Jump to content

Recommended Posts

Posted
ర్దాక్షిణ్యం 
తెదేపా ఎంపీల ప్రధాని ఇంటి ముట్టడిని అడ్డుకున్న పోలీసులు 
తీవ్ర తోపులాట, పెనుగులాట 
ఈడ్చుకెళ్లి.. బలవంతంగా బస్సులో ఎక్కించి పోలీసుస్టేషన్‌కు తరలింపు 
‘ప్రజాస్వామ్యంలో ఇదో బ్లాక్‌ సండే’గా అభివర్ణించిన నేతలు 
ఎంపీలకు సంఘీభావం ప్రకటించిన కేజ్రీవాల్‌ 
నేడు మహాత్మాగాంధీ సమాధి వద్ద మౌనప్రదర్శన 
ఈనాడు - దిల్లీ 
8ap-main1a.jpg
విభజన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్‌తో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నివాసం ముట్టడికి ప్రయత్నించారు. ఇక్కడి లోకకల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని అధికార నివాసాన్ని ముట్టడించి అక్కడే ధర్నా చేయడానికి పార్లమెంటు ఉభయసభలకు చెందిన 21 మంది ఎంపీలు మూకుమ్మడిగా బయలుదేరారు. వారిని ప్రధాని నివాసానికి కూతవేటు దూరంలో పోలీసులు ఆపేసి రెక్కలు విరిచి బలవంతంగా బస్సులో ఎక్కించి తుగ్లక్‌రోడ్డులోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రయత్నంలో పోలీసులు, ఎంపీల మధ్య తీవ్ర తోపులాట, పెనుగులాట జరిగింది. ప్రధానమంత్రి నివాసానికి వెళ్లకుండా అడ్డుగా పెట్టిన బ్యారికేడ్లను ఎక్కడానికి ప్రయత్నించిన ఎంపీలు సీఎం రమేష్‌, అవంతి శ్రీనివాస్‌, కె.రామ్మోహన్‌నాయుడులతో సహా ఏడు పదులు దాటిన ఎంపీలను కూడా బలవంతంగా ఈడ్చుకెళ్లారు. చేతులు, కాళ్లు పట్టుకొని లాక్కుపోయి బస్సులో కుదేశారు. పోలీసుల బలప్రయోగాన్ని అడ్డుకోవడానికి మురళీమోహన్‌ రోడ్డుపై తొలుత పడుకుండిపోయారు. ఆ వెంటనే ఎంపీలు తోట నరసింహం, కొనకళ్ల నారాయణ, కనకమేడల రవీంద్రకుమార్‌, మాగంటి బాబు, గల్లా జయదేవ్‌, అవంతి శ్రీనివాస్‌, పండుల రవీంద్రబాబు, గరికపాటి మోహన్‌రావు తదితరులు కూడా మూకుమ్మడిగా రహదారిపై కూర్చొని నిరసనకు దిగారు. రెక్కలుపట్టుకొని బలవంతంగా ఈడ్చుకెళ్తున్న పోలీసుల నుంచి విడిపించుకొచ్చిన జేసీ దివాకర్‌రెడ్డి కూడా వారితో పాటే రోడ్డుపై పడుకుండిపోయారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత కొద్దిసేపటిలోనే పోలీసులు అందర్నీ కాళ్లు చేతులు పట్టుకొని ఈడ్చుకెళ్లి బలవంతంగా బస్సులో వేశారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ నిరసన విరమించేది లేదంటూ మాగంటిబాబు కొద్దిసేపు రోడ్డుకు అతుక్కుపోయారు. ఆయన్ను తరలించడానికి పోలీసులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. చేతుల్లో వెంకటేశ్వరస్వామి ప్రతిమ పట్టుకొని రోడ్డుకు అడ్డంగా పడుకొని నిరసన మొదలుపెట్టిన ఆయన్ను తరలించడానికి చేసిన ప్రయత్నాలు తొలుత ఫలించలేదు. చివరకు దాదాపు ఏడెనిమిది మంది పోలీసులు వచ్చి ఆయన్ను బలవంతంగా ఎత్తుకుపోయారు. కేంద్ర మాజీ మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, ఎంపీలు తోట సీతారామలక్ష్మి, బుట్టా రేణుక, నిమ్మల కిష్టప్ప, టీజీ వెంకటేష్‌, శ్రీరాంమాల్యాద్రిలను కూడా పోలీసులు బస్సు ఎక్కించి తుగ్లక్‌ రోడ్డు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. వెంటనే దించేయకుండా వారందర్నీ బస్సులోనే ఉంచి రెండురౌండ్లు చక్కర్లు కొట్టించి చివరకు స్టేషన్‌ దగ్గరకు తీసుకొచ్చారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎంపీలంతా బస్సులోనే బైఠాయించారు. తమను ప్రధాని ఇంటి దగ్గర వదిలేటంతవరకూ బస్సు దిగబోమని వారు భీష్మించారు. సుమారు మూడుగంటల పాటు వారంతా బస్సులోనే కూర్చొని ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నేలపై కూర్చొని పోలీసుల వైఖరికి నిరసన తెలిపారు. సోమవారం ఉదయం పది గంటలకు రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధి వద్ద తెదేపా ఎంపీలు  మౌన ప్రదర్శన చేయనున్నారు.
8ap-main1b.jpg
అరవింద్‌ కేజ్రీవాల్‌ సంఘీభావం 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించి అరెస్ట్‌ అయిన తెలుగుదేశం ఎంపీలకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంఘీభావం తెలిపారు. ఆయన తుగ్లక్‌రోడ్డు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వారితో మాట్లాడి మద్దతు పలికారు. ప్రత్యేకహోదా కోసం తెలుగుదేశం పార్టీ చేస్తున్న డిమాండ్‌లో న్యాయం ఉందని, తక్షణం దాన్ని అమలు చేయాలని ఆయన మీడియాతో అన్నారు. తమ సమస్యలను వివరించడానికి వెళ్తున్న ఎంపీలను ప్రధాని ఇంటికి వెళ్లనీయకుండా పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించడం ఖండనీయమన్నారు. ఇది అహంకారం తప్పితే... ప్రజాస్వామ్యంకాదని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇదే విషయాన్ని ట్విట్టర్‌ ద్వారానూ వెల్లడించారు.
