TampaChinnodu Posted May 4, 2018 Report Posted May 4, 2018 గత నెలలోనే ఒప్పందం తెగదెంపులు చేసుకున్నాం శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత బీఎస్రావు, డైరెక్టర్ సుష్మ స్పష్టీకరణ ఇంటర్, జేఈఈ మెయిన్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి విద్యా సంస్థల్లో చదివిన వారిగా, వారికి ర్యాంకులు తెప్పించిన క్రెడిట్ తమదేనన్న అర్థం వచ్చేలా నారాయణ విద్యాసంస్థ అడ్వర్టయిజ్మెంట్లు ఇస్తోందని శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బీఎస్రావు, డైరెక్టర్ సుష్మ పేర్కొన్నారు. శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులను నారాయణ విద్యా సం స్థల విద్యార్థులుగా చెప్పుకోవడం తప్పని అన్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు చేపట్టే వీలుందని, భవిష్యత్తులో ఇలాంటివి కొనసాగితే చర్యలు తప్పవన్నారు. శుక్రవారం వీరు హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యారంగంలో విశేష కృషి చేయాలన్న ఉద్దేశంతో ఐదేళ్ల కిందట శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు సంయుక్తంగా శార్వాణి విద్యాసంస్థలను (చైనా బ్యాచ్) ఏర్పా టు చేశాయని, అయితే అన్ని అంశాల్లో నారా యణ విద్యా సంస్థల నుంచి సహకారం అందడం లేదని చెప్పారు. గతేడాది నుంచే సమావేశాలు జరగలేదని, దీంతో కీలక నిర్ణయాలు ఆగిపోయాయన్నారు. గత అక్టోబర్లో కేసులు పెట్టడం వంటి చర్యలతో దూరమయ్యామని, గత నెల 12న జరిగిన చివరి సమావేశంలో తెగదెంపులు చేసుకున్నామన్నారు. శార్వాణికి పంపించిన ఎవరి విద్యార్థుల బాధ్యత వారిదేనని, ఎవరి విద్యార్థుల ర్యాంకులను వారే ప్రకటించుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రస్తు తం అదే కొనసాగు తోందన్నారు. అయితే, మొన్నటి జేఈఈ ర్యాం కుల్లో శ్రీచైతన్య విద్యార్థులను నారాయణ విద్యార్థులుగా చూపించుకున్నారని చెప్పారు. తాము శార్వాణికి పంపించినవారే కాకుండా తమ విద్యాసంస్థలో ఇంటర్ చదివిన వారి సక్సెస్ కూడా నారాయణ సంస్థలదే అన్నట్లుగా ప్రకటనలు ఇచ్చి తప్పు చేశారన్నారు. ఏపీ ఇంటర్ పరీక్షఫలితాల్లో ర్యాంకులు వచ్చిన విద్యార్థులు రెండు సంస్థలకు చెందిన వారుగా ఇచ్చారని, ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థల తో సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను చేర్పించాలన్నారు. చైనా పేరుతో ఇకపై ఉండబోదని, ఇక సెకండియర్ బ్యాచ్ ఒకటే ఉందని, అదే చివరిదని స్పష్టంచేశారు. Quote
TampaChinnodu Posted May 4, 2018 Author Report Posted May 4, 2018 నారాయణ యాజమాన్యంపై శ్రీ చైతన్య కాలేజీల చైర్మన్ ఫైర్ ర్యాంకుల వ్యవహారంలో కార్పోరేట్ కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ యాజమాన్యాల మధ్య వార్ వేడెక్కింది. తమ ర్యాంకులను నారాయణకు వచ్చినట్టు చెప్పుకుంటున్నారని చైతన్య కాలేజీల చైర్మన్ బీవీ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎంసెట్లో తమకు టాప్ ర్యాంకు వస్తే నారాయణకు వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ, శ్రీ చైతన్య కలిసి స్టార్ట్ చేసిన శార్వాణి గ్రూప్ పనిచేయడం లేదని, ప్రస్తుతం ఈ రెండు వేర్వేరని స్పష్టం చేశారు. ఇక నుంచి చైనా( చైతన్య-నారాయణ) బ్యాచ్లు ఉండవన్నారు. శ్రీ చైతన్య స్కూల్లో చదువుకున్న విద్యార్థులను నారాయణ.. తమ విద్యార్థులుగా చెప్పుకుంటుందని మండిపడ్డారు. జేఈఈలోని టాప్ 5 ర్యాంకులు తమ విద్యార్థులవేనని, కానీ నారాయణ ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రకటనలు చేస్తోందన్నారు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్, జేఈఈ, ఎంసెట్ ఫలితాల్లో ఇరు కాలేజీలు ఒకే ర్యాంకులు వచ్చాయని ప్రకటనలివ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. Quote
