Jump to content

Cash crisis in Telangana, Andhra Pradesh


Recommended Posts

Posted
7 minutes ago, Kontekurradu said:

yes vadu india lo karchulaki levai tesukoni, UK ragane £ lo iichadu with interest pfdb_brahmi38.gif?1377272905

92.gif

  • Replies 58
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    23

  • Kool_SRG

    11

  • boeing747

    7

  • Hydrockers

    4

Top Posters In This Topic

Posted
ఆ నోట్లు బ్యాంకులకు రావడం లేదు: ఎస్‌బీఐ 
17brk133a-125.jpg

ముంబయి: బ్యాంకుల నుంచి బయటకు వెళ్తున్న రెండు వేల రూపాయల నోట్లు అదే స్థాయిలో తిరిగి బ్యాంకులకు రావడం లేదని ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీష్‌కుమార్‌ చెప్పారు. ప్రజలు రెండు వేల రూపాయల నోట్లను తమ వద్దే దాచుకుంటున్నారని పేర్కొన్న ఆయన వాటిని తిరిగి బ్యాంకులకు జమచేయాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పంట ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావడం వల్ల నగదు లావాదేవీలు పెరిగి కొరత ఏర్పడిందన్న రజనీష్‌కుమార్‌ ఎస్బీఐ పరంగా పరిస్థితిని చక్కదిద్దుతున్నట్లు వివరించారు. నగదు కొరత తాత్కాలికమేనన్న ఆయన త్వరలోనే పరిస్థితులు సర్ధుకుంటాయని వ్యాఖ్యానించారు.

‘‘మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర బిహార్‌, పంజాబ్‌లో ప్రస్తుతం పంటలు ఇంటికొస్తున్నాయి. రైతులకు చెల్లింపులు కారణంగా నగదు డిమాండ్‌ బాగా పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో నగదు సరిపడినంత ఉంది. నగదు పంపిణీ కేంద్రాల్లోని డబ్బును ఒక చోట నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నాం. కొన్ని చోట్ల రూ.500 నోట్ల కొరత ఉంది. అవసరమైన మేరకు సరఫరా చేయాలని ఆర్బీఐని కోరాం’’ అని ఎస్బీఐ ఛైర్మన్‌ వెల్లడించారు. 

Posted
రూ.2000 నోట్ల మాయం వెనక కుట్ర!

06333817BRK-CASHCURN2.JPG

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో నగదు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎక్కడ చూసినా ఏటీఎం యంత్రాల్లో నగదు లేదనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. కనీస అవసరాలైనా కూరగాయలు, పాలు, పండ్లు, కిరాణా సామగ్రి కొనుగోలు చేసేందుకు సైతం నగదు లభించడం లేదని సగటు మధ్య తరగతి వ్యక్తులు, వేతన జీవులు వాపోతున్నారు. కాళ్లరిగేలా గంటల కొద్దీ ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకడం లేదని మొత్తుకుంటున్నారు. 

ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయ విధుల్లో ఉండే తాము అటు బ్యాంకులకు పోలేకా ఇటు ఏటీఎంలలో నగదు దొరకక నరకం అనుభవిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీలో నగదు కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సహా ఆయా రాష్ట్రాల మంత్రులు కేంద్రానికి పరిస్థితిని తెలియజేశారు. సమస్యను పరిష్కరించాలని కోరారు.

06351117BRK-CASHCURN1.JPG

‘దేశంలో కరెన్సీ పరిస్థితులపై సమీక్షించాం. కావాల్సిన నగదు కన్నా ఎక్కువే చెలామణిలో ఉంది. బ్యాంకుల్లోనూ నగదు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా, అకస్మాత్తుగా నగదు వినియోగం పెరగడం వల్ల కరెన్సీ సమస్య ఏర్పడింది. ఇది తాత్కాలికం. త్వరలోనే పరిష్కరిస్తాం’ అని జైట్లీ ట్వీట్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలపై చాలా మంది తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఇంకెన్ని రోజులకు డబ్బులు దొరుకుతాయి అని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. చాలా తక్కువ స్థాయిలో ఆయన వ్యాఖ్యలకు మద్దతు లభిస్తోంది.

నోట్లరద్దు భయానక స్థితలో మళ్లీ దేశం: రాహుల్‌

ప్రధానిపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు  రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ‘నోట్ల రద్దు భయం’ మళ్లీ దేశాన్ని పట్టుకుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నోట్ల రద్దు నిర్ణయం దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థను నాశనం చేసిందన్నారు.