8ap-main1c.jpg
బస్సుల్లో కుక్కేయడం దారుణం 
ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించడానికి బయలుదేరిన తమను పోలీసులు ఈడ్చుకెళ్లి బస్సుల్లో కుక్కేయడం దారుణమని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత సుజనాచౌదరి ధ్వజమెత్తారు. ‘ప్రజాస్వామ్యంలో ఇదో బ్లాక్‌ సండే..’ అని  అభివర్ణించారు. పార్లమెంటులో తాము ఇచ్చిన అవిశ్వాసం తీసుకోలేదని, ప్రధానికి వినతిపత్రం సమర్పించాలనుకుంటే ఇక్కడా అనుమతించలేదని ధ్వజమెత్తారు. రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ దిల్లీని వణికించిన ఏకైక జాతి తెలుగుజాతి అన్న విషయాన్ని ప్రధాని మరిచిపోకూడదన్నారు. తాము పోరాడుతుంటే భాజపా నాయకుడు తమను కుక్కలు, పిల్లులతో పోలుస్తున్నారని, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ మోదీ ఏపీ గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనం భారతదేశంలో ఉన్నామా? లేదంటే చైనా, రష్యాలో ఉన్నామా? అన్న ఆందోళన కలుగుతోందన్నారు. మోదీ ప్రభుత్వం రైతులు, దళితులు, దక్షిణాదిరాష్ట్రాలు, అయిదు కోట్ల ఆంధ్రులపై దమననీతి ప్రదర్శిస్తోందని చెప్పారు. కేశినేని నాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోదీ మీద విశ్వాసం పోయిందన్నారు. వినతిపత్రం సమర్పించడానికి వెళ్తున్న ఎంపీలను లాక్కురావడం బ్రిటిష్‌ పాలనను తలపించిందని చెప్పారు.  జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని దేశాన్ని ప్రేమతో పరిపాలించాలి తప్ప శత్రుత్వం, ద్వేషం, ఈర్ష్య, అసూయలతో పరిపాలించడం ఏ మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. నిమ్మలకిష్టప్ప మాట్లాడుతూ కేంద్రం ఏపీకి 80 శాతం కాదు కదా 8% నిధులు కూడా ఇవ్వలేదన్నారు. వాళ్లు చెప్పినట్లు 80% నిధులే ఇచ్చి ఉంటే అవిశ్వాసంపై చర్చ చేపట్టకుండా ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు.
8ap-main1d.jpg
కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధానితో తేల్చుకోవడానికే తాము ఆయన ఇంటికి బయలుదేరితే నియంతలా పోలీసులతో తమను గెంటేయించారని చెప్పారు. తాము వైకాపాలా భాజపాతో కుమ్మక్కు కాలేదని, అందుకే ప్రధాని ఇంటిపైకే దండెత్తామన్నారు. సీఎం రమేష్‌ మాట్లాడుతూ ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే ఇలా పోరాటాలు సాధ్యమయ్యేవి కాదని, దద్దమ్మల్లా ఇంట్లో కూర్చోవడానికి వైకాపా ఎంపీలు రాజీనామా డ్రామాకు తెరతీశారని వివరించారు. రాజకీయకుట్రలో భాగంగానే వారు అలా చేశారన్నారు. నిజంగా రాజీనామాలు చేసి ఉంటే ఇప్పటికీ ఎంపీలకున్న సౌకర్యాలు ఎందుకు వదులుకోలేదని ప్రశ్నించారు. ఐడీ కార్డులు ఎందుకు సరెండర్‌ చేయలేదు? ఇళ్లెందుకు ఖాళీ చేయలేదు? అని నిలదీశారు. కనకమేడల రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగడం మేం చేసిన తప్పా? మీ వెనుక చేతులు కట్టుకొని నిలబడాలా? లేదంటే వైకాపాలా రాజీనామాలు చేసి పారిపోవాలా? అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేసిన వారెవ్వరూ బతికిబట్టగట్టిన దాఖలా లేదని ప్రధాని గుర్తుంచుకోవాలన్నారు. పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ హక్కుల కోసం పోరాడుతున్న తెలుగుదేశాన్ని కుక్కలతో పోల్చి భాజపా అధ్యక్షుడు అమిత్‌షా 5 కోట్ల ఆంధ్రులను అవమానించారని చెప్పారు. ఇలాంటి అహంకారులకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. గరికపాటి మోహన్‌రావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందడం ప్రధానికి ఇష్టం లేదన్నారు. తెలుగువాళ్లు భారతదేశంలో భాగస్వామ్యం కాదా?మా సమస్యల గురించి అయిదు నిమిషాలు సమయం వెచ్చిస్తే ప్రధానమంత్రికి వచ్చే నష్టమేంటి? అని ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు తల్లి ఈనెల 4వ తేదీన మృతి చెందినప్పటికీ ఆయన నాలుగురోజుల్లోనే దిల్లీకొచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అంత్యక్రియల కోసం ముంబయి వెళ్లిన ఆయన 5, 6 తేదీల్లో మాత్రం పార్లమెంటుకు రాలేదు. అవి పూర్తయిన వెంటనే దిల్లీకొచ్చి అందరు ఎంపీలతో పాటు ఆందోళనల్లో పాలుపంచుకున్నారు.

