TampaChinnodu Posted April 17, 2018 Report Posted April 17, 2018 అమ్మను అమ్మేశారు! బాసరలో దోపిడీ రూ. 100 కోట్ల పైనే నిగ్గు తేల్చిన విచారణ కమిటీ ‘ఈనాడు-ఈటీవీ’ కథనాలకు స్పందన ఈనాడు - హైదరాబాద్ చదువుల తల్లి.. జ్ఞాన సరస్వతి కొలువుదీరిన బాసర దేవస్థానంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు రూఢీ అయింది. అమ్మవారి పేరు చెప్పి స్థిరాస్తులు, ఆలయ సంపదను దోచుకున్న తీరు చూస్తే కళ్లుబైర్లు కమ్ముతున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు అంతా ఒక్కటై అవినీతిలో మునిగి తేలినట్లు తేలింది. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా గత మూడేళ్లలోనూ మరింత భారీగా దండుకున్నట్లు ప్రభుత్వం చేయించిన విచారణలో తేలింది. అక్రమాల విలువ దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. అమ్మవారి ప్రాశస్త్యం, ఆలయ ప్రభకు మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్న అనేక ఉదంతాలు ప్రభుత్వం దృష్టికి చేరాయి. కొందరు వ్యక్తులు కూటమిగా ఏర్పడి శక్తులుగా మారి దేవాదాయ శాఖను ప్రభావితం చేస్తున్నారని, అక్రమాలు ఎన్ని చేసినా రాజకీయ నాయకులు, పెద్దల అండదండలతో ఆలయంలోనే తిష్టవేస్తున్నారనే విషయం వెలుగు చూసింది. గుట్టువిప్పిన ‘ఈనాడు-ఈటీవీ’: పవిత్ర గోదావరి నదీతీరంలో జ్ఞానసరస్వతి కొలువుదీరడంతో బాసర క్షేత్రం ఎంతో ఖ్యాతిపొందింది. ఇక్కడ పాతుకుపోయిన అక్రమార్కులు.. పెద్దలు కలిసి ఆలయానికి వచ్చే ఆదాయాన్ని దిగమింగుతున్న విషయాన్ని ‘ఈనాడు-ఈటీవీ’ వెలుగులోకి తెచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ‘అక్రమాల చెరలో చదువులమ్మ, అక్రమాలకు అక్షరాభ్యాసం, చదువులమ్మ.. కంట చెమ్మ, సరస్వతీ క్షేత్రం.. అవినీతి స్తోత్రం, సరస్వతీ ప్రసాదం.. తయారీ అస్తవ్యస్తం..’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురించింది. దేవస్థానానికి చెందిన స్థిరాస్తులు, పోటు, టికెట్లు, నిర్వహణతోపాటు అనేక అంశాలపై క్షుణ్ణంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన ప్రభుత్వం విచారణకు ప్రత్యేక కమిటీని నియమించింది. 2014 నుంచి 2017 చివరి వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన అక్రమాలను తేల్చాలని సూచించింది. కథనాల్లో పేర్కొన్న ప్రతి అంశాన్ని పరిశీలించి రికవరీ, చర్యలు, అభివృద్ధికి సూచనలు కూడా చేయాలని సూచించింది. దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్‌గా ఉన్న కృష్ణవేణి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ నెల రోజులపాటు బాసరలో ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసి అక్రమాలు, జరిగాయని నిర్ధారించింది. మొత్తం 13 ప్రత్యేక అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వ దేవాదాయ కమిషనర్ శివశంకర్‌కు అందజేసింది. ఈ మూడేళ్లకాలంలో పనిచేసిన ఈఓ, ఏఈఓ, సూపరింటెండెండ్, ఇతర సిబ్బంది ప్రమేయాన్ని, చట్ట ఉల్లంఘనలను, నిధుల మేతను, నిర్లక్ష్యాన్ని నివేదికలో పేర్కొంది. వారిపై క్రమశిక్షణ చర్యలు, రికవరీకి సంబంధించిన చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. Quote
TampaChinnodu Posted April 17, 2018 Author Report Posted April 17, 2018 Quote వారిపై క్రమశిక్షణ చర్యలు, రికవరీకి సంబంధించిన చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.