తాత్కాలికం కాదు: కేటీఆర్‌

సర్‌.. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత అకస్మాత్తుగా చోటుచేసుకుందో లేదా తాత్కాలికంగా ఏర్పడిందో కాదు.హైదరాబాద్‌లో గత మూడు నెలలుగా నగదు సమస్యపై తరచూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దయచేసి ఆర్‌బీఐ,ఆర్థికశాఖ అధికారులు దీనిపై కూలంకషంగా చర్చించండి. బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని పోగొట్టొద్దు.

దేశమంతా కరవే: జయంత్‌ కుమార్‌ మలియా, మధ్యప్రదేశ్‌ ఆర్థిక మంత్రి

ఈ పరిస్థితి కేవలం మధ్యప్రదేశ్‌లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉంది. 7 లక్షల కోట్ల రూ.2000 నోట్ల సరఫరా నిలిచిపోవడమే ఇందుకు కారణం.

ఆయన విదేశీ విహారి: కాంగ్రెస్‌

ప్రధాని విదేశాల్లో విహిరిస్తూ ఎంజాయ్‌ చేస్తుంటే దేశంలో ప్రజలు బ్యాంకుల్లో నగదు కోసం నిరీక్షిస్తున్నారని  కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ ఇంఛార్జీ రణ్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు.

నగదు కొరత లేదు: ఎస్‌బీఐ ఛైర్మన్‌

దేశంలో నగదు కొరత లేదు. రైతులు కొత్త ఏడాది సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో డిమాండ్‌ పెరిగి నగదు లభ్యతలో అసమానతలు పెరుగుతాయి. అందుకే పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో నగదుకు తీవ్రంగా డిమాండ్‌ ఉంది.  

పరిష్కారానికి కమిటీ: ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా

సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం రాష్ట్రాల వారీగా కమిటీని ఏర్పాటు చేసింది. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్బీఐ సైతం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నగదు సరఫరా పెంచేందుకు కమిటీని నియమించింది.

రూ.2000 నోట్ల మాయం వెనక కుట్ర: మధ్య ప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌

విపణిలో రూ.2000 నోటు కనిపించడం మాయమైంది. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. నోట్ల రద్దు ముందు రూ.15 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చెలామణిలో ఉంది. నోట్ల రద్దు తర్వాత రూ.16.50 లక్షల కోట్లకు పెరిగింది. కానీ రూ.2000 నోటు మాత్రం మార్కెట్‌లో కనిపించడం లేదు.

ఐదు రెట్లు పెరిగిన నోట్ల ముద్రణ: ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఎస్సీ గార్గ్‌

మేం రోజు 500 కోట్ల రూ.500 నోట్ల ముద్రణ చేస్తున్నాం. ఐదు రెట్లు ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకున్నాం. అంటే రోజుకు 2500 కోట్ల రూ.500 నోట్ల ముద్రణకు సామర్థ్యం పెరుగుతుంది. ఒక నెలలో రూ.75,000 కోట్ల నోట్లు చెలామణిలోకి వస్తాయి.

నోట్ల రద్దును గుర్తుచేస్తున్నాయి: మమత, పశ్చిమ బంగా సీఎం

కొన్ని రాష్ట్రాల ఏటీఎంలలో నగదు కొరత, పెద్ద నోట్ల కొరత ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి నోట్ల రద్దు నాటి రోజుల్ని గుర్తు తెస్తున్నాయి. దేశంలో ఏమైనా ఆర్థిక అత్యయిక స్థితి కొనసాగుతోందా?

Posted

whatsapp lo messages, wrong info passing,

also the FDI bill, Neerav Modi and other banks lo jargina issues,,

ivanni chuste common man ki bhayam vesi, taking out more than needed and hoarding cash or making settlements.

Govt cant do anything for this i guess. @3$%

Posted

కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా, అకస్మాత్తుగా నగదు వినియోగం పెరగడం వల్ల కరెన్సీ సమస్య ఏర్పడింది. ఇది తాత్కాలికం. త్వరలోనే పరిష్కరిస్తాం’ అని జైట్లీ ట్వీట్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలపై చాలా మంది తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఇంకెన్ని రోజులకు డబ్బులు దొరుకుతాయి అని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. చాలా తక్కువ స్థాయిలో ఆయన వ్యాఖ్యలకు మద్దతు లభిస్తోంది.

