Jump to content

Recommended Posts

Posted
భాజపా దొంగాట 
రాష్ట్రానికి ద్రోహం చేసి ఇష్టానుసారం విమర్శలు 
మొదటి నుంచి ఏపీని నిర్లక్ష్యంచేసిన ప్రధాని 
కాంగ్రెస్‌ వాళ్లు కూడా ఎప్పుడూ ఇలా చేయలేదు 
మోదీ జోరుకు కళ్లెం వేయాలి 
సాధికారమిత్రలతో సీఎం చంద్రబాబు 
21ap-main3a.jpg

* ఎన్నికల సమయంలో తిరుపతి సభలో హామీలిచ్చిన మోదీ.. వాటిని నిలబెట్టుకోకపోతే వడ్డీతో సహా వేంకటేశ్వరస్వామే వసూలు చేస్తారు. ఈనెల 30న తిరుపతిలో సభ పెట్టి మోదీ ఇచ్చిన హామీలను చిత్రసహితంగా ప్రదర్శిస్తాం. గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే భాజపాకు కూడా పడుతుంది. 
* తగినంత ఎంపీల బలం ఉన్నందునే ప్రధాని మోదీలో లెక్కలేనితనం పెరిగింది. ఇందిరాగాంధీ నుంచి మోదీ వరకు చూసిన అనుభవం నాది. ఈసారి కేంద్రంలో ప్రధానిని ఎన్నుకోవడంలో తెదేపా క్రియాశీలకంగా వ్యవహంచనుంది. 
* డబ్బంతా కర్ణాటక ఎన్నికలకు మళ్లించడంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడిందని ఇటీవల పత్రికల్లో రాస్తున్నారు. కష్టం చేసి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుని తిరిగి ఎప్పుడైనా తీసుకోవడం ప్రజల హక్కు. ఏటీఎంలలో డబ్బుల్లేకపోవడం దుర్మార్గపు చర్య. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. 
* జమ్ము-కశ్మీర్‌, యూపీలో జరిగిన అత్యాచార ఘటనలతో దేశం అతలాకుతలమై మహిళలు అభద్రతకు లోనవుతున్నారు. మరొకరు మళ్లీ ఇలాంటి తప్పు చేయకుండా బాధ్యులకు మరణశిక్ష విధించాలి.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీ దొంగాట అడుతోందని దాని దూకుడుకు కళ్లెం వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మొదటి నుంచి ప్రదాని మోదీ ఏపీని నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. కొన్ని రాష్ట్రాలపట్ల ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు కూడా ఎప్పుడూ ఇలా చేయలేదన్నారు. తాను చేస్తున్న పోరాటంలో ధర్మపోరాట దీక్ష మొదటిదని కేంద్రం దిగొచ్చి రాష్ట్రానికి న్యాయం చేసే వరకు పోరాటం సాగిస్తానని తెలిపారు. ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో శనివారం సాధికార మిత్రలతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్న ఆయన కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల నుంచి మనకు డబ్బు ఎందుకు ఇవ్వరో తేల్చుకుందాం. మోదీ ఆయన ఇంట్లోంచి తెచ్చి ఇవ్వడం లేదు కాదా! ఏపీ అభివృద్ధి చూసి ఆయన ఓర్వలేకపోతున్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ.350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడం ఎక్కడైనా చూశామా? విభజనతో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అండగా ఉంటారని ఎన్డీఏలో చేరితే కేంద్రం అహంభావంతో వ్యవహరించింది. ఎవరైనా ప్రశ్నిస్తే మోదీ తట్టుకోలేకపోతున్నారు. స్వార్థపూరిత పార్టీల అండచూసుకొని రాష్ట్రానికి ద్రోహం చేయడానికి ప్రధాని సిద్ధపడ్డారు. నా కంటే ఆలస్యంగా ముఖ్యమంత్రి అయిన ప్రధాని మోదీకి మొదటి నుంచి ఎంతో సహకరించా. ఆయన అహం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నా. అయినా మొదటి నుంచి రాష్ట్రంపట్ల ఆయన నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. అన్ని రాష్ట్రాలపై సమానంగా వ్యవహరించాల్సిన ఆయన పిల్లలపై తల్లి చూపే సమానత్వం కూడా చూపలేదు. పటేల్‌ విగ్రహానికి ఇచ్చిన రూ.2,500 కోట్లు కూడా కొత్త రాజధానికి ఇవ్వకపోవడం ప్రధాని దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనం. రాష్ట్రంలో భాజపాకు ఒక సీటైనా వచ్చే పరిస్థితి లేకపోయినా కోవర్టు పార్టీల అండ చూసుకొని అహంభావంతో వ్యవహరిస్తున్నారు. ఆయన దూకుడుకు కళ్లెం వేయాల్సిందే.

