iPhoneX Posted April 2, 2018 Report Posted April 2, 2018 21 minutes ago, Selfgoal said: There are many pichi fooks in this warld he is Big among them Quote
ariel Posted April 2, 2018 Report Posted April 2, 2018 2 hours ago, manadonga said: పూర్వకాలంలో ఒకసారి పక్షి జాతికి, జంతు జాతికి యుద్ధం సంభవించింది. పక్షులన్నీ పక్షిసేన వైపు, జంతువులన్నీ జంతుసేన వైపు మోహరించాయి. అక్కడ ఒక కుక్కుటెశ్వర్ అని ఒక కోడిపుంజు ఉన్నది. దానికి యుద్ధం అంటే చచ్చే భయం. దానికి హాయిగా ఇళ్లల్లో దూరి బయట ఆరబోసిన జొన్నలను దొంగతనంగా తినడం, రోజుకో కోడి పెట్టను అనుభవించడం, సోమరిపోతులా తిరగడం లాంటి జల్సా జీవితానికి అలవాటు పడింది. అందుకని దూరంగా ఒకచోట నిక్కి కూర్చుని యుద్ధాన్ని గమనిస్తున్నది. పక్షులు, జంతువులు భీకరంగా పోట్లాడుకుంటున్నాయి. కొన్నాళ్ళకు పక్షులు గెలిచే సంకేతం దొరికింది దానికి. భయం వేసింది. వెంటనే పక్షిరాజు దగ్గరకు వెళ్లి “తానూ పక్షినే అని, తనకూ మీలాగే రెక్కలు ఉన్నాయని, తనను మీ సైన్యంలో చేర్చుకోమని” బతిమాలింది. పక్షిరాజు అసహ్యించుకుని “ఛీ… నువ్వు పక్షివి ఎలా అవుతావు? నువ్వు మాలాగా ఆకాశంలో విహరించలేవు. గెట్ అవుట్” అని అరిచింది. అంతలో జంతువులు గెలిచే అవకాశం కనిపించింది. ఆలసించిన ఆశాభంగం అని భయపడి జంతువుల రాజు దగ్గరికి పరిగెత్తి “నేను కూడా మీలాగే జంతువును. నన్ను మీలాగే గృహస్తులు అల్లారుముద్దుగా పెంచుకుంటారు. నేలమీద తిరుగుతుంటాను. నన్ను మీలో చేర్చుకోండి” అని వెక్కి వెక్కి ఏడ్చింది. జంతురాజు కుక్కుటెశ్వర్ ముఖాన తుపుక్కున ఉమ్మేసి “ఛీ… నువ్వు జంతువువు ఎలా అవుతావు? నీకు రెక్కలు ఉన్నాయి. ఎవరైనా నిన్ను తన్నవచ్చినపుడు ఎగురుతూ పక్కింటి గుడిసె మీదకి దూకి దాక్కుంటావు. నువ్వు పక్షివి. గెట్ లాస్ట్ ” అని అరిచింది. ‘రెంటికి చెడిన రేవడిని అయ్యాను” అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆ జిత్తులమారి కోడి. పవన్ కళ్యాణ్ అనే ఒక సినీనటుడు రాజకీయాల్లోకి వచ్చాడు. సొంతంగా ఎదిగే ప్రయత్నం చెయ్యకుండా కొన్నాళ్ళు బీజేపీ ని, కొన్నాళ్ళు తెలుగుదేశం వైపు తిరిగాడు. కొన్నాళ్ళు వైసిపిని సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించాడు. కొన్నాళ్ళు కమ్యూనిస్టులతో అంటకాగాడు. కొన్నాళ్ళు మేధావులు అంటూ వారి చుట్టూ తిరిగాడు. ఒక సిద్ధాంతం లేదు, ఒక లక్ష్యం లేదు ఒక గమ్యం లేదు ఒక ఆశయం లేదు. ఒకప్పుడు పవన్ ఇమేజ్ ను వాడుకుందామని చూసిన బీజేపీ, తెలుగుదేశం, కమ్యూనిస్టులు పవన్ ను గొప్ప మేధావిగా, మళ్ళీ అవతరించిన చెగువేరాగా, అభినవ కాళిదాసుగా ప్రఖ్యాతుడైన శేషేంద్ర గా కీర్తించారు. మీడియా పవన్ కు విశేషమైన కవరేజ్ ఇచ్చింది. పార్టీ పెట్టి నాలుగేళ్లు అయింది. ఇంత వరకు ఒక్క చెప్పుకోదగిన నాయకుడు ఆ పార్టీలో చేరలేదు. ఎవరో గత మూడు తరాలకు తెలియని ఎనభై ఏళ్ల నవ యువకుడు మాదాసు గంగాధరం అనే ఆయన జనసేనలో చేరతాను అన్నాడట.. అదికూడా జరిగినట్లు లేదు. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నది. బీజేపీ ఛీ కొట్టింది. తెలుగుదేశం ఛీ ఛీ ఛీ అన్నది. వైసిపి చ్చి ఛీ, ఛీ అని ముఖాన కాండ్రించి ఉమ్మేసింది. కమ్యూనిస్టులు థూ అని ఉమ్మేసి వెళ్లిపోయారు. పవన్ ఒత్తి బుర్రతక్కువ మనిషి అని మేధావులు చెప్పుతో కొట్టినట్లు చెప్పి వెళ్లిపోయారు. పవన్ పరమ మూర్ఖుడు అని ఆయన పార్టీకోసం ఇన్నాళ్లూ పనిచేసిన ఒక నాయకుడు దుమ్ము దులిపేసి వెళ్ళిపోయాడు. మీడియా పట్టించుకోవడం మానేసింది. రెండేళ్లలోనే పవన్ ఒక శుంఠగా కీర్తించబడుతున్నాడు. ఒక అవివేకిగా ప్రజలలో పలుచన అయ్యాడు. చిరంజీవికి నిజమైన తమ్ముడు అనిపించుకున్నాడు. మనిషి అన్న తరువాత ప్రాణం పోయినా మాటమీద నిలబడాలి. సిద్ధాంత నిబద్ధత లేనివాడు మృతకళేబరం తో సమానం. మాట నిలకడ లేని నిహీనులని సమాజం బహిష్కరిస్తుంది. ఆరు నెలల్లో అరవై సార్లు స్క్రిప్ట్ మార్చుకోవడం సినిమాల్లో చెల్లుతుంది. రాజకీయాల్లో చెల్లదు. “ఒంటరినై పోయాను ఇక ఇంటికి ఏమని పోను” అని సినారే పాటను హమ్ చేసుకోవడమే పవన్ ముందున్న రహదారి. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.