8ap-main1e.jpg
ఎంపీల అరెస్టు దుర్మార్గం చంద్రబాబు 
ఈనాడు, అమరావతి: దిల్లీలో ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసన తెలుపుతున్న ఎంపీలను అరెస్టు చేయడం దుర్మార్గ చర్యని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ దమననీతికి ఇది పరాకాష్టని ఆయన వ్యాఖ్యానించారు. శాంతియుత పంథాలో నిరసన తెలియజేస్తున్న వారిని అడ్డుకోవడమే కాక, వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించడం దారుణమన్నారు. అరెస్టయిన ఎంపీలతో ఆదివారం సాయంత్రం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. సుజనాచౌదరి, జేసీ దివాకర్‌రెడ్డిలను పరామర్శించారు. వయసులో పెద్దవారని కూడా చూడకుండా కేంద్రం మానవత్వం లేకుండా ప్రవర్తించిందని మండిపడ్డారు. ఎంపీల అరెస్టు ఏపీపై కేంద్రం చూపుతున్న వివక్షకు, కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు.
8ap-main1f.jpg
నిర్బంధ వైఖరి సరికాదు: సీపీఎం రాష్ట్ర కమిటీ 
దిల్లీలో ప్రధానమంత్రి నివాసం ఎదుట నిరసన తెలుపుతున్న తెదేపా ఎంపీలను అరెస్టు చేయడాన్ని తాము ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం నిర్బంధ వైఖరిని ప్రదర్శించడం సరికాదని పేర్కొంది. దుర్మార్గ చర్యగా అభివర్ణించింది.
8ap-main1g.jpg