రాష్ట్రం కోసం ఒక వైపున శాంతియుత పద్ధతిలో పోరాటం చేస్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రానికి ద్రోహం చేయడానికి సిద్ధపడుతున్నాయి. బంద్‌కు పిలుపునిచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నించాయి. ప్రభుత్వ ఆధ్యర్యంలో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి లాలూచీ పార్టీ, కొత్త పార్టీ, మరికొన్ని పార్టీలు తప్ప మిగతా వారంతా వచ్చారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారు.

తీవ్ర అభద్రతలో ఎస్సీ, ఎస్టీలు 
దేశంలోని ఎస్సీ, ఎస్టీలు తీవ్ర అభద్రత భావంతో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రం వెంటనే స్పందించి ప్రజల పక్షాన నిలిస్తే 12 మంది చనిపోయే పరిస్థితి వచ్చేది కాదు. పాదయాత్రలో భాగంగా నేను అనకాపల్లిలో ఉన్నపుడు ఒక మహిళ కలిసి నిర్భయ ఘటనను ప్రస్తావించి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఆ రోజున ఆమెకు ఇచ్చిన భరోసా మేరకు రాష్ట్రంలో మహిళలకు తగిన రక్షణ కల్పిస్తున్నా. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్డార్‌’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

అర్హుల ఎంపికలో సాధికారమిత్రలకూ భాగస్వామ్యం... 
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అర్హుల ఎంపికలో జన్మభూమి, పంచాయతీ కమిటీలతోపాటు ఇక సాధికారమిత్రలకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతానికి తావులేకుండా నిజమైన పేదలకు న్యాయం చేయాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో సాధికారమిత్రలు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, పేదలకు పథకాలు సక్రమంగా వెళుతున్నాయా? లేదా? అనే విషయాలు పరిశీలించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. ప్రజల ఆకలిని తీర్చేందుకు జూన్‌ 2న రాష్ట్రంలో 200కిపైగా అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు మిగిలిన విడత పసుపు కుంకుమ మొత్తాలు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబాలన్నీ కలిసి హోటల్‌లో కూర్చొని భోజనం చేసేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించే ఆలోచన ఉన్నా, ప్రభుత్వం దగ్గర డబ్బు లేనందున అమలు చేయలేకపోతున్నానని  సీఎం వివరించారు. ఓసీల్లో పేదలకు చంద్రన్న పెళ్లి కానుక అందించే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజల విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం సాధికారమిత్రలు కృషి చేయాలని, ఇందుకోసం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వారందరికీ అందేలా చూడాలని కోరారు. ఆడపిల్లల జనాభా పెరుగుదలకు కృషి చేయాలని, మగాళ్లకంటే ఆడపిల్లతోనే మేలని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఆడపిల్లలకు సైతం మంచి ఉద్యోగాలు రావడంతో కట్నాలు సైతం తగ్గుతున్నాయని, కట్నం తీసుకోకుండా కూడా ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. చంద్రన్న పెళ్లి కానుక కోసం కొత్తగా మళ్లీ పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి తీసుకురావొద్దని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చమత్కరించారు.

Posted

congress vallu seyyaka povatam endi babu gaaru. state ni divide sesinde vallu ite @3$%

house theesi vallatho alliance antaada endi , elagu karnataka lo ade sesthunnam kada ani 

Posted
Quote

పటేల్‌ విగ్రహానికి ఇచ్చిన రూ.2,500 కోట్లు కూడా కొత్త రాజధానికి ఇవ్వకపోవడం ప్రధాని దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనం. 

40 years industry sir. koncham facts thelusukoni matladandi. 

aa statue kaduthundi gujarat state government with public private partnership. 

Posted
9 minutes ago, TampaChinnodu said:

40 years industry sir. koncham facts thelusukoni matladandi. 

aa statue kaduthundi gujarat state government with public private partnership. 

from what i understand, modiji ki telise aa statue allotments jarigayi ani......aa chorava ap ki kooda choopamani babu gari gola

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...