TampaChinnodu Posted May 3, 2018 Report Posted May 3, 2018 హద్దులు చెరుపు.. ఆక్రమణల కుదుపు చెరువుల ఎఫ్‌టీఎల్ లోపల నిర్మాణాలకు అనుమతి ఈనాడు, హైదరాబాద్ ఒకవైపు సుందరీకరిస్తున్నామనే పేరు.. మరోవైపు ఆక్రమణలకు ఊతమిస్తున్న తీరు.. చెరువులను కాపాడాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులే వాటికి ఉరి బిగిస్తున్నారు. ఏకంగా నీటి వనరుల పరిధిలో నిర్మాణాలకు అనుమతిస్తూ.. ప్రైవేటు వ్యక్తులకు వాటిని ధారాదత్తం చేస్తోంది. ఇందుకు నీటి పారుదల శాఖ కూడా తందానా అంటూ వంత పాడుతోంది. అడ్డగోలు అనుమతులు మంజూరు అయ్యాయని తెలిసినా.. బల్దియా యంత్రాంగం మాత్రం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పరిధులు మార్చేశారు.. మాదాపూర్ సమీపంలో గుట్టల బేగంపేట ప్రాంతంలో సున్నం చెరువు ఉంది. దాని వాస్తవ విస్తీర్ణం 32 ఎకరాలు. అందులో 70శాతం కబ్జాకు గురైంది. ఆక్రమణలను గుర్తించేందుకు గతేడాది బల్దియా, నీటిపారుదల విభాగం చెరువు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టం(ఎఫ్‌టీఎల్) పరిధిని నిర్ణయించాయి. అది పాత రెవెన్యూ మ్యాపులకు పూర్తి భిన్నంగా ఉంది. చెరువు ఎఫ్‌టీఎల్‌లోకి 30మీటర్ల మేర చొచ్చుకొచ్చిన ఓ భారీ వెంచర్‌ను కాపాడేందుకు నీటిపారుదల విభాగం ఉన్నతాధికారి ఎఫ్‌టీఎల్‌ను మార్చి చూపించారని స్థానికులు కోర్టుకెక్కారు. తప్పిన భారీ ప్రమాదం... దీప్తిశ్రీనగర్‌లో నాలాపై భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించుకునేందుకు నీటిపారుదల విభాగం ఎన్వోసీ ఇవ్వడం, దాన్ని ఆధారంగా చేసుకుని బల్దియా నిర్మాణ అనుమతి ఇచ్చింది. అదే సమయంలో(సెప్టెంబర్, 2017) వర్షాలు కురవడంతో వరదంతా నిర్మాణం కోసం తవ్విన సెల్లార్‌లోకి చేరింది. దాంతో చుట్టూ ఉన్న ఇళ్ల పునాధులు నిండిపోయాయి. నిర్మాణాలు కూలిపోయే వాతావరణం ఏర్పడింది. భయంతో జనాలంతా రోడ్లపైకి వచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నకిలీ ఎన్వోసీ(నిరభ్యంతరపత్రం) గుట్టు రట్టు చేశారు. అక్రమంగా ఎన్వోసీ ఇచ్చిన సూపరింటెండెంట్ ఇంజినీరును అరెస్టు చేసేందుకు అప్పటి పోలీస్ కమిషనర్ సిద్ధమయ్యారని.. మేయర్ కలుగజేసుకుని అరెస్టును అడ్డుకున్నారని స్థానికులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. బాతుల చెరువులో భారీ భవంతి.. హయత్‌నగర్ పరిధిలో బాతుల చెరువు ఉంది. దాని చుట్టూ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఆయా ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలంటూ బల్దియాకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. వాటన్నింటికి ఎఫ్‌టీఎల్ పేరుతో అభ్యంతరం చెప్పిన నీటిపారుదల విభాగం.. దాదాపుగా చెరువు మధ్యలో జరుగుతోన్న ఎనిమిది అంతస్తుల నిర్మాణానికి మాత్రం