8ap-main1h.jpg

8ap-main1i.jpg

8ap-main1j.jpg

  • Replies 57
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    12

  • futureofandhra

    7

  • Paidithalli

    5

  • Android_Halwa

    4

Top Posters In This Topic

Posted
Quote

రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ దిల్లీని వణికించిన ఏకైక జాతి తెలుగుజాతి అన్న విషయాన్ని ప్రధాని మరిచిపోకూడదన్నారు. 

when where what why . flease some one explain @3$%

Posted

Prize money kosam baga try chestunnaruga.. Nagarjuna garu eliminate them sir..

Posted

Babu gari Maya ni Delhi police lu Kuda vintunRu ga

babu chakram start ayyindi rooi

Kakapote Kasta late GA vintunaru Ee Delhi police lu

Hooda ante  jail ke ani annaru ga Anduke arrest chesaru Delhi police lu

Posted

Intaki, bedirichindi evaru? Bhayapadindi everu ? Evaraina non pulka vallu vunte kastha clarity pls

Posted
Just now, Hydrockers said:

Babu gari Maya ni Delhi police lu Kuda vintunRu ga

babu chakram start ayyindi rooi

Kakapote Kasta late GA vintunaru Ee Delhi police lu

Hooda ante  jail ke ani annaru ga Anduke arrest chesaru Delhi police lu

Pulka batch in Delhi....okkanki ki kuda Hindi matladanike kuda radu...papam policollu...susi susi emi cheyalno ardam kaka lopala nukivuntaru...

Posted

g tho navvukuntunna non kattappa batch ...add cheyi 

Posted

deeksha ante idi

Third day to the YSRCP MPs hunger strike  - Sakshi

ఢిల్లీలో ఏపీ భవన్‌లోని వైఎస్సార్‌సీపీ ఎంపీల దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న వైఎస్‌ విజయమ్మ

మూడో రోజుకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష

క్షీణించిన ఎంపీ వరప్రసాదరావు ఆరోగ్యం 

బలవంతంగా ఆసుపత్రికి తరలించిన పోలీసులు

దీక్ష ఆపే ప్రసక్తే లేదని వరప్రసాదరావు స్పష్టీకరణ 

దీక్షాస్థలికి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ 

ఎంపీలకు సంఘీభావం.. మేకపాటికి పరామర్శ 

ఆమరణ దీక్షకు సీపీఐ నేత డి. రాజా మద్దతు 

రాత్రి ఏపీ భవన్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన 

Posted

Pulka mp la g baga palga 10ginra aite manchigindi lenza natkal adtunaru

Posted

Okka side ycp inko side tdp baaga act chesthunnaru ga

Posted
ప్రత్యేక హోదా కోసం రక్తంతో ప్లకార్డులు 
8ap-politics6a.jpg

పెంటపాడు, న్యూస్‌టుడే: ప్రత్యేక హోదా ఇవ్వాలని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం మౌంజీపాడుకు చెందిన ఏఎంసీ మాజీ అధ్యక్షుడు పాతూరి రామ్‌ప్రసాద్‌ చౌదరి, ఆయన భార్య వెంకటలక్ష్మి ఆదివారం వినూత్న నిరసన తెలిపారు. సిరంజీతో తమ రక్తాన్ని తీసుకుని పేపర్‌పై ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలను అమలు చేయాలి’ అని రాసి ప్రదర్శించారు. ప్రధాని మోదీ కార్యాలయానికి ఈ ప్లకార్డులను పంపిస్తామని పాతూరి తెలిపారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...