 

Ee Jaitley baabu gaari maatalu eppudu evadu lekkachesaaru ganaka ippudu pratyekinchi viluva ivvataaniki @3$%@3$%

Posted
8 minutes ago, Spartan said:

whatsapp lo messages, wrong info passing,

also the FDI bill, Neerav Modi and other banks lo jargina issues,,

ivanni chuste common man ki bhayam vesi, taking out more than needed and hoarding cash or making settlements.

Govt cant do anything for this i guess. @3$%

@3$%

Posted
50 minutes ago, Spartan said:

whatsapp lo messages, wrong info passing,

also the FDI bill, Neerav Modi and other banks lo jargina issues,,

ivanni chuste common man ki bhayam vesi, taking out more than needed and hoarding cash or making settlements.

Govt cant do anything for this i guess. @3$%

 

Posted
జైట్లీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: లోకేశ్‌ 
17brk123a.jpg

అమరావతి: వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా అంతా బాగుంది అంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడటం బాధాకరమని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో నగదు అందుబాటులో లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పరంగా పెన్షన్లు, ఉపాధిహామీ వేతనాల చెల్లింపులో కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరిస్తూ.. నగదు సరఫరా చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి లేఖ రాయడంతో పాటు అనేక సార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం లేదని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర కళ్లు తెరిచి నగదు అందుబాటులోకి తేవాలని నారా లోకేశ్‌ ట్విట్టర్‌లో అరుణ్‌జైట్లీని కోరారు. 

Posted
రూ.500నోట్ల ముద్రణ ఐదు రెట్లు పెంచుతాం

06134717BRK-130.JPG

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏటీఎంలలో విపరీతంగా నగదు కొరత ఏర్పడడంతో ప్రభుత్వం రూ.500నోట్ల ముద్రణను పెంచాలని నిర్ణయం తీసుకుంది. నగదు కొరతను తగ్గించేందుకు రూ.500నోట్ల ముద్రణను ఐదు రెట్లు పెంచుతున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ‘  నగదు కొరత తగ్గించేందుకు ఈ ముద్రణను అయిదు రెట్లు పెంచుతాం. మరో రెండు  రోజుల్లో 2,500కోట్ల రూ.500నోట్లను సరఫరా చేస్తాం. నెలలో 70,000 నుంచి 75,000కోట్ల నోట్లను ముద్రిస్తాం’ అని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్‌.సి గార్గ్‌ వెల్లడించారు.
 
రెండ్రోజులుగా మహారాష్ట్ర, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాల్లో విపరీతంగా నగదు కొరత ఏర్పడిన సంగతి తెలసిందే. చాలా ఏటీఎంల మందు ‘నగదు లేదు’ అని బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. నగదు కొరత తాత్కాలికమేనని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని హామీ ఇచ్చారు. కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు చలామణిలో ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా, అకస్మాత్తుగా నగదు వినియోగం పెరగడం వల్ల సమస్య ఏర్పడిందని అన్నారు.
దేశంలో నగదు కొరత ఏర్పడిందని అనడం సబబు కాదని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. పంట సేకరణ సీజన్‌ అయినందున కరెన్సీకి డిమాండ్‌ పెరిగి అసమతుల్యత ఏర్పడిందన్నారు. పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో పంట సేకరణ సమయం కాబట్టి డిమాండ్‌ ఎక్కువగా ఉందన్నారు.
Posted
52 minutes ago, boeing747 said:

Nirav modi and mallya lanti edhavalu 10gina dabbu teeskuravali

antha scene ledu . banks write off sesina loans assalu evaru theesukunnaru annadi kooda reveal seyyodu anta . against rules anta reveal seyyatam

Posted
2 minutes ago, TampaChinnodu said:

antha scene ledu . banks write off sesina loans assalu evaru theesukunnaru annadi kooda reveal seyyodu anta . against rules anta reveal seyyatam

thu dexmma...janalni matram peedistaru ee banks vallu, crores 10ge edhavalni evadu em feekaledu ento...ee bokkalo BJ party gallu foreign banks lo unna black money antha eskostam bongu boshanam annaru...cut cheste unna dabbu ni availablity lo lekunda chestunaru janalaki

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...