Jump to content

Andhra pradesh Govt welfare schemes for Brahmins


Recommended Posts

Posted
Posted

త్వరలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బ్రాహ్మణ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఎండీ చంగవల్లి వెంకట్‌ వెల్లడించారు. అద్దె ఇళ్లల్లో ఉండే పేద బ్రాహ్మణుల కోసం ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. పాతగుంటూరులో కార్పొరేషన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ సిరిపురపు శ్రీధర్‌ ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా 11,085 మంది విద్యార్థులకు ఉపకారవేతనాల ద్వారా రూ. 34.5 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈ ఏడాది కొత్తగా గాయత్రి విద్యా అవార్డు పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. భారతి పథకం ద్వారా గతంలో లబ్ధిపొందిన విద్యార్థులు సరైన ఆధారాలతో వెబ్‌సైట్‌లో రెన్యువల్‌ చేసుకోవాలన్నారు. గరుడా అంతిమ సంస్కార పథకంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే నెలమాసికాలు చేసుకోవడానికి రూ.10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా బ్రాహ్మణుల సంక్షేమానికి ఏపీలో కార్పొరేషన్‌ ఏర్పాటుచేశామని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ఆయన గుంటూరులో శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Posted

Memu em thappudu chesamo, maaku intha anyayam. Ippatike Desham vadhilesi vachesam. 

Posted

6,500 మంది బ్రాహ్మణులకు వెయ్యి పెన్షన్‌ 
 

636052667607521304.jpg
  • ‘కశ్యప’ పథకాన్ని ప్రారంభించిన సీఎం 
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బ్రాహ్మణుల్లో అనాథలు, వృద్ధులు, వితంతువులకు ఆర్థిక చేయూతనందించేందుకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ప్రవేశపెట్టిన ‘కశ్యప ఆహార-ఆవాస’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. సాధారణ ప్రభుత్వ పెన్షన్‌ అందని 6,500 మంది బ్రాహ్మణులకు నెలకు వెయ్యి చొప్పున పెన్షన్లు ఇవ్వనుంది. పథకంలో తొలిసారిగా ఇవ్వనున్న పెన్షన్లను చెక్కు రూపంలో సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పాల్గొన్నారు.
Posted
2 hours ago, Navyandhra said:

6,500 మంది బ్రాహ్మణులకు వెయ్యి పెన్షన్‌ 
 

636052667607521304.jpg
  • ‘కశ్యప’ పథకాన్ని ప్రారంభించిన సీఎం 
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బ్రాహ్మణుల్లో అనాథలు, వృద్ధులు, వితంతువులకు ఆర్థిక చేయూతనందించేందుకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ప్రవేశపెట్టిన ‘కశ్యప ఆహార-ఆవాస’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. సాధారణ ప్రభుత్వ పెన్షన్‌ అందని 6,500 మంది బ్రాహ్మణులకు నెలకు వెయ్యి చొప్పున పెన్షన్లు ఇవ్వనుంది. పథకంలో తొలిసారిగా ఇవ్వనున్న పెన్షన్లను చెక్కు రూపంలో సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పాల్గొన్నారు.

1000/- tho em osthay ipuduna rates ki ;) edhaina jeevana upaadhi kalpinchali kani

Posted
2 hours ago, Navyandhra said:

6,500 మంది బ్రాహ్మణులకు వెయ్యి పెన్షన్‌ 
 

636052667607521304.jpg
  • ‘కశ్యప’ పథకాన్ని ప్రారంభించిన సీఎం 
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బ్రాహ్మణుల్లో అనాథలు, వృద్ధులు, వితంతువులకు ఆర్థిక చేయూతనందించేందుకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ప్రవేశపెట్టిన ‘కశ్యప ఆహార-ఆవాస’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. సాధారణ ప్రభుత్వ పెన్షన్‌ అందని 6,500 మంది బ్రాహ్మణులకు నెలకు వెయ్యి చొప్పున పెన్షన్లు ఇవ్వనుంది. పథకంలో తొలిసారిగా ఇవ్వనున్న పెన్షన్లను చెక్కు రూపంలో సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పాల్గొన్నారు.

