TampaChinnodu Posted April 10, 2018 Report Posted April 10, 2018 నేటి నుంచి ఆనంద నగరాల సదస్సు మూడు రోజుల పాటు అమరావతిలో... 15 దేశాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు ప్రారంభించనున్న చంద్రబాబు ఈనాడు, అమరావతి: అత్యంత ఆనందదాయక నగరంగా అమరావతిని తీర్చిదిద్దే చర్యలపై సమగ్ర చర్చకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘సంతోష నగరాల సదస్సు’ మంగళవారం(నేటి) నుంచి మొదలుకానుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ వేదికగా మూడు రోజుల పాటు ఇది జరగనుంది. వర్ధమాన దేశాల్లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు కనుక్కోవడం, ఆ దిశగా అవసరమైన ఆవిష్కరణల రూపకల్పనపై ఇక్కడ చర్చలు జరగనున్నాయి. పౌర ఆధారిత పరిపాలన, పరిశుభ్ర-ఆరోగ్యకర వాతావరణం, ఉజ్వల ఆర్థిక వ్యవస్థ, నివాసయోగ్యత, సుస్థిరాభివృద్ధి తదితరాంశాలు ప్రధాన ప్రాతిపదికగా ఈ సదస్సు జరగనుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏ, సీఐఐ, డాల్‌బెర్గ్, సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సింగపూర్) సంస్థల భాగస్వామ్యంతో ఇది జరుగుతోంది. సదస్సులో భాగంగా ఏడు అంశాలపై ప్యానల్ చర్చలు, రెండు అంశాలపై కార్యశాలలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 11గంటలకు సీఎం చంద్రబాబు సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. అనంతరం జీవితాన్ని ఆనందంగా గడపడమెలా? అనే అంశంపై ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉపన్యసిస్తారు. 15కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సదస్సుకు మొత్తంగా వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఫిన్‌లాండ్, యూకే, సింగపూర్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భూటాన్, కోస్టారికా, కొలంబియా, టాంజానియా, ఇజ్రాయెల్, స్పెయిన్, అమెరికా తదితర దేశాల నుంచి 100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మేధావులు, ఆర్కిటెక్ట్‌లు, నగర ప్రణాళిక నిపుణులు తదితరులు వీరిలో ఉన్నారు. ప్యానల్ చర్చలు-అంశాలు * 21వ శతాబ్దంలో నగరాలు: సంతోషమే సరిహద్దుగా ఎందుకు కావాలంటే? * జీవన అనుకూల వాతావరణం: ప్రజలే ముందు ఆధారిత పరిపాలనపై పౌరులకు హామీ * నగరాల సంతోషానికి కొలమానం: ఇదేమిటి? ఎందుకు అవసరం * ఆనందదాయక జీవనం: నివాసయోగ్యత * పరిశుభ్ర, హరిత, నీలం: సుస్థిర, ప్రభావవంత, స్థితిస్థాపక నగరాలు * రైతులు గళం: అమరావతి ప్రథమ పౌరులు * ఉద్దేశం-శ్రేయస్సు: ఉజ్వల, సరికొత్త ఆర్థిక వ్యవస్థలు కార్యశాలలు-అంశాలు * సంతోష నగరాల సూచీ దిశగా పయనం ప్రారంభం * నగర నాయకుల ప్రయోగశాల: నగరీకరణ కఠిన సవాళ్ల పరిష్కారం సదస్సుకు సర్వం సిద్ధం మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలులో జరగనున్న అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సదస్సు వేదికను అతి సుందరంగా, డిజిటల్ స్క్రీన్‌లతో ఏర్పాటుచేశారు. అత్యుత్తమ ఆచరణలు, విధానాలపై చర్చిస్తాం అమరావతి ప్రజలు ఆనందంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు అవసరమో ఈ సదస్సు వేదికగా చర్చిస్తాం. వివిధ దేశాల్లో అమలవుతున్న అత్యుత్తమ ఆచరణలు, విధానాల అధ్యయనానికి సదస్సు దోహదపడుతుంది. -పి.నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి Quote
TampaChinnodu Posted April 10, 2018 Author Report Posted April 10, 2018 Quote ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోంది. Quote
Paidithalli Posted April 10, 2018 Report Posted April 10, 2018 Pepancham thagaledthunte evado Fidel vayisthu kusunnadata.. atluntayi aa guruvinja rao and bhuthu kittadi elevations Quote
Android_Halwa Posted April 10, 2018 Report Posted April 10, 2018 33 minutes ago, TampaChinnodu said: Kaka, idi aithe nijam... first time in the world, a conference is being held in a virtual world... and a conference title chudu, abhabho... Quote
tables Posted April 10, 2018 Report Posted April 10, 2018 induku kaadu aa bodi gaadu grudda meeda 10gedi. scs kosam fight cheyamante happy sadassu anta..... Quote
Hitman Posted April 10, 2018 Report Posted April 10, 2018 ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోంది something fishy... ఫిన్‌లాండ్, యూకే, సింగపూర్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భూటాన్, కోస్టారికా, కొలంబియా, టాంజానియా, ఇజ్రాయెల్, స్పెయిన్, అమెరికా తదితర దేశాల .. ee list choostunte ekkado kodutundi.. ISrael lo CBN old freinds unnaru.. remaining all countries nunchi chinna babu fans vunnaru kabatti.. vallu arrange chesina gorrelu ayyi untaru... Quote
WHAT Posted April 10, 2018 Report Posted April 10, 2018 edo christian maha sabalu laga undi rhyming Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.