ranjith_samajaism Posted May 17, 2018 Report Posted May 17, 2018 9 minutes ago, pahelwan said: Siggundali human + nature ani cheppadaniki. He is iron leg cm entha mandi panal 10gutadu ee lathkor na koduku daridrap fellow Ayna sare uncle will seek cbn chulli Quote
TampaChinnodu Posted May 17, 2018 Report Posted May 17, 2018 1 hour ago, psycopk said: ika state lo jarigina accidents anitiki cbn ee karnam ante etla... human+nature error... dont politicize.. Do you call this nature error ? మార్గదర్శకాలను ముంచేశారు! వరస పడవ ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు శూన్యం యాజమాన్యాలు ఏ నిబంధనలు పట్టించుకోవు అధికారులు అమలు చేయరు అమాయకుల ప్రాణాలు బలిచేస్తున్న నిర్లక్ష్యం వాడపల్లి నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి రాష్ట్రంలో వరుసపెట్టి పడవ ప్రమాదాలు జరుగుతున్నా వాటిని నియంత్రించే పటిష్ఠ యంత్రాంగం కరవైపోయింది. జలవనరులశాఖ మార్గదర్శకాలు విడుదల చేసినా వాటిని పట్టించుకోకుండా లాంచీలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పవిత్ర సంగమం వద్ద గత ఏడాది నవంబరు నెలలో లాంచీ బోల్తా పడి ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. ఆ తర్వాత నాలుగైదు రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా పోశమ్మగుడి సమీపంలో పాపికొండలకు 120 మంది పర్యాటకులను తీసుకువెళ్తున్న లాంచీ అగ్నిప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ అందులోని వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ లాంచీలో నిబంధనలు పాటించని విషయం తేటతెల్లమయినా దాని యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ఘటన జరిగిన వారంరోజుల వ్యవధిలోనే అదే జిల్లాలో, అదే ప్రాంతంలో మరో లాంచీ బోల్తా పడింది. పెద్ద సంఖ్యలో గిరిజనులను జలసమాధి చేసింది. మార్గదర్శకాలు అమలు చేయకుండా అధికార యంత్రాంగం చూపిన నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి పరోక్ష కారణమని విమర్శలు వస్తున్నాయి. అనుమతులు లేవు... పవిత్ర సంగమం ప్రమాదం తర్వాత త్రిసభ్య కమిటీని నియమించారు. పడవ ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ సూచనలు ఇవ్వాలని ఆ కమిటీని కోరారు. విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, జలవనరులశాఖ అధికారితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఇచ్చే లోపు జలవనరులశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. అసలు ఆ ఆదేశాలు పక్కాగా అమలు చేస్తే ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండదు. వారం రోజుల వ్యవధిలో ప్రమాదానికి గురైన రెండు లాంచీలకూ అనుమతులు లేవని తెలుస్తోంది. మరి ఏ అనుమతి పత్రాలు లేకుండా ఈ లాంచీలు ఎలా తిరుగుతున్నాయి? అధికారులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో లోపాలు... మంగళవారం బోల్తా పడ్డ లాంచీ వ్యవహారంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ఈ లాంచీలో సిమెంట బస్తాలు, రేషన్ సరకులు, ఇతరత్రా అనేకం నింపడం వల్ల బరువు పెరిగిందని చెబుతున్నారు. ఈ లాంచీలో లైఫ్ జాకెట్లు లేవు. ఈతగాళ్లు లేరు. ఇలా అనేక నిబంధనలు విస్మరించారు. పైగా పోలీసులకు లొంగిపోయిన సరంగి ఆ లాంచీలో ఎంత మంది ఉన్నారో కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోయారు. వివరాలు లాంచీ యాజమాన్యం వద్ద లేవు. ఈ వివరాలు తెలుసుకునేందుకు అధికార యంత్రాంగం నానా అగచాట్లు పడింది. లాంచీ నిర్వాహకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో దీన్ని బట్టి అర్థమవుతోంది. చివరకు గ్రామాల్లో వీఆర్వోల సాయంతో అధికారులు సమాచారం సేకరించాల్సి వచ్చింది. దాదాపు 70 అడుగుల లోతున లాంచీ మునిగిపోయింది. లాంచీలోని ఉన్న సిమెంట్ బస్తాల బరువే దీనికి కారణమని అంటున్నారు. ఏదీ అమలు కావడం లేదు... పవిత్ర సంగమం ప్రమాదం తర్వాత జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మార్గదర్శకాలు విడుదల