Eppatidi idi IYR Krishna rao Brahmin welfare association chairman ga eppudo one year back pikesaaru ga, eppaditoh 2016 lo pic ippudu vesaava @3$%

Posted
21 minutes ago, Kool_SRG said:

Eppatidi idi IYR Krishna rao Brahmin welfare association chairman ga eppudo one year back pikesaaru ga, eppaditoh 2016 lo pic ippudu vesaava @3$%

Thirupathi issue side track seyyataaniki. 

Posted
22 minutes ago, Kool_SRG said:

Eppatidi idi IYR Krishna rao Brahmin welfare association chairman ga eppudo one year back pikesaaru ga, eppaditoh 2016 lo pic ippudu vesaava @3$%

 July article. Em year oo mari

Posted
3 hours ago, TampaChinnodu said:

Thirupathi issue side track seyyataaniki. 

Db lo kooda side track ante media baga lothu ga ...

Posted
7 hours ago, Kool_SRG said:

Eppatidi idi IYR Krishna rao Brahmin welfare association chairman ga eppudo one year back pikesaaru ga, eppaditoh 2016 lo pic ippudu vesaava @3$%

23 MAy 2016 ...akkada vundi kada

 

Posted
7 hours ago, TampaChinnodu said:

Thirupathi issue side track seyyataaniki. 

పూర్వం నుండి వరకు #తిరుమల ఆలయంలో అర్చకత్వ బాధ్యతలు నిర్వహించే అర్చక కుటుంబాలు 4ఉన్నాయు ఈ నాలుగు కుటుంబాల వారు తిరుమలకు నడకదారికూడా సరిగా లేని రోజులనుండి అర్చకత్వం చేస్తున్నారు. 
1900 దశకం నుండి ఆదాయం బాగా రావడం ప్రారంభమైనది. అప్పటి బ్రిటిష్ పాలకులు కూడా స్వామివారి పట్ల మంచి శ్రద్హనే చూపారు. క్రమంగా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ నిర్వహణ కు కొంతమంది అధికారుల అవసరం ఉందని గుర్తించి కలెక్టర్ స్థాయి అధికారిని బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. తరువాత వారే హథీరాం జి మఠానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఆలయానికి వచ్చేభక్తులకు సౌకర్యాలు చేయడం దర్శన వేళలు పర్యవేక్షణ వారిబాధ్యతలు. స్వాతంత్రం వచ్చాక మనప్రభుత్వాలు రావడం జరిగింది.

1950 లో తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనకు ప్రత్యేక పాలకమండలి అధికారులను ప్రభుత్వం నియమించడం వారు వచ్చే హుండీ ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతూ ఉండేది. కానీ ఎవరు స్వామివారి కైంకర్యాల విషయాలలో కలగజేసుకునేవారు కాదు. ఆబాధ్యతలు అర్చకులు జీయర్ స్వాములు ఆచార్యపురుషులు నిర్వహించేవారు. సందేహాలు వస్తే ఆస్థాన పండితులు ఉండేవారు . స్వామివారికి కైంకర్యానికి వచ్చే ద్రవ్యములు ప్రసాదములు అర్చకులకు వచ్చేవి ప్రత్యేక జీతభత్యాలు ఏమి లేవు కానీ ఆద్రవ్యములు ప్రసాదాల ఆదాయం తో అర్చకులు జీవనం చేసేవారు రాను రాను ఆలయంలో భక్తులు పెరగడం ద్రవ్య లాభం పెరుగుతుండటంతో అర్చకులకు మంచి ఆదాయం సమకూరేది.

ఇలా ఉండగా n t రామారావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుఫు అర్చక వ్యవస్ధ గురించి ఒక కమీషన్ వేశారు. ఆకమిషన్ ఇచ్చిన సిఫార్సు ఏమంటే అర్చకులు వంశపారంపర్య హక్కు ద్వారా వారి కుటుంబాలవారే అర్చకులు గా ఉంటున్నారు ఇది తప్పు ఆలయాలలో అర్చకులకు జీతభత్యాలు ఇచ్చి అక్కడ ద్రవ్య ఆదాయం తీసివేయాలి అని సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు పరగణన లోకి తీసుకున్న ప్రభుత్వం అర్చకులకు వంశపారంపర్య హక్కు తీసివేసి ద్రవ్య ఆదాయ స్థానంలో జీతాలు ఇస్తామన్నారు. ఇది తిరుమలకు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వర్తించింది. అప్పుడు అర్చకులు వారి వాదన ఇలా వినిపించారు. ఈ నిర్ణయమ్ వలన దేవాలయాన్ని నమ్ముకొని కొన్ని తరాలుగా మనది అదే వృత్తి అని చిన్ననాటి నుండి ఈ శాస్త్రాన్ని గుడిని నమ్ముకున్న వారికి తమ తదనంతరం ఈ అర్చకత్వం మన అబ్బాయికి రాదుఅంటే మరి ఆలయాలు ఎవరు చూస్తారు.