TampaChinnodu Posted May 4, 2018 Author Report Posted May 4, 2018 Quote ఇక నుంచి చైనా( చైతన్య-నారాయణ) బ్యాచ్లు ఉండవన్నారు. Quote
TampaChinnodu Posted May 4, 2018 Author Report Posted May 4, 2018 నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ప్రకటన ‘శ్రీశార్వాణి’ ఒప్పందం పూర్తయ్యే వరకు ర్యాంకులు ప్రకటించుకునే హక్కుంది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి శ్రీచైతన్య విద్యాసంస్థలు నిరాధార ఆరోపణలు చేస్తున్నట్టు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నారాయణ మేథోసంపత్తి నుంచే చైనా ప్రోగ్రామ్ ఉద్భవించిందన్న సంగతి అందరికీ తెలుసునని పేర్కొంది. ‘‘2005, 2006, 2007 ప్రారంభంలో నారాయణ విద్యాసంస్థలు ఇదే ప్రోగ్రాంను నారాయణ సి.ఒ. స్పార్క్ పేరుతో ప్రారంభించింది నిజం కాదా? 2007లో ఇదే ప్రోగ్రాం నుంచి ఏఐఈఈఈ (నేటి జేఈఈ మెయిన్)లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, 2008 లో 2, 4, 10.. 2009లో 3, 4, 6, 7.. వంటి ర్యాంకులను సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఐఐటీలో 2008లో టాప్ 10లో 3, 4, 7, 8 ర్యాంకులు ఆ తర్వాత సంవత్సరాల్లో నూ అనేక ఉత్తమ ర్యాంకులన్నీ చైనా ప్రోగ్రామ్ తో సంబంధం లేకుండా నారాయణ విద్యాసంస్థలే సాధించాయి’’అని ప్రకటనలో పేర్కొన్నా రు. శ్రీశార్వాణి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభించేటప్పుడు, తెలుగు విద్యార్థులకు టాప్ ర్యాంకులు రావాలన్న నెపంతో తమను ఒప్పించి చైనా ప్రోగ్రామ్ను ప్రారంభించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించింది. చైనా ప్రోగ్రామ్ కంటే ముందు ఐఐటీ ప్రో గ్రామ్ ద్వారా సాధించిన అత్యుత్తమ ర్యాం కులు ఏంటో శ్రీచైతన్య చెప్పగలదా అని ప్రశ్నించింది. 2012 వరకు నారాయణ విద్యార్థుల టాప్–10 ఐఐటీ ర్యాంకులెన్ని, శ్రీచైతన్య ర్యాంకులెన్ని అన్న విషయాన్ని ప్రజలకు చెప్ప గలరా అని పేర్కొంది. 2012 తర్వాత తాము రూపొందించిన ఐఐటీ ప్రోగ్రామ్ను కాపీ కొట్టి శ్రీచైతన్య లబ్ధి పొందిందని ఆరోపించింది. ‘టాప్ ర్యాంకుల సాధన కోసం శ్రీచైతన్యకు ప్రణాళిక లేదన్నది నిజం. మేం రూపొందించి న విద్యాప్రణాళిక సాయంతో సాధించుకుంటు న్న ర్యాంకులను మా విద్యార్థులు, మా ప్రో గ్రా మ్ అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం?’’అని ప్రశ్నించారు. శ్రీశార్వాణి సొసైటీ ఒప్పందం ప్రకారం అందులో సమాన భాగస్తులం కాబట్టి, అది పూర్తయ్యే వరకు ఇరు యాజమాన్యాలకు టాప్ ర్యాంకులను ప్రకటించుకునేహక్కు ఉంటుందని స్పష్టం చేసింది. Quote
TampaChinnodu Posted May 4, 2018 Author Report Posted May 4, 2018 Why are they both fighting. Credit should only go to CBN . Not to Narayana or Sree Chaitanya. Quote
mettastar Posted May 4, 2018 Report Posted May 4, 2018 6 minutes ago, TampaChinnodu said: Why are they both fighting. Credit should only go to CBN . Not to Narayana or Sree Chaitanya. they do not know about you Quote
Kontekurradu Posted May 4, 2018 Report Posted May 4, 2018 2 hours ago, TampaChinnodu said: Why are they both fighting. Credit should only go to CBN . Not to Narayana or Sree Chaitanya. ante ante,mana eadupu manam kaniidam Quote
TamrajKilvish Posted May 4, 2018 Report Posted May 4, 2018 Rendu luv da college lu..okka mukka eng artham kani ee langa college owner Govt lo Edu min..nee yenkamma 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.