Jump to content

Recommended Posts

Posted
అత్యాచారాల నివారణకు ప్రత్యేక కమిటీ 
 పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం 
 నిందితుల చిత్రాలను ప్రదర్శిస్తాం 
 ప్రత్యేకకోర్టులతో సత్వర న్యాయం 
 రక్షణగా ఉంటామని ప్రతిజ్ఞ.. ప్రదర్శనలు 
 ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ సభలో సీఎం చంద్రబాబు 
ఈనాడు - అమరావతి 
7ap-main1a.jpg

అత్యాచార ఘటనల నివారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ‘పోలీసు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ, మెప్మా, తదితర పది శాఖలతో త్వరలో ఈ కమిటీ వేస్తాం. ప్రస్తుత చట్టాలు, వాటిలోని లోపాలను కూడా ఇది సమీక్షిస్తుంది. అలాగే ప్రత్యేక కోర్టుల్లో కేసుల విచారణ 2 నెలల్లోనే పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తాం. దీని వల్ల దుర్మార్గుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాం...’’ అని పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమ సభలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తొలుత నగరంలో ర్యాలీని ప్రారంభించి మున్సిపల్‌ స్టేడియానికి పాదయాత్రగా వచ్చారు. ‘ఇటువంటి ఘటనలు మున్ముందు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం. ప్రత్యేక సెల్‌ను నెలకొల్పుతాం. దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తాం. అత్యాచారాలు చేసే వారి జాబితాను బహిరంగ  పరుస్తాం. రౌడీషీటర్ల మాదిరిగా వారి చిత్రాలను కూడా ప్రదర్శిస్తాం. సమాజం వారిని చీదరించుకునే పరిస్థితి వస్తుంది. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో కూడా ఉంచుతాం. కేసులను వేగంగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కేడర్‌లో పోలీసులను నియమిస్తాం. బాధితులకు ఉచితవిద్య, తోడ్పాటు అందిస్తాం. చంద్రన్న పెళ్లికానుక అందజేస్తాం. సాక్ష్యాలను శాస్త్రీయంగా సేకరించడంలో కీలకంగా ఉపయోగపడేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను తీసుకొస్తాం. న్యాయవ్యవస్థ చొరవ చూపి విచారణ సత్వరం సాగేలా చూడాలి...’’ అని సీఎం పేర్కొన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, 17 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతో నిందితుడు ఉరి వేసుకుని మరణించాడని వివరించారు. బాలికలు, మహిళలపై అత్యాచారాలు చేసే వారికి భూమిపై అదే చివరి రోజు కావాలని, ఆడబిడ్డల జోలికి వెళ్తే ఉరి శిక్ష వేస్తారనే భయం మగవారిలో రావాలని పేర్కొన్నారు.  ‘‘నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాష్‌ సత్యార్థి అమరావతిలో మహిళల రక్షణకు ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఇటువంటి వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల సాయం కూడా తీసుకుంటాం. ఈ అంశాలు పాఠ్యాంశాల్లో భాగంగా రావాలి. ఉపాధ్యాయులు చొరవ తీసుకుని విద్యార్థులలో నైతిక బాధ్యత పెంపొందించాలి. గతంలో ర్యాగింగ్‌ను అణచివేశాం. వీటిని కూడా తుదముట్టిస్తాం. విజయవాడ పోలీసులు ప్రారంభించిన ‘మహిళా మిత్ర’ కార్యక్రమాన్ని అభినందిస్తున్నా.  అంతర్జాలంలో నీలిచిత్రాల వంటి వెబ్‌సైట్లపై నిషేధం విధించాల్సిన అవసరం ఉంది. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తా. అత్యాచార కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఎక్కడైనా చట్టాల్లో లోపాలు కనిపిస్తే నా దృష్టికి తీసుకురండి. దాచేపల్లిలో బాధిత బాలికకు రూ.10 లక్షలు, కుటుంబానికి ఇల్లు మంజూరు చేశా...’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళల రక్షణకు ఉపయోగపడే చట్టాలను తెలిపే గోడపత్రికను సభలో ఆవిష్కరించారు. మహిళల రక్షణకు తోడ్పడతామని ఆయన ప్రతిజ్ఞ చేయించారు.

7ap-main1b.jpg

వారి గుండెల్లో బుల్లెట్‌ దిగాలి.. ‘మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా, ఒక మహిళగా పోలీసులకు చెబుతున్నా.... మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి గుండెల్లో బుల్లెట్‌ దిగాలి. ఆమ్మాయిలపై చేయి వేసే వారి చేతులు విరగ్గొట్టాలి. వావి వరుసలు లేకుండా అకృత్యాలకు పాల్పడే వారి తల నరకాలి.. ఉరిశిక్షలు ఉండాలి...’ అని నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. తాను బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనట్లు ముఖ్యమంత్రి భావించి ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్‌ మాట్లాడుతూ ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యాచార ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇది మహిళలది కాదని... పురుషుల సమస్యని చెప్పారు. మహిళలను ఎలా చూడాలి.... ఎలా గౌరవించాలి అనే దాని కోసం రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కోరారు. మైనార్టీలపై అత్యాచారాలకు పాల్పడే వారిపై 30 దేశాల్లో ప్రత్యేక రికార్డులు నిర్వహిస్తున్నారని, ఇలాంటి విధానాన్ని ఏపీలో తీసుకువచ్చేందుకు సీఎం చొరవ చూపాలన్నారు.  క్రీడాకారిణి కోనేరు హంపి మాట్లాడుతూ  ప్రస్తుతం సాంకేతికతను పిల్లలు చెడుకు వినియోగిస్తున్నారని, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అంతరం పెరగడం కారణంగా వారిపై అవగాహన తగ్గిపోతోందన్నారు. ఇదే సమస్యకు కారణమవుతోందని వివరించారు. డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిలో 90 శాతం మంది తెలిసిన వారే ఉంటున్నారని చెప్పారు. దీనిపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనల్లో సాక్ష్యాలను శాస్త్రీయంగా సేకరించి నిందితులను వేగంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు.

7ap-main1c.jpg

చంద్రబాబుకు కైలాష్‌ సత్యార్థి అభినందనలు 
ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమం చేపట్టడంపై బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.

7ap-main1d.jpg

రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు 
మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిర్వహించారు. ప్రధాన కూడళ్ల నుంచి ప్రారంభమైన ర్యాలీల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, జేసీ, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆడబిడ్డలపై అత్యాచారాలను ఖండిస్తూ, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన సభల్లో ఆడ బిడ్డకు రక్షణగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వరకు (2.5కి.మీ దూరం) నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పలువురు మహిళలు సీఎం వెంట కలిసి నడిచారు. కొందరు విదేశీ ప్రతినిధులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సచివాలయం నుంచి ఉద్యోగులు వాహనాల్లో వచ్చి హాజరయ్యారు. గుంటూరులో శాసనసభ సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించగా...శ్రీకాకుళంలో మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు... ఒంగోలులో మంత్రి సిద్దా రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ర్యాలీలు, సభలు నిర్వహించలేదు.

Posted
Quote

అంతర్జాలంలో నీలిచిత్రాల వంటి వెబ్‌సైట్లపై నిషేధం విధించాల్సిన అవసరం ఉంది. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తా

CITI_c$y

Posted

ante ipudu yotube lo balayya movies ban chestharaaa.... 

kadupulu cheyyali.. muddhulu pettali annadugaaa ...

Posted

dheenni kuda edho political mileage kosam vadukovalani chuse leader ki peddha _/\_

illu sardhukonodocchi dheshanni euthanannadata

Image result for lokesh with girls

 

ee photo mee TDP ppts lo petti ban chey porn movies ni 

Posted

roju roju ki chaadastham ekkuva ayipothundi man CBN ki.  notiki vachindi vaaguthunnadu.

call money case ayyi almost 3 years ayyindi. inka resolve avvale. malli 2 months lo resolve sestham ani self dabba. 

Posted
Quote

అత్యాచారాలు చేసే వారి జాబితాను బహిరంగ  పరుస్తాం

start with all call money case accused names. 

Posted
3 minutes ago, TampaChinnodu said:

start with all call money case accused names. 

Start with balayya n lokesh first 

Posted
5 hours ago, TampaChinnodu said:

roju roju ki chaadastham ekkuva ayipothundi man CBN ki.  notiki vachindi vaaguthunnadu.

call money case ayyi almost 3 years ayyindi. inka resolve avvale. malli 2 months lo resolve sestham ani self dabba. 

anta mana dora lekka great leaders kaleruga 

okilikeKCR 

Posted
6 hours ago, TampaChinnodu said:

Didn't Center already tried it once before ? 

Chesi chetulu ettesaau.... ISPs told its difficult for us to control.

Posted
5 minutes ago, Kool_SRG said:

Chesi chetulu ettesaau.... ISPs told its difficult for us to control.

I think Vajpayee time lo anukunta 

Lav da, Thetares lo bootu bommal eyya kuadadu 
Star movies lo scenes veyyakudadu ani rule pass sesaru 

Posted
32 minutes ago, Kontekurradu said:

I think Vajpayee time lo anukunta 

Lav da, Thetares lo bootu bommal eyya kuadadu 
Star movies lo scenes veyyakudadu ani rule pass sesaru 

ch.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...