చేసినా వాటికి అతీగతీ లేకుండా పోయింది. అవి... * ప్రతి పడవ మీద రక్షిత పడవగా ధ్రువీకరణ పత్రం అతికించాల్సి ఉంటుంది. అది ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తారు. అమల్లో కనిపించడం లేదు. * ప్రతి మూడు నెలలకోసారి బాధ్యులు బోట్లను తనిఖీ చేసి సంబంధిత పుస్తకంలో నమోదు చేయాలి. ఆరు నెలల కిందట లైసెన్సులు సమీక్షించి జారీ చేశారు. మూడు నెలల తనిఖీలు ఏం జరగలేదు. కొత్త చట్టంపై అవగాహన లేదని తప్పించుకుంటున్నారు. * ప్రధాన జెట్టీ పాయింట్లను జలవనరులశాఖ గుర్తించాలి. అయితే ఇంతవరకు జరగలేదు. * ప్రధాన జెట్టీ పాయింట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాల్లో జలవనరులు, పోలీసు, పర్యాటకశాఖ అధికారులు ఉండేలా ఏర్పాట్లు చేయాలి. అలాంటి ఏర్పాట్లు లేవు. * అన్ని పడవలతో వైర్‌లైస్ వ్యవస్థతో ఈ కంట్రోల్ రూం అనుసంధానం చేసుకోవాలి. ఆయా పడవల్లో జీపీఎస్, వైర్‌లెస్ సెట్లు ఏర్పాటు చేసుకోవడం ఆయా పడవల యజమానులదే బాధ్యత. నిజానికి ఏ ఒక్క పడవలోనూ వైర్‌లెస్ సెట్లు, జీపీఎస్ వ్యవస్థలు లేవు. * ప్రతి పడవను కంట్రోల్ రూం అధికారులు తనిఖీ చేసి, బయలుదేరేందుకు అనుమతి ఇవ్వాలి. ఈ విషయంలో కంట్రోల్ రూంలో ఉన్న అధికారులకే బాధ్యత. అసలు కంట్రోల్ రూమే లేదు. ఈ నిబంధన అమలు చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదే కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. Quote
ARYA Posted May 17, 2018 Report Posted May 17, 2018 53 minutes ago, pahelwan said: Siggundali human + nature ani cheppadaniki. He is iron leg cm entha mandi panal 10gutadu ee lathkor na koduku daridrap fellow Quote
TampaChinnodu Posted May 17, 2018 Report Posted May 17, 2018 ఎక్కడ ఏం జరిగినా తన డ్యాష్ బోర్డులో అన్నీ తెలిసిపోతాయ్.. టెక్నాలజీతో తుఫాన్లను ఆపేశాం.. వర్షాలు లేకుండా పంటలు పండిస్తాం.. ఇవీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు. ఎక్కడా తన హైటెక్ రేంజ్ తగ్గకుండా, అంతర్జాతీయ స్థాయి అనే ముచ్చట లేకుండా బాబు సమీక్షలు ఉండవు. కలెక్టర్లతో సమావేశం అయినా, మరో రకంగా పాలనా పరమైన సమీక్ష సమావేశాలు నిర్వహించినా చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు హద్దూఅదుపూ ఉండదు. తన పాలన అద్భుతం అని.. ప్రపంచమంతా కుళ్లుకుని చస్తోందన్నట్టుగా.. దేన్నైనా చిటికెలో చేసేస్తాను అన్నట్టుగా.. చిటికెల పందిళ్లు వేస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నాడు. అయితే ఈ హైటెక్ పాలనలో ప్రమాదాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. విషాదాలు జరుగుతూ ఉన్నాయి. గోదావరి పుష్కరాల దుర్ఘటన దగ్గర నుంచి ప్రతి రెండు మూడు నెలలకూ ఏపీలో అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది బాధితులు అవుతున్నారు. కృష్ణా నదిలో బోటు ప్రమాదం చోటు చేసుకుంది కొన్ని నెలల కిందట. అప్పుడు బాధితులకు నష్టపరిహరం ప్రకటించారు. సమీక్షలు నిర్వహించారు. అక్రమ పద్ధతిలో నడుస్తున్న బోట్ల పర్మిట్ల గురించి హడావుడి చేశారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. అప్పుడే ఎంత దారుణంగా వ్యవహరించారంటే.. పర్యాటక శాఖకు సంబంధించిన బోటు ప్రమాదానికి గురి అయితే ఆ శాఖ మంత్రి దానికి బాధ్యత వహించలేదు. ఆఖరికి బాధితులను పరామర్శించేందుకు కూడా ఆమెకు తీరిక దొరకలేదు. ఇప్పుడు గోదావరి నదిలో ప్రమాదం.. మళ్లీ అదే వ్యథ. నది మారింది, బోటు మారింది, బాధితులు మారారు. ముఖ్యమంత్రి మళ్లీ సమీక్ష నిర్వహించాడు. ఏ ఉత్తరాఖండ్లోనో మరెక్కడో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే.. ఆ రాష్ట్రాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి, అందుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మనకు మనం సమాధానాలు చెప్పుకుంటాం. ఏపీలో కూడా ఇలాంటి వరస ప్రమాదాలే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏపీ ఎక్కడ ఉందో.. చంద్రబాబు లాంటి హైటెక్ పాలకుడి పాలనతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.