ప్రతిఒక్క ఆలయ సంప్రదాయాలు ఎలా కాపాడబడతాయి. పురాతన ఆలయాలలో ఉన్న అనేక కట్టుబాట్లు ఎవరు అర్థం చేసుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి. తిరుమల ఆలయానికి రాబడి వస్తుంది జీతాలు ఇస్తారు మిగిలిన ఆలయాలకు జీతాలు ఎలా ఇస్తారు ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తారు కానీ ప్రభుత్వ నిర్ణయం మారలేదు. దానితో తిరుమల అర్చకులు కోర్టు మెట్లు ఎక్కారు.

1987నుండి. 1996 వరకు 9 సంవత్సరాల కాలం కోర్టులో కేసు జరిగింది. ఈ 9సంవత్సరాలు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులుగా ఉన్నారు. హుండీ డబ్బు ఖర్చు తో దర్జాగాప్రభుత్వ లాయర్లు వాదించారు. ఈ 9 సంవత్సరాలు తిరుమల అర్చకులు ద్రవ్య ఆదాయాన్ని తీసుకుంటేనే ఉన్నారు. 1996 లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ వంశ పారంపర్య హక్కు అర్చకులకు లేదని కానీ ప్రస్తుతం ఉన్నవారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని వారికి ద్రవ్య ఆదాయం మినహా అన్ని గౌరవమర్యాదలు ఇవ్వాలని ఆగమ కైంకర్యాలు వారు చెప్పినట్లే నిర్వహించాలని సూచించారు. దానితో అర్చక కుటుంబాలకు నిరాశ ఎదురైంది. దానినే మిరాసివ్యవస్థ రద్దు గా చెప్తారు.

రోజురోజుకు కేసు ప్రభుత్వం వైపు మల్లుతుండడం ఎంతో.మంది లాయర్లు చక్కగా అర్చకుల దగ్గర డబ్బులు స్వాహా చేయడం జరిగిపోయాయి. ప్రయోజనం దక్కలేదు. దీని వల్ల తిరుమల అర్చకుల మాట ఎలా ఉన్నా మిగిలిన దేవాలయాల అర్చకుల పిల్లలు ఎవరూ ఆగమ శాస్త్ర అధ్యయనం చేయడం మానేశారు. మనకు ఆలయం లేనప్పుడు అన్నం దొరకాలంటే వేరొక వృత్తి చేయాలికదా అని ఇతర లౌకిక విద్యలకు వెళ్లిపోయారు. చాలా ఆలయాలు అర్చకులు లేక మూతపడ్డాయి. టీటీడీ వారు ఇంతటితో వదలక కేసుజరుగుతున్న రోజులలో ద్రవ్య ఆదాయాన్ని అర్చకులు తీసుకున్నారు గనుక తిరిగి కట్టాలని కోర్టులో కేసు వేసి గెలిచారు. దానితో అప్పటినుండి అర్చకులకు సంబంధించిన 4 ఇల్లు తనకా పెట్టుకొని వారికి ఇచ్చే జీతంలో ప్రతినెలా డబ్బు పట్టుకొని ఇస్తున్నారు. ఇప్పటికి 9మంది అర్చకుల జీతంలో ఈ డబ్బు కట్ అవుతుంది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అప్పుడు ఉన్న అర్చకులను తీసివేయకూడదు అలాగే వారు చెప్పినట్లే కైంకర్యాలు నిర్వహించాలి వారి గౌరవం వారికి ఉండాలి అని చెప్పినందున ఆతీర్పు వచ్చే నాటికి ఎంతమంది దేవాలయం లో పని చేస్తున్నారో వారిని టీటీడీ తమ ఉద్యోగుల లాగా భావిస్తూ జీతాలు ఇవ్వడం ప్రారంభించింది. శ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వంశపారంపర్య హక్కు కు సంబంధించి ఎండోమెంట్ లో ఒక జీవో తెచ్చారు దాని సారాంశం ఏమంటే పూర్వము నుండి దేవాలయాన్ని నమ్ముకున్న అర్చక కుటుంబాలలో సమర్థులైన అంటే ఆగమ శాస్త్రాన్ని చదువుకున్న వారసులు ఉంటే ఇప్పుడు వారు చేస్తున్న అర్చక ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇవ్వమని సిఫార్సు చేయవచ్చు అతను సక్రమంగా చదువుకొని ఉంటే ఆ ఉద్యోగం అతనికే ఇవ్వాలిఅన్నారు. దాని వల్ల తిరిగి అర్చక కుటుంబాలలో మళ్ళీ ఆగమ శాస్త్ర అధ్యయనం జరగడం కూడా కొంత పెరిగింది. శుభపరిణామం అని అందరూ సంతోషించారు.

2010 లో శ్రీ కృష్ణారావు గారు తిరుమల మరియు గోవిందరాజస్వామి అర్చకుల జీతాలను కొంతమందికి 33000 చేసి పుణ్యం కట్టుకున్నారు అప్పటిదాకా 8000 మాత్రమే ఉండేది. ఇప్పటికి టీటీడీ లో పనిచేసే350మంది అర్చకుల జీతం 17000 మాత్రమే. ఇది ఇలా ఉండగా 1999 లోనే అర్చకులు సుప్రీం కోర్టు3జడ్జి ల బెంచి కి కేసు పునపరిశీలనకు అడిగారు. 3 జడ్జీల బెంచ్ దానిని విచారణకు స్వీకరించింది. 2012 దాకా దాని విచారణ కొనసాగుతూనే ఉంది 2012లో సుబ్రమణ్యం గారు ఈఓ గా ఉండగా మీకు మంచి జీతాలు ఇస్తున్నాం గౌరవంగా చూస్తున్నాం మీ తరువాత యోగ్యులైన మీ కుమారులకు కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కదా మరి మీరెందుకు ఇంకా కేసు వాడిస్తారు వెనక్కి తీసుకోమని కోరారు. దానితో అర్చకులు కేసు వెనక్కి తీసుకున్నారు. కానీ జడ్జి గారు అడిగారు మీకు అన్ని మర్యాదలు జరుగుతున్నయా మీ కుమారులకు అర్చకత్వం ఇస్తున్నరా ఒకవేళ మీకు ఎక్కడ అన్యాయం జరిగినా నేరుగా 3బెంచి జడ్జీల దగ్గరకు రావచ్చని చెప్పి కేసు వెనక్కు ఇచ్చారు.సాధారణంగా ఒకకేసు లో ఎవరూ అలా అనరు కానీ ఇప్పటికీ అర్చకుల హక్కులైన ఆలయ కైంకర్యాల నిర్వహణ ఉత్సవాల నిర్వహణ వంశ పారంపర్య హక్కు ద్వారా గల మర్యాదలు అర్చకులకు ఉండాలని సుప్రీం కోర్టు చెప్పింది. వంశపారంపర్య హక్కు గురించికూడా మేము చదివాము అది తీసివేయడం వల్ల వచ్చిన పరిణామాలు కూడా బాగలేవని సుప్రీం కోర్టు అన్నారు. తరువాత కేసు ఆగిపోయింది కానీ చిలుకూరు సౌందరరాజన్ గారు వేరొక కేసువేసి దీని గురించి పోరాడుతూనే ఉన్నారు.

