Navyandhra Posted May 21, 2018 Report Posted May 21, 2018 రమణదీక్షితులపై విచారణ చేపట్టాలి శ్రీవారి ఆలయ అర్చకుల డిమాండ్ తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఓ అక్రమాల పుట్ట అని, ఆయనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆలయ ప్రధానఅర్చకులతో పాటు పలువురు సీనియరు అర్చకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తిరుమలలో ఆదివారం శ్రీవారి ఆలయ ప్రస్తుత ప్రధానఅర్చకులు వేణుగోపాలదీక్షితులు, కృష్ణ శేషాచలదీక్షితులు, గోవిందరాజదీక్షితులు, ఆగమ సలహాదారు సుందరవరదన్, సీనియర్ అర్చకులు ఖాద్రిపతిస్వామి విలేకరులతో మాట్లాడారు. ఆగమ సలహామండలి అనుమతులతోనే వకుళామాత పోటుకు మరమ్మతులు చేయించారన్నారు. ‘‘రమణదీక్షితులు ఏనాడైనా 12 నామాలు ధరించారా?ఆయన ఇద్దరు కుమారులు ఎన్నో ఏళ్లుగా కైంకర్యాలకు రాకపోవడంపై సమాధానం చెప్పాలి. శ్రీకృష్ణదేవరాయులు ఇచ్చిన ఆభరణాలను మిరాశీ వ్యవస్థ రద్దయిన సమయంలో సర్కారుకు అప్పగించలేదు. ఈ విషయం నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ ఆరోపణ సరికాదని ఆయనే నిరూపించుకోవాలి. వేదికను ఎంపిక చేసుకోవాలి...’అని వారు పేర్కొన్నారు. ‘తోటి కైంకర్యపరులను రమణదీక్షితులు అవమానించిన సమయంలో బ్రాహ్మణ, అర్చక సంఘాలు ఎక్కడికి వెళ్లాయి? రాష్ట్రంలోని ఆలయాలు వేరు. తితిదే వేరు. మా విషయాల్లో ఇతరుల జోక్యం తగదు. వేయికాళ్ల మండపం కూల్చివేతకు అనుమతిస్తూ సంతకం చేసిన వ్యక్తి.. నేడు తితిదేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.’ అని వివరించారు. ‘సౌందర్‌రాజన్ కుమారుడు అర్చకుడు కావచ్చు.. మేం రాకూడదా? దత్తతకు వచ్చిన రమణదీక్షితులు.. గొల్లపల్లి వంశీయులకు జన్మించానని చెప్పడం నిజం కాదా? 2001లో పోటు మరమ్మతులకు అనుమతించిన విషయం నిజం కాదా? నేడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?...’ అని పలు ప్రశ్నలు సంధించారు. రమణదీక్షితులు వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశామన్నారు. తమను ప్రధాన అర్చకులుగా నియమించడం, 32 మంది కైంకర్యపరులను క్రమబద్ధీకరించడంపై ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.