Jump to content

Recommended Posts

Posted
2019లో భాజపాకు సినిమా చూపిస్తారు: లోకేశ్‌ 
22brk135-lokesh.jpg

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకున్నది కాదని ఏపీ ఐటీ, పురపాలక శాఖమంత్రి మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నమ్మకద్రోహం చేసిన భాజపాకు కర్ణాటకలో తెలుగు ప్రజలు సీఎం పిలుపు మేరకు ట్రైలర్‌ చూపించారనీ, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి సినిమా చూపించబోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో చేపట్టిన ‘నమ్మక ద్రోహం- కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం’ పేరుతో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతో మనల్ని గెంటేశారు. ముందుచూపుతో చంద్రబాబు కేంద్రంలో ఉన్న ఓ జాతీయ పార్టీతో పొత్తుపెట్టుకుంటే న్యాయం జరుగుతుందనే ఆలోచనతో భాజపాతో పొత్తు పెట్టుకున్నారు. వాస్తవానికి ఆ పార్టీకి మన రాష్ట్రంలో బలంలేదు. గట్టిగా పోటీ చేస్తే పది పంచాయతీల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. కార్పొరేటర్లుగా కూడా గెలవని వారