Jump to content

OLD sad Songs with meaningful lyrics


Recommended Posts

Posted

 

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను పెద్దబాడిస మొద్దు బారినది సాలెల మగ్గం సడుగులిరిగినవి. చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా , అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయే ఈ దేశం లోనా

మడుగులన్ని అడుగంటి పోయినవి బావులు సావుకు దగ్గరయ్యినవి వాగులు వంకలు ఎండిపోయినవి చాకలి పొయ్యిలు కూలిపోయినవి

పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా

ఈదులన్నివట్టిమొద్దులయ్యినవి ఈతకల్లు బంగారమయ్యినది మందుకలిపిన కల్లును దాగిన మంది కండ్లనెండూసులయ్యినవి చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పరకచేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు ఆ బేకరి కేఫులో ఆకలితీరిందా ఆ పట్టణాలలో

అరకల పనికి ఆకలిదీరక గడమనగలకుగాసమెల్లక ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ ఆసామూలంతా కూసూనేటీ వడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేసి దు: ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

మేరోళ్ళ చేతులకత్తెర మూలపోయి సిలువెక్కిపోయినది చుట్టుడురెక్కల బనీన్లు బోయినవి కోడెలాగులు జాడకేలేదు రెదీమేడు ఫ్యాషన్ దుస్తులొచ్చెనంటా నా పల్లె పొలిమేరకు ఆ కుట్టు మిషన్ల చప్పుడాగినాదా నా పల్లెల్లోనా

నానా కెంపుతెల్లలు జెల్లలు పరులకు తెలియని మరుగు భాషతోబేరం జేసే కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల, అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెలనుంచీ.

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంపె పదునారిపోయినది పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

కుంకుమ దాసరి బుక్కమీదగూడ కంపెనీ రక్కసి కన్నుబడ్డది పూసలోల్ల తాలాము కప్పలు, కాశీల కలసి ఖతమౌతున్నవి బొట్టు బిళ్ళలూ నొసటికొచ్చెగదరా నా పల్లెలజూడా మన గుడ్డి దాసరీ బతుకులాగమాయే ఈపల్లెల్లోనా

ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని నా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోనా.

తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టిపరిమళాలేమైపాయెరా వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంట పొలాల ఆ మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికెపై

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.

యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిడిచీ దేవా హరిహరా ఓ ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై

పిండోలెన్నల రాలుచుండగ రచ్చబండపై కూసొని ఊరే ఎనకటి సుద్దులు ఎదలూ కదలూ యాదిజేసుకొని బాధలె మరిచిరి బుక్కనోటిలో బడ్డదంటే నేడు మన పల్లెల్లోనా అయ్యో ఒక్కడు రాతిరి బయటకెళ్ళడమ్మో ఇది ఏమి చిత్రమో

బతుకమ్మాకోలాటపాటలు భజన కీర్తనలమద్దెల మోతలు బైరాగుల కిన్నెర తత్వమ్ములు కనుమరుగాయెర నాపల్లెల్లో అరె స్టార్ టీవీ సకిలిస్తాఉన్నదమ్మో నా పల్లెల్లోనా సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకనె పోయె కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు. అరె బహుళ జాతి కంపని మాయల్లోనా మా అన్నల్లారా భారత పల్లెలు నలిగి పోయి కుమిలె ఓ అయ్యల్లారా.

Posted

వేణువై వచ్చాను వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం ఏడు కొండలకైన బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలో నలక లో వెలుగు నే కనక మేను నేననుకుంటె ఎద చీకటే హరీ! రాయినై ఉన్నాను ఈనాటికీ రామ పాదము రాక ఏనాటికి నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ! రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...