం సాధిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, భాజపా శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు, కాండ్యుయంట్‌ ప్రతినిధులు మనీష్‌ శర్మ, సుబోధ్‌శర్మ, ఐ.టి.శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌, ఏపీఐఐసీ ఎండీ ఎ.బాబు తదితరులు పాల్గొన్నారు.

Posted
Quote

అలాగే వాళ్లమ్మాయి బాలీవుడ్‌ నటి అవడం వల్ల భారతదేశం మీద అభిమానంతో జెన్సీఫర్‌ హైదరాబాద్‌కు వచ్చేందుకు అంగీకరించారని,

who is she ? 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...