Jump to content

Recommended Posts

Posted
ఆప్మెల్‌ తెలంగాణదే 
మనతోపాటు కేంద్రానికీ హక్కులు ఏపీకి వాటాయే లేదు 
  దానికి అనుకూలంగా షీలాభిడే కమిటీ నివేదిక 
  భూములు, ఆస్తుల కోసమే ఏపీ ఎత్తుగడ 
  దీన్ని తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు 
  కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ సీఎస్‌ లేఖ 
21ts-main5a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సింగరేణి అనుబంధ సంస్థ ఏపీ హెవీ మిషనరీ, ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ (ఆప్మెల్‌)ను స్వాధీనం చేసుకోవాలనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఎత్తుగడను గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. విభజన చట్టాన్ని తప్పుగా అన్వయించి అత్యంత విలువైన ఆస్తులున్న ఆప్మెల్‌ను తమ వశం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి సింగరేణిలో ప్రధాన వాటా ఉన్నందున ఆప్మెల్‌పై ఈ రెండింటికే పూర్తిగా హక్కు ఉంటుందని చెప్పారు. తెలంగాణకు, కేంద్రానికి నష్టం కలిగిస్తూ, ఏపీ ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా షీలాభిడే కమిటీ నివేదిక ఇవ్వడాన్ని సీఎం తీవ్రంగా ఖండించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఆదేశించారు. ఆప్మెల్‌ సంస్థను ఏపీకి అప్పగిస్తూ షీలాభిడే కమిటీ ఇచ్చిన నివేదికపై సోమవారం సీఎం ఫోన్‌లో సీఎస్‌, సింగరేణి సీఎండీ తదితరులతో మాట్లాడారు. షీలాభిడే కమిటీ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, తొమ్మిదో షెడ్యూలు సంస్థల విభజనలో తెలంగాణకు అన్ని విధాల అన్యాయం చేసిందని, తాజాగా ఆప్మెల్‌ నివేదికతో ఇది రుజువైందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం సైతం విభజన చట్టానికి విరుద్ధంగా  వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏ రకంగా చూసిన ఆప్మెల్‌ తెలంగాణకే దక్కాలని, షీలాభిడే కమిటీ నిర్ణయాలను సమీక్షించాలని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని, వెంటనే దిల్లీకి వెళ్లి దీనిని వివరించాలని, రెండు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశం ప్రత్యేకంగా చర్చించాలని ఆయన సూచించారు.

సీఎస్‌ ఫిర్యాదు లేఖ : సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ జోషి సోమవారం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గాబాకు లేఖ రాశారు. షెడ్యూలు-9లో ఉన్న సంస్థల విషయంలో వివాదాలు, సందేహాలు ఉత్పన్నమయితే కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కరించాలని విభజన బిల్లులోని సెక్షన్‌ 71(ఎ)లో పేర్కొన్నారన్నారు. కేంద్రం దీని ప్రకారం జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ‘ఆప్మెల్‌ ఎండీ సిఫార్సులకు విరుద్ధంగా నిపుణుల కమిటీ సభ్యుడు లేవనెత్తిన అంశాలకు భిన్నంగా షీలాభిడే కమిటీ నివేదిక ఇచ్చింది. విభజన చట్టంపైనా అవగాహన లేకుండా వ్యవహరించింది. దీనిని ఆమోదించడం ద్వారా ఏపీ ప్రభుత్వం తప్పిదం చేసింది. సింగరేణికి ఆప్మెల్‌ అనుబంధ సంస్థ. ఆప్మెల్‌లో సింగరేణికి 81.54 శాతం, ఏపీఐడీసీకి 5.79 శాతం, ఉమ్మడి రాష్ట్రానికి 0.86 శాతం, పబ్లిక్‌ షేర్‌ హోల్డర్లకు 11.81 శాతం వాటాలున్నాయి. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ. దీనిలో 51 శాతం వాటా సింగరేణికి, 49 శాతం వాటా కేంద్రానికి ఉంది. ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు అదే రాష్ట్రానికి చెందాలని విభజన చట్టంలో నిర్దేశించిన విధంగా ఆప్మెల్‌ను తమకే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పట్టుబట్టింది. దీనిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. తమ సంస్థ సింగరేణికి చెందిందని, ఏపీ ప్రభుత్వ పరిధిలోకి తాము రాబోమని ఆప్మెల్‌ ఎండీ.. నిపుణుల కమిటీకి నివేదించారు. నిపుణుల కమిటీ సభ్యుడు ఏకే గోయల్‌ కూడా ఆప్మెల్‌ సింగరేణికే చెందుతుందని స్పష్టం చేశారు. ఈ అభ్యంతరాలను పట్టించుకోకుండా షీలాభిడే ఆప్మెల్‌ను ఏపీకి కేటాయించాలని ప్రతిపాదించారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆప్మెల్‌లో ఏపీకి 0.5 శాతం వాటా కూడా లేదు. అలాంటప్పుడు షీలాభిడే కమిటీ నివేదిక ఎలా ఇస్తుంది? ఏపీ ప్రభుత్వం కూడా సంస్థ తమదే అని వాదించడం అసమంజసం. ఏపీ వైఖరితో సింగరేణికి, అందులో వాటాలున్న తెలంగాణకు, కేంద్రానికి నష్టం కలుగుతుంది. ఆప్మెల్‌కు విజయవాడలోనూ, దానికి సమీపంలోని కొండపల్లిలో విలువైన ఆస్తులున్నాయి. వాటి కోసమే ఏపీ ఆప్మెల్‌ను హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. ఏపీ ప్రభుత్వ చర్యలకు అడ్డుకట్ట వేయాలి’ అని సీఎస్‌ లేఖలో కోరారు.

Posted
3 minutes ago, Demigod said:

endi inka halwa raale 1 hr avvostundi ga..post vesi?

@psycopk kooda raale inka @3$%

Posted
Just now, TampaChinnodu said:

@psycopk kooda raale inka @3$%

comparitively halwa antha active undadu...psycho DB lo

Posted

Ee kottukunudu endhi vayya... beefparty gallu pettina khayyama endhi ? 

XuaJyr_d.gif

Posted
1 hour ago, Demigod said:

comparitively halwa antha active undadu...psycho DB lo

psycopk vuncle chala manage cheyali kada broderu....nfdb.com, tdp NRI cell, Eenadu paper, PPT preparations, bhajana etc...

Posted
1 minute ago, Android_Halwa said:

psycopk vuncle chala manage cheyali kada broderu....nfdb.com, tdp NRI cell, Eenadu paper, PPT preparations, bhajana etc...

Lol @3$%

Posted
Just now, Android_Halwa said:

psycopk vuncle chala manage cheyali kada broderu....nfdb.com, tdp NRI cell, Eenadu paper, PPT preparations, bhajana etc...

nuvvu psycho kalsi mandu kodithe chudali ani ma andari korika...

Posted
2 minutes ago, Android_Halwa said:

psycopk vuncle chala manage cheyali kada broderu....nfdb.com, tdp NRI cell, Eenadu paper, PPT preparations, bhajana etc...

CITI_c$y

Posted
1 minute ago, Demigod said:

nuvvu psycho kalsi mandu kodithe chudali ani ma andari korika...

bl@st

Posted
6 minutes ago, Demigod said:

nuvvu psycho kalsi mandu kodithe chudali ani ma andari korika...

marchestha broderu....motham marchestha...neutral sesestha...

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...