ఇంకొక కేసు అయిన చిదంబరం అర్చకుల కేసులో 2016లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఆగమశాస్త్రాలను అనుసరించే ఆలయాలలో అర్చక నియామకం ఉండాలి ఎవరిని కావాలంటే వారిని నియమించకూడదనిఅన్నది. మొత్తానికి తిరుమల అర్చకులకేసు సుప్రీం కోర్టు నుండి బయట పడ్డాక అధికారుల రాక్షస క్రీడ ప్రారంభమైనది. ఆలయంలోపలి అన్ని విషయాలలో అధికారుల హవా మొదలైనది. భక్తుల రద్దీ సాకుగా కైంకర్యాలు వేళలు మార్చడం స్వామివారికి ఏ ఆభరణాలు అలంకరించాలి. బ్రహ్మోత్సవాలు ఎవరు చేయాలి పవిత్రోత్సవాలు ఎవరుచేయాలి ఇటువంటి ఎన్నో ఆగమ పరమైన నిర్ణయాలను అవగాహనా రాహిత్యం తో తీసుకున్నారు. ప్రధాన అర్చకులు వ్యతిరేకించిన లెక్కలేదు.ప్రస్తుతం తిరుమలలో అర్చకుల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన పరిస్తితి ఉంది.మిరాశీ అర్చకులు మా కుమారులు ఉన్నారు కదా వారిని తీసుకోవాలని మిరాశీ అర్చకులు విజ్ఞప్తి చేశారు. టీటీడీ వారు ఒప్పుకోలేదు. జి.ఓ. ప్రకారం మీరు టీటీడీ ఎంప్లాయిస్ గా ఉంటే మీకు మేము స్కెలు జీతం ఇచ్చి అప్పుడు మీరు 65 ఏళ్ళు వచ్చాక విరమణ చేస్తే ఇస్తాము లేకపోతే లేదు అంటారు. మేము ఉద్యోగులం కాదు గౌరవస్తానంలో ఉండే అర్చకులము మాకు ఇచ్చే డబ్బు ని జీతం అనవద్దు సంభావన ఆనండి. మాకు ఉద్యోగం కాదు ఇది బాధ్యత మాకు మీ రూల్స్ ఎలా పెడతారు. అని అడిగి హై కోర్టులో వేశారు హై కోర్ట్ తీర్పు చెప్తూ మిరాశీ అర్చకుల కుమారులను వెంటనే విధులలోకి తీసుకోవాలిని సుప్రీంకోర్టు వారికి ఆ విధమైన సౌకర్యాలు ఇచ్చిందని కైంకర్యాలు ఉత్సవాలు వారు చెప్పినట్టే చేయాలని వారి గౌరవం కాపాడాలని మళ్ళీ తీర్పు ఇచ్చింది.

ఇలా ఉండగా అధికారగణం మెల్లగా అర్చక వర్గాలలో చీలిక తెచ్చింది.మీకు మీరు చేరినప్పటి నుండి స్కెలు జీతం ఇస్తాము మీరు 65 ఏళ్ళ వరకు ఉద్యోగం చేయొచ్చు తరువాత మీ పిల్లలు ఉంటే వారికి ఇస్తాము కదా మీకు ఒక 20లక్షలు అరియర్స్ వస్తాయి.రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది ఎందుకు మీకు హక్కులు వీటివల్ల మీకు ఏమి ఒరిగింది. దేవుడికి జరిగేది జరుగుతుంది ఎవరో ఒకరు చూస్తారు ఇలాంటి మాటలు చెప్పి అర్చకులలో ఒక వర్గాన్ని ఉద్యోగులుగా మార్చడానికి రంగం సిద్ధం చేసింది దీని వల్ల బాధ ఏమిటంటే ఎప్పుడైతే అర్చకుడు ఉద్యోగిగా మారతాడో తనకన్నా ఎక్కువ జీతం తీసుకునే ప్రతిఒక్కరికి అతను సబ్ ఆర్డినెట్ అవుతాడు సర్వీస్ రూల్స్ ప్రకారం తిరుపతి అర్చకులను బొంబాయికి ఢిల్లీకి కూడా ట్రాంఫర్ చేయొచ్చు వారు చెప్పినది వినక పోతే ఏమైనా చేయొచ్చు. కైంకర్యాలు వారు చెప్పినట్టు చేయాలి ఉత్సవాలు వాళ్లు చెప్పినట్టు చేయాలి మొత్తం అధికారుల చేతిలోకి వెళ్ళి పోతుంది. అప్పుడు ఈ రాజకీయ నాయకులు దొంగ ఆఫీసర్ చేతికి మొత్తం పోతే ఇప్పటికె కొన్ని దేవాలయాలు ఏరకంగ ఎండోమెంట్ వారు నాసనం చేస్తున్నారో చూస్తున్నాం కదా అదే గతి తిరుమలకు పట్టబోతింది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఆలయ కైంకర్యాల అర్చకుల విషయంలో అధికార జోక్యం ఎంతప్రమాదమో గుర్తించిన రమణదీక్షితులు గారు ఎదురు తిరిగారు. తరువాత ఎం జరుగుతుంది మీకు తెలుసు.
మన కలియుగ దేవుణ్ణి మనమే కాపాడుకునే సమయం ఇది. 

 

fb lo post

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...