Jump to content

Recommended Posts

Posted

Karnataka-Congress-Leaders-on-Amit-Shah-1522932497-1187.jpg

కన్నడ రాష్ట్రంలో ఎన్నికల హీటెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ రథసారథి రాహుల్గాంధీ ఆ రాష్ట్రంలో చుట్టేస్తూ వేడిని పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆ రాష్ట్రంలోని పాతుకుపోయిన జేడీఎస్ సైతం ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా జోరు పెంచారు. గత మూడు రోజులుగా కర్ణాటకలో పర్యటిస్తున్న ఆయన.. మైసూరుతో పాటూ పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రముఖ మఠాలను సందర్శిస్తూ.. మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అయితే ఆయన తమకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సంతోషం వ్యక్తం చేస్తోంది. నిజంగా నిజం. బహిరంగంగా ఆ మాట చెప్పుకుటోంది మరి.

కర్ణాటకలో తమ సీఎం అభ్యర్థి అయిన యడ్యూరప్ప అతిపెద్ద అవినీతిపరుడంటూ షా ఇటీవలే నోరు జారిన సంగతి తెలిసిందే. ఇంకో సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాన్ని నాశనం చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అనంతరం అమిత్ షా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అయితే మరుసటి రోజే ఇంకో తప్పిదం జరిగింది. కర్ణాటకలో సిల్క్ ఉత్పత్తి గరిష్ఠ స్థాయికి చేరుకుందని అమిత్ షా తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖుష్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిల్క్ ఉత్పత్తి గొప్ప స్థాయికి చేరిందనే విషయాన్ని అమిత్ షా ప్రకటించినందుకు సంతోషమని పేర్కొంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి నాయకుడిని కూడా అవినీతిపరుడిగా ప్రకటించినందుకు సంతోషమని వెల్లడించింది. తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అమిత్ షానే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో తమ అగ్రనాయకుడి ప్రకటనపై అసహనం వ్యక్తం చేయలేక...వాటిని అంగీకరించలేక పార్టీ నేతలు సతమతం అవుతున్నారు.

Posted

bl@st picchi pulka ayyadu musalodu.. 3 sarlu tongue slip ayyadu. KA-congress ni inspiration ga theeskovali TG-congress... 

Posted
Just now, Kool_SRG said:

కర్ణాటకలో తమ సీఎం అభ్యర్థి అయిన యడ్యూరప్ప అతిపెద్ద అవినీతిపరుడంటూ షా ఇటీవలే నోరు జారిన సంగతి తెలిసిందే. ఇంకో సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాన్ని నాశనం చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అనంతరం అమిత్ షా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అయితే మరుసటి రోజే ఇంకో తప్పిదం జరిగింది. కర్ణాటకలో సిల్క్ ఉత్పత్తి గరిష్ఠ స్థాయికి చేరుకుందని అమిత్ షా తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖుష్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిల్క్ ఉత్పత్తి గొప్ప స్థాయికి చేరిందనే విషయాన్ని అమిత్ షా ప్రకటించినందుకు సంతోషమని పేర్కొంది.

brahmi%20laugh_01.gif?1403646236

Posted
15 minutes ago, Paidithalli said:

bl@st picchi pulka ayyadu musalodu.. 3 sarlu tongue slip ayyadu. KA-congress ni inspiration ga theeskovali TG-congress... 

NAGARJUNA

Posted
1 hour ago, Lakhan said:

Nuvvu congress aa 🙄

BJP ayithe kaadu....

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...