ఎన్వోసీ ఇస్తున్నారు. దాంతో ముడుపులు ఇస్తే జీహెచ్‌ఎంసీ హుస్సేన్‌సాగర్‌లోనైనా నిర్మాణానికి అనుమతిస్తుందని వాపోతున్నారు. అక్రమ ఎన్వోసీలపై విచారణ..! నీటిపారుదల విభాగం గత రెండేళ్లుగా ఇచ్చిన అక్రమ ఎన్వోసీలు సుమారు 200లకుపైగా ఉన్నాయని ఓ బల్దియా సీనియర్ ఇంజినీరు ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ కారిడార్‌లోని మల్కం చెరువు, దుర్గం చెరువులో సుందరీకణ పేరుతో అక్రమ నిర్మాణాలను అధికారిక నిర్మాణాలుగా మార్చుతున్నారని, చెరువు స్థలంలో దర్జాగా నిర్మాణాలు వెలిసేందుకు అవకాశం ఇచ్చారని వాపోయారు. రాజకీయ అండతో సదరు విభాగం సీనియర్ అధికారి జారీచేసిన అక్రమ ఎన్వోసీలపై బల్దియా కమిషనర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధరణ రెవెన్యూశాఖ, చెరువుల పరిరక్షణ కమిటీ సమన్వయంతో జరగాలని ఆయన కోరారు. నల్లచెరువే నిలువెత్తు నిదర్శనం.. ఉప్పల్ సర్వే నం.155లో ఉన్న నల్లచెరువు ఒకప్పుడు 100ఎకరాల్లో ఉండేది. ఆక్రమణలు పెరగడంతో రెవెన్యూ విభాగం 2013లో సర్వే నిర్వహించి 64 ఎకరాల చెరువు స్థలాన్ని గుర్తించింది. దానికి ఎఫ్‌టీఎల్ సరిహద్దులు నిర్ధరించింది. అప్పటి తహసీల్దారు పలువురు ఆక్రమణదారులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా జీహెచ్‌ఎంసీ ఇప్పుడు చేతివాటం ప్రదర్శిస్తోంది. 64 ఎకరాల స్థలం కళ్ల ముందు కనిపిస్తున్నా.. కేవలం 50 ఎకరాలకు కంచె నిర్మిస్తోంది. సీనియర్ ఇంజినీరు స్థానిక నేతలతో కుమ్మక్కై మిగిలిన 14 ఎకరాలను ఆక్రమణలకు వదిలేశారని రెవెన్యూ విభాగం సీనియర్ అధికారి ‘ఈనాడు’తో తెలిపారు. బాగు చేస్తామంటే చెరువును అప్పగించాం గానీ.. సొంత ఆస్తి మాదిరి సీనియర్ ఇంజినీరు చెరువును మింగేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో బల్దియాపై ఫిర్యాదు చేయాల్సి వస్తుందని చెప్పారు. Quote
TampaChinnodu Posted May 3, 2018 Author Report Posted May 3, 2018 Why do people keep buying real estate in flood prone areas too . crazy . Quote
TampaChinnodu Posted May 3, 2018 Author Report Posted May 3, 2018 Quote దీప్తిశ్రీనగర్‌లో నాలాపై భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించుకునేందుకు నీటిపారుదల విభాగం ఎన్వోసీ ఇవ్వడం, దాన్ని ఆధారంగా చేసుకుని బల్దియా నిర్మాణ అనుమతి ఇచ్చింది. అదే సమయంలో(సెప్టెంబర్, 2017) వర్షాలు కురవడంతో వరదంతా నిర్మాణం కోసం తవ్విన సెల్లార్‌లోకి చేరింది. దాంతో చుట్టూ ఉన్న ఇళ్ల పునాధులు నిండిపోయాయి. నిర్మాణాలు కూలిపోయే వాతావరణం ఏర్పడింది. భయంతో జనాలంతా రోడ్లపైకి వచ్చారు. Do some research before buying. flood ayyaka vachi gola sesthe em labam. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.