TheRogueOne Posted April 21, 2018 Report Posted April 21, 2018 http://telugu.gulte.com/tnews/26194/Pawan-Kalyans-Journalist-fan-silent-on-burning-issue ఆ గొంతు ఎందుకు మూగబోయింది? Apr 22, 2018 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరు హీరోలకి సినిమాల్లో అభిమానులుంటారు. కానీ పవన్ కల్యాణ్‌కి మాత్రం రాజకీయాల్లో- మీడియాలోనూ వీరాభిమానులు ఉంటారు. ప్రత్యేకం ఓ ప్రముఖ ఛానెల్ లో టాప్ జర్నలిస్టు కూడా పవన్ కి వీరాభిమానే. ఆయన ట్వీట్టర్ అకౌంట్ చూసినా- ఫేస్ బుక్ ప్రొఫైల్ చూసినా ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ వీరాభిమాని ఇప్పుడు ఎందుకో మూగబోయాడు. శ్రీరెడ్డి ఇష్యూ మీద ఎంత రచ్చ జరిగిందో తెలిసింది. ఆ రచ్చలో ఈ జర్నలిస్టు పనిచేసే ఛానెల్ పాత్ర కూడా చాలానే ఉంది. అందుకే పవన్ కల్యాణ్ నిన్న ఫిలిం ఛాంబర్ దగ్గర వ్యవహారం తర్వాత ఈ ఛానెల్ పెద్ద గురించి ట్వీట్ చేశాడు. శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌ని తిట్టింది. ఆ విషయం మీడియాలో రచ్చ అయ్యింది. బాబు హర్ట్ అయ్యాడు. ఏదో ఒకటి తేల్చడంటూ ఇండస్ట్రీ పెద్దలకు డెడ్ లైన్ పెట్టాడు. ఇంత జరుగుతున్నా ఈ పవన్ అభిమానిలో మాత్రం చలనం లేదు. మౌనంగా ఉన్నాడు. కనీసం సోషల్ మీడియాలో కూడా పవన్ ఇష్యూ గురించి స్పందించడం లేదు. ఈ జర్నలిస్టు స్పందిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎవరూ ఊహించని పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కర్సన్ మొదలవుతుంది. అందుకే ఈ మీడియా వ్యక్తి ఎప్పుడు స్పందిస్తాడో అని పీకే అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న టాక్ ప్రకారం పవన్ కల్యాణ్ ఓ కొత్త న్యూస్ ఛానెల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఛానెల్ బాధ్యతలను మనోడికి ఇస్తాడనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. సో... అధికారికంగా ఈ విషయంపై స్పష్టత వచ్చేదాకా సైలెంటుగా ఉండాలని డిసైడ్ అయ్యాడట ఈ టాప్ జర్నలిస్ట్. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.