SonyKongara Posted April 3, 2018 Report Posted April 3, 2018 కోనసీమ వైసీపీలో సెగ.. 02-04-2018 15:07:12 పార్టీలో మొదలైన లుకలుకలు కాకినాడ కోఆర్డినేటర్ శశిధర్‌కి ఆశాభంగం సిటీ టికెట్ ద్వారంపూడికి కేటాయింపు మూడు సీట్లివ్వాలంటూ ఓ నేత హుకుం రాజమహేంద్రవరం పార్టీ మీటింగ్‌కి గైర్హాజరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ) ఎన్నికల బరిలోకి దిగేందుకు వైసీపీ ముందస్తు వ్యూహాలు రూపొందించుకునే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా జిల్లాలో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. రెండు రోజుల కిందట రాజమహేంద్రవరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులపై కొంత స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. కాకినాడ సిటీ అసెంబ్లీ సీటు ఇస్తామని పార్టీలోకి తీసుకున్న ముత్తా శశిధర్‌కి ఝలక్ ఇచ్చి.. జగన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి కాకినాడ సిటీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ద్వారంపూడికి అనపర్తి టికెట్ ఇస్తామని, శశిధర్‌కి కాకినాడ సిటీలో అవకాశం కల్పిస్తామని పార్టీలో చేరే సమయంలో హామీ ఇచ్చారని శశిధర్ వర్గీయులు అసహనంతో ఉన్నారు. టికెట్ ప్రకటనతో ఆదివారం ద్వారంపూడి ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తల హడావుడి కన్పించింది. మూడు సీట్లివ్వాలి.. ఓ నేత హుకుం బీసీలలో బలమైన సామాజిక వర్గమైన తమకు మూడు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత విధేయుడైన ఓ నేత డిమాండు చేస్తున్నారు. రామచంద్రపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్ స్థానాలు తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుపడుతున్న సదరు నేత శనివారం రాజమహేంద్రవరంలో జరిగిన వైవీ సుబ్బారెడ్డి సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. ఆ మూడు స్థానాలలో ఇవ్వకపోతే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ తేల్చి చెప్పినట్టు కేడర్‌లో ప్రచారం సాగుతోంది. ముమ్మిడివరం సీటు కూడా తమకే కేటాయించాలన్న కీలక నేత డిమాండును వైసీపీ లెక్కచేయకుండా ముమ్మిడివరం టికెట్‌ని మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకి దాదాపు ఖరారు చేశారు. పిఠాపురం సీటు కోసం పోటీ.. పిఠాపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసేందుకు తమకు టికెట్ కావాలని ఓ టీడీపీ ప్రజాప్రతినిధి గతం నుంచీ ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గం టికెట్‌ను ఓ సామాజిక ఉద్యమ నాయకుడి కుమారుడికి ఇవ్వాలన్న డిమాండు ఉంది. జగ్గంపేట నుంచి పోటీచేసేందుకు రెండేళ్ల నుంచీ వర్కవుట్ చేసుకుంటున్నానని, ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన వారికి టిక్కెట్టు ఎలా ఇస్తారంటూ అక్కడ పార్టీ కోఆర్డినేటర్ ప్రశ్నిస్తున్నారు. మండపేటపై మీమాంస.. మండపేట అసెంబ్లీ సీటు కోసం గతంలో పోటీచేసిన వారే మళ్లీ ప్రయత్నిస్తుండగా.. అక్కడ అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం సాగుతోంది. కొత్తవారికి ఛాన్స్ ఇస్తే గతంలో పోటీచేసిన అభ్యర్థికి ఎమ్మెల్సీ ఆఫర్ చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే మండపేటలో రాజకీయ సమీకరణలు మారతాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అమలాపురం లోక్‌సభ అభ్యర్థిపై.. అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసేందుకు వైసీపీ రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారిని రంగంలోకి దించాలని యోచిస్తోంది. అయితే మాజీ ఎంపీ ఒకరు తనకు అవకాశం ఇస్తే అమలాపురం లోక్‌సభ నుంచి పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే రాజమహేంద్రవరం లోక్‌సభకు పోటీ చేసేందుకు కూడా వైసీపీ కొత్త అభ్యర్థి కోసం వెతుకుతోంది. జనసేన చీల్చే ఓట్లు ఎవరికి నష్టం జనసేన వచ్చే ఎన్నికలలో రంగంలోకి దిగుతోందన్న ప్రచారం ఉంది. టీడీపీ, వైసీపీలలో ఏ పార్టీకి జనసేన వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్న దానిపై వైసీపీలోనూ జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఆ పార్టీ ముఖ్యనాయకులు ఇప్పటికే రెండు, మూడు అసెంబ్లీల సామాజిక వర్గాల వారీగా ఓట్ల జాబితాలను పరిశీలించి విశ్లేషణలు రూపొందించే పనిలో ఉన్నారు. జిల్లాలో జనసేన ప్రభావం ఇతర జిల్లాల కంటే ఎక్కువగా ఉంటుందన్న దానిపైనా వైసీపీలో చర్చ సాగుతోంది. ఎన్నికలకు ఏడాది ముందే అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుపెడితే.. అసంతృప్తులు, అసమ్మతులు, ఆగ్రహావేశాలు అప్పటికి చల్లారతాయన్న భావనతో వైసీపీ నేతలు ఇప్పటి నుంచే ఎంపిక ప్రక్రియ ప్రారంభించినట్టు చెబుతున్నారు. Quote
Hydrockers Posted April 3, 2018 Report Posted April 3, 2018 compitation baguntundi antav tkt kosam aalu antha kalipoi poti cheste TDP zero na> Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.