Jump to content

Recommended Posts

Posted
ఆనంద నగరి 
సంతోష నగరంగా అమరావతి 
అత్యంత నివాసయోగ్యంగా తీర్చిదిద్దుతాం 
ప్రజా రవాణా వ్యవస్థకే పెద్దపీట 
ఫిన్లాండ్‌, సింగపూర్‌ విధానాలే స్ఫూర్తి 
సదస్సు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 
ఈనాడు - అమరావతి 
10ap-main1a.jpg

‘రాజధాని అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ ఆనంద నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ‘‘ఈ నగర నిర్మాణంలో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తాం. నివాసానికి అత్యంత యోగ్యమైన, పరిశుభ్రమైన వాతావరణం కలిగిన, ఆర్థిక కార్యకలాపాలకు వేదికగా తీర్చిదిద్దుతాం. అన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాలే వినియోగిస్తాం. 70-80 శాతం ప్రజా రవాణా వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. 3600 కి.మీ.ల పొడవైన సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. సౌర విద్యుత్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం. మాది సూర్యుడు ఉదయించే రాష్ట్రం. సూర్యుడే మాకు రాయబారి. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటాం...’’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తొలి ఆనంద నగరాల సదస్సును మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌ ప్రారంభించారు. వర్థమాన దేశాల్లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఎదురవుతున్న సవాళ్లు, వాటికి వినూత్న పరిష్కారాలు, నవ్య ఆవిష్కరణలపై చర్చిస్తారు. 80 దేశాలకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగర ప్రణాళిక నిపుణులు, ఆర్కిటెక్ట్‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఇంజినీరింగ్‌ నిపుణులు హాజరయ్యారు.

డబ్బుతోనే సంతోషం రాదు..! 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘హ్యాపీనెస్‌’కు ఇస్తున్న ప్రాధాన్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఫిన్లాండ్‌, సింగపూర్‌లలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాల్ని ప్రస్తావించారు. ‘‘జీవితంలో డబ్బు, విలాసవంతమైన సౌకర్యాలు మాత్రమే ఆనందాన్ని ఇవ్వవు. ఉత్తమ జీవన విధానమే సంతోషాన్ని కలిగిస్తుంది. నగరాల్ని అత్యంత ఆనందకరంగా ఎలా తీర్చిదిద్దాలన్నదే ఈ సదస్సు ముఖ్యోద్దేశం...’’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణంలో ప్రతి వారం ‘హ్యాపీ సండే’ నిర్వహిస్తున్నామని, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారాను ప్రజల్లో సంతోషం నింపవచ్చన్నారు. కృష్ణా నది ఒడ్డున నిర్మిస్తున్న అమరావతిని హరిత-నీలి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నవ కల్పనలు, సంతోష నగరాలకు సంబంధించి దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ‘‘21వ శతాబ్దంలో ఉన్నాం. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఇప్పుడు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకుంటూ, సరైన నాయకత్వం ఇవ్వగలిగితే అద్భుతాలు చేయవచ్చు...’’ అని వివరించారు.

పనిలోనే సంతోషం.. ‘‘పదేళ్ల క్రితం హ్యాపీనెస్‌ గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. అప్పట్లో అభివృద్ధి, ఆ తర్వాత స్మార్ట్‌ సిటీలు, వాటి తర్వాత నివాస యోగ్యమైన నగరాలు గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆనంద నగరాలపై చర్చ జరుగుతోంది. జీవితం అర్థవంతంగా ఉండాలి. బతికినంతకాలం ఆనందంగా బతకాలి. మీరు ఎప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలరని కొందరు నన్ను ప్రశ్నిస్తుంటారు. నా పనిని ఆనందంగా ఆస్వాదిస్తాను కాబట్టే ఎంత కష్టపడ్డా సంతోషంగా ఉండగలనని చెబుతుంటాను...’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ఈ సదస్సులో పాల్గొన్నవారంతా మీ ఆలోచనల్ని చెబితే... వాటన్నిటినీ మేళవించి ఉత్తమ విధానం రూపొందిస్తాం. మీరు కూడా ఒకటి రెండు మంచి ఆలోచనలతో తిరిగి వెళ్లాలి. సంతోషం, సృజనాత్మకత, నవ్య ఆవిష్కరణలకు అమరావతిని మీ రెండో నివాసంగా చేసుకోండి...’’ అని చెప్పారు. భూటాన్‌లోని గెలెఫు పట్టణ మేయర్‌ టికరమ్‌ కఫ్లీ మాట్లాడుతూ... భూటాన్‌లో స్థూల జాతీయోత్పత్తి కంటే, స్థూల జాతీయ సంతోష సూచీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తామని తెలిపారు. తమ దేశంలో విద్య, వైద్యం అందరికీ ఉచితమన్నారు. 70 శాతం భూభాగంలో పచ్చదనం ఉంటుందని, అది ఎట్టి పరిస్థితుల్లో 60 శాతానికి తగ్గకూడదన్న నిబంధన పెట్టుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో జుక్కా హొలప్పా (ఫిన్లాండ్‌), అనిబల్‌ గవీరియా (కొలంబియా), ఖూటెంగ్‌ చే (సింగపూర్‌) పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. రాజధాని పనుల పురోగతిని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు.

Posted
Quote

మాది సూర్యుడు ఉదయించే రాష్ట్రం.

In 1999, it was discovered that Dong in Arunachal Pradesh, which also happens to be the easternmost place in India, experiences the first sunrise of the country. Ever since that, visitors have been flocking the state and covering an 8 kilometer trek only to see the sun rise from behind the mountains.

Posted
Quote

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణంలో ప్రతి వారం ‘హ్యాపీ సండే’ నిర్వహిస్తున్నామని

what is this happy sunday program ? 

Posted

Future lo akkada names kuda happy reddy, happy naidu, happy chowdary, happy rao ilaa untayemo

Posted
2 hours ago, TampaChinnodu said:

In 1999, it was discovered that Dong in Arunachal Pradesh, which also happens to be the easternmost place in India, experiences the first sunrise of the country. Ever since that, visitors have been flocking the state and covering an 8 kilometer trek only to see the sun rise from behind the mountains.

Future generations history books lo saduvukuntaaru

Ashokudu chetlu naatinchenu

Kaakathiyulu cheruvulu thavvinchenu

CBN Hyderabad And Amaravathi kattinchenu , Sun rise ni Arunachal Pradesh nundi AP ki shift sepinchenu. 

Posted
3 hours ago, Paidithalli said:

Image result for chandrababu dance gif ee anandathandavam eyyaledha ? 

Practice cheyinchataaniki Jaggi vasudev came ani @TampaChinnodu  ki chinna babu tweeted...

Posted

City ae ledu ada...leni City la happiness endi ra ayya...daniki oka sangham petti, public ni jama chesi endi ra ayya ie lolli

Posted

Indirect ga massage centers petti happy endings cheyistadu emo mana chandral sir 

Posted
3 hours ago, Aryaa said:

Indirect ga massage centers petti happy endings cheyistadu emo mana chandral sir 

@3$%

Posted
7 hours ago, Android_Halwa said:

City ae ledu ada...leni City la happiness endi ra ayya...daniki oka sangham petti, public ni jama chesi endi ra ayya ie lolli

@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...