TampaChinnodu Posted April 16, 2018 Report Posted April 16, 2018 జియో హోమ్ టీవీ వచ్చేస్తోందా? ఇంటర్నెట్‌డెస్క్: టెలికాం రంగంలో జియో ఒక సంచలనం. ఉచిత ఆఫర్లతో మొదలు పెట్టి, అతి తక్కువ కాలంలోనే 10కోట్లమంది చందాదారులను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత కూడా అతి తక్కువ ధరకే ఎక్కువ డేటాను అందిస్తూ వేగంగా వృద్ధిని నమోదు చేస్తోంది. అంతేకాదు, ఇతర టెలికాం సంస్థలకూ ముచ్చెమటలు పోయిస్తోంది. త్వరలోనే ‘జియో ల్యాప్‌టాప్’ వస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మరో తీపి కబురును కూడా జియో చెప్పనుందా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. జియో త్వరలోనే ‘జియో హోమ్ టీవీ’ పేరిట సరికొత్త సేవలను ప్రారంభించనుందట. అంతేకాదు, అన్ని ఎస్‌డీ(స్టాండర్డ్ డెఫినేషన్) ఛానళ్లను నెలకు రూ.200లకే అందించనుందని సమాచారం. ఇక ఎస్‌డీ+హెచ్‌డీ(హై డెఫినేషన్) ఛానళ్లు రూ.400కే అందిస్తుందని చెబుతున్నారు. ఇదే జరిగితే డీటీహెచ్ రంగంలో సరికొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సేవలకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సరికొత్త టెక్నాలజీ ఎన్‌హేన్సడ్ మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్ మల్టీకాస్ట్ సర్వీస్(ఈఎంబీఎంఎస్) ఆధారంగా పనిచేస్తుందని సమాచారం. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే సేవలను అందిస్తోందన్న జియో బ్రాడ్‌కాస్ట్ యాప్‌నకు సరికొత్త రూపమే ఈ ‘హోం టీవీ’. ఇటీవల హెచ్‌డీ ఛానళ్లను కూడా పరీక్షించారట. జియో వినియోగదారులందరికీ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Quote
TampaChinnodu Posted April 16, 2018 Author Report Posted April 16, 2018 Costly plan. CBN is providing both internet plus cable only for 150 Rs no. Quote
PCR_MURTY Posted April 16, 2018 Report Posted April 16, 2018 7 minutes ago, TampaChinnodu said: Costly plan. CBN is providing both internet plus cable only for 150 Rs no. jagan ki vote veyyi free ga isthadu anni Quote
iPhoneX Posted April 16, 2018 Report Posted April 16, 2018 31 minutes ago, PCR_MURTY said: jagan ki vote veyyi free ga isthadu anni Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.