TampaChinnodu Posted April 15, 2018 Report Posted April 15, 2018 వయోవృద్ధులకు భరోసా చట్టానికి కేంద్రం సవరణలు కోడలూ, అల్లుడికీ బాధ్యతలు ఏ మాత్రం తేడా వచ్చినా గట్టి శిక్ష! ఈనాడు, దిల్లీ: వయోవృద్ధులకు మరింత చక్కని సంరక్షణను అందించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం సంబంధిత చట్టానికి కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘తల్లిదండ్రులు, వయోవృద్ధుల ఆలనాపాలన, సంక్షేమ చట్టానికి (మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్) కీలక సవరణలు చేయనున్నారు.‘పిల్లలు’ అనే పదం నిర్వచనాన్ని కూడా విస్తృతం చేయనున్నారు. ‘పిల్లల’ పరిధిలో ప్రస్తుతం ఉన్న కుమారుడు, కుమార్తె, మనవడు, మనవరాలితో పాటూ ఇప్పుడిక కోడలు, అల్లుడిని కూడా చేర్చబోతున్నారు. ఒక్కసారి ఈ చట్టసవరణలు అమల్లోకి వస్తే... వయోవృద్ధులైన అత్తమామల సంరక్షణ విషయంలో అల్లుడు, కోడలిని కూడా బాధ్యులుగా పరిగణిస్తారు. * వృద్ధులైపోయిన తలిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, పట్టించుకోకుండా వదిలేసినా ఇక నుంచి రూ.10వేల జరిమానా చెల్లించాలి. ఆరునెలల జైలుశిక్ష పడే అవకాశమూ ఉంది. ప్రస్తుతం జరిమానా రూ.5వేలుగా, జైలుశిక్షా కాలం మూడునెలలుగా ఉన్న విషయం గమనార్హం. * ఈ సవరణ బిల్లు ప్రకారం వృద్ధులైన తలిదండ్రుల నెలవారీ అవసరాలు, ఖర్చుల నిమిత్తం ఇస్తున్న రూ.10వేలపై ఉన్న పరిమితిని తొలగించనున్నారు. ప్రస్తుతం ఇస్తున్న ఈ మొత్తం పెద్ద నగరాల్లో ఏ మాత్రం చాలదు. అందుకే రూ.10వేల పరిమితిని పెంచబోతున్నారు. * సంబంధిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు క్రమం తప్పకుండా తల్లిదండ్రులకు నెలవారీ ఖర్చులను చెల్లించడంలో విఫలమైన వారికి ఆ బకాయిలు చెల్లించే వరకూ జైలుశిక్ష పడే అవకాశమూ ఉంటుంది. * వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, డే కేర్ సెంటర్‌ల పనితీరుకు కూడా ‘క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా’ వంటి సంస్థల ద్వారా ప్రమాణాలు నిర్ధారించాలని బిల్లు పేర్కొంటోంది. * వయోవృద్ధుల ఆస్తిపాస్తులను మాయచేసి అమ్మేసే పోకడలకు కూడా ఈ సవరణ బిల్లు అడ్డుకట్టువేయనుంది. యజమానులైన వృద్ధుల నుంచి సరైన అనుమతి, ఆమోదం లేకుండా వారి ఆస్తులను అమ్మేసేందుకు వీలులేని విధంగా చట్టాన్ని కట్టుదిట్టం చేయనుంది. * ఈ సవరణ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. Quote
TampaChinnodu Posted April 15, 2018 Author Report Posted April 15, 2018 Quote * వృద్ధులైపోయిన తలిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, పట్టించుకోకుండా వదిలేసినా ఇక నుంచి రూ.10వేల జరిమానా చెల్లించాలి. ఆరునెలల జైలుశిక్ష పడే అవకాశమూ ఉంది. ప్రస్తుతం జరిమానా రూ.5వేలుగా, జైలుశిక్షా కాలం మూడునెలలుగా ఉన్న విషయం గమనార్హం. * ఈ సవరణ బిల్లు ప్రకారం వృద్ధులైన తలిదండ్రుల నెలవారీ అవసరాలు, ఖర్చుల నిమిత్తం ఇస్తున్న రూ.10వేలపై ఉన్న పరిమితిని తొలగించనున్నారు. ప్రస్తుతం ఇస్తున్న ఈ మొత్తం పెద్ద నగరాల్లో ఏ మాత్రం చాలదు. అందుకే రూ.10వేల పరిమితిని పెంచబోతున్నారు. ilanti rules kooda vunnaya Quote
Lakhan Posted April 15, 2018 Report Posted April 15, 2018 Pelli chesukunna pellani galikodelese vallaki emi siksha Leda? @TampaChinnodu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.