Jump to content

Recommended Posts

Posted
రూ.వెయ్యి కోట్ల భూముల స్వాహాకు కుట్ర 
ప్రమాదంలో విశాఖ డైరీ ఫాం ఆస్తులు 
  సూత్రధారి ఈఓ సూర్యప్రకాశరావే : మంత్రి అయ్యన్న ఆరోపణ 
8ap-state4a.jpg

నర్సీపట్నం, న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన డైరీ ఫాం భూములను కాజేసేందుకు కుట్ర జరుగుతోందని సాక్షాత్తు మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కుట్రలో భాగంగానే విశాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంఘం(డీఎల్‌డీఏ) కమిటీని రహస్యంగా గోవాలో ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఈ భూముల స్వాహా యత్నంపై 18 నెలల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశామని తెలిపారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఆదివారం మంత్రి తన స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. 
‘‘పశువుల వీర్యకణాల(సెమెన్‌) బ్యాంకును అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన రూ.కోట్లు విలువైన విశాఖలోని డైరీ ఫాం భూములను కైంకర్యం చేసేందుకు కుట్రపన్నారు. ఈ విషయం పశ్చిమగోదావరి జిల్లా డీఎల్‌డీఏ ఛైర్మన్‌ గాంధీ ద్వారా తెలుసుకున్న నేను రాష్ట్రంలోని డీఎల్‌డీఏ ఛైర్మన్లతో కలిసి 18 నెలల క్రితమే సీఎంకు ఫిర్యాదు చేశాను. దీనిపై స్పందించి సీఎం అధికారులను తీవ్రంగా హెచ్చరించారు.

ఆధారాలు ఉన్నాయి: డైరీ ఫాం భూములను కాజేసేందుకు మార్చి 18న కొత్త కమిటీకి ఛైర్మన్‌గా చెప్పుకుంటున్న గాడు వెంకటప్పడు ఎవరికీ తెలియకుండా తమ వారిని గోవా తీసుకువెళ్లి అక్కడ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో డీఎల్‌డీఏ ఈఓ సూర్యప్రకాశరావు కూడా ఉన్నారు. వీరు గోవా వెళ్లినట్లు రుజువుచేసే విమానం టిక్కెట్లు ఇతర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇంత రహస్యంగా ఈ కమిటీని నియమించాల్సిన పని ఏముంది? ఇన్‌ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా భూములు కైంకర్యం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం ఈ వ్యవహారం వెనుక కీలక సూత్రధారి డీఎల్‌డీఏ ఈఓ సూర్యప్రకాశరావు. ఆరు నెలల కిత్రం డైరీ లోని మహిళా ఉద్యోగులు సీఎంను కలిసి తమపట్ల ఈఓ సూర్యప్రకాశరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈయనపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని సీఎం ఆదేశించినా ఆయనను విజయనగరం బదిలీ చేసి మళ్లీ విశాఖకు తీసుకువచ్చారు.

అవగాహన ఉన్నవారే ఛైర్మన్‌ కావాలి 
అమాయకుడైన గాడు వెంకటప్పడును డైరీ ఫాం భూముల కుంభకోణంలో ఇరికించేస్తారేమోనని అనుమానంగా ఉంది. నిబంధనల ప్రకారం నియోజకవర్గానికి ఒక డైరెక్టరు చొప్పున నియమించాలి. పాడి పరిశ్రమపై అవగాహన ఉన్నవారిని కమిటీ ఛైర్మన్‌గా ఎంపికచేయాలి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులకు ఇందులో స్థానం కల్పించకూడదు. వెయ్యి కోట్ల రూపాయల భూములను కేవలం రూ.పది కోట్లుకు దక్కించుకోవాలనుకుంటున్న వారి కుట్రకు అడ్డుకట్టు వేయాలి. వాస్తవాలు ఇలా ఉండగా ఇదంతా ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలంటూ ప్రచారం చేస్తున్నారు’’అని మంత్రి అయ్యన్నపాత్రుడు వివరించారు.

Posted

ruling party member , that too minister complaining aa j&*

Posted
1 minute ago, TampaChinnodu said:

ruling party member , that too minister complaining aa j&*

Mari Aa level Lo undi pulkas avinithi

Posted
Quote

ఈయనపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని సీఎం ఆదేశించినా ఆయనను విజయనగరం బదిలీ చేసి మళ్లీ విశాఖకు తీసుకువచ్చారు.

CM maata kooda vinatleda j&*

Posted
40 minutes ago, TampaChinnodu said:

@ARYA what is happening in your home town man

20 yrs dev in 4 yrs man

Posted

Govt marithe ne telustundi, ae range lo funds misuse ayinavi ani...

Ilanti fund divert India lo epudu evaru kuda cheyaledu....

Posted
1 hour ago, TampaChinnodu said:

ruling party member , that too minister complaining aa j&*

yes veediki ganta ki padadhu......andhuke ganta gaadi manushulu ekkada vunte akkada gola chesi denguthadu 

Posted
57 minutes ago, Equalirights said:

Maa yeshu bidda shheemmm avale ivanni agale...

appatidaka ee kukka edupu aagadu antava $s@d 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...