TampaChinnodu Posted April 1, 2018 Report Posted April 1, 2018 టోల్ మోత బాహ్య వలయ రహదారిపై మళ్లీ 10% ఛార్జీల పెంపు కి.మీ.కు 16 పైసల నుంచి రూ. 1.06 శనివారం అర్ధరాత్రి నుంచే.. ఈనాడు, హైదరాబాద్: బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్)పై హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) మళ్లీ టోల్ ఛార్జీలను పెంచింది. ఈసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 శాతానికి పైగా వడ్డించింది. సవరించిన ఛార్జీలను శనివారం అధికారికంగా ప్రకటించింది. పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. భాగ్యనగరాభివృద్ధిలో కీలకంగా మారిన ఓఆర్‌ఆర్‌పై సగటున ప్రతి రోజు లక్ష వాహనాలు దూసుకెళ్తున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. 180 టోల్ లేన్ల ద్వారా టోల్ రుసుంల్ని వసూలు చేస్తున్నారు. ఆ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. సదరు సంస్థ ప్రతి నెలా రూ.16.4 కోట్లను హెచ్‌ఎండీఏకు చెల్లిస్తోంది. అంటే ఏటా టోల్ వసూళ్ల ద్వారా రూ.196.8 కోట్ల ఆదాయం సమకూరుతుందన్న మాట. ఒకేసారి 50 శాతం!: రూ.6,696 కోట్లతో అవుటర్ నిర్మాణాన్ని చేపట్టారు. జైకా రుణం రూ.3,558 కోట్లు. పనులు పూర్తైన తర్వాత పన్నెండున్నరేళ్ల వరకు ప్రతి ఆరు నెలలకొకసారి గుత్తేదారులకు హెచ్‌ఎండీఏ బిల్లులు చెల్లిస్తోంది. ఏటా గుత్తేదారులకే రూ.330 కోట్లు చెల్లిస్తున్నారు. అసలే సమకూరే ఆదాయం అంతంతే. మిగిలిన మొత్తాన్ని ఇతర నిధుల నుంచి సర్దుబాటు చేయాల్సి వస్తోంది. పైగా.. నిర్వహణ, రుణ వడ్డీ చెల్లింపులు భారంగా మారడంతో గతేడాది ఫిబ్రవరిలో ఒకేసారి 50 శాతం టోల్ ఛార్జీలను పెంచింది. దీంతో టోల్ ఆదాయం రూ.196.8 కోట్లకు చేరింది. మళ్లీ ఇప్పుడేమో..! మళ్లీ 14 నెలల తర్వాత టోల్ ఛార్జీలను పెంచాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. నిబంధనల ప్రకారం ఏటా ఏప్రిల్ 1 నుంచి హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) ప్రకారం ఛార్జీలను పెంచేందుకు అవకాశముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే కి.మీ.కు 16 పైసల నుంచి రూ.1.06 వరకు పెంచినట్లుగా వివరిస్తున్నారు. ఈ పెంపుతో ప్రతి నెలా రూ.3కోట్ల నుంచి రూ.4 కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతుందని అంచనా. శనివారం అర్థరాత్రి నుంచి కొత్త రేట్ల ప్రకారమే టోల్ వసూలు చేయాలంటూ గుత్తేదారు సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. కారు, జీపు, వ్యాన్, ఎల్‌ఎంవీకేమో ప్రతి కి.మీకు 16 పైసలు, ఎల్‌సీవీ, మినీ బస్సులకేమో 27 పైసలు, బస్సు, 2 యాక్సిల్ ట్రక్స్‌కేమో 47 పైసలు, 3 యాక్సిల్ ట్రక్స్‌కేమో 61 పైసలు, 4,5,6 యాక్సిల్ ట్రక్స్‌కేమో 87 పైసలు, 7.. అంతకంటే ఎక్కువుండే యాక్సిల్ ట్రక్స్‌కేమో రూ.1.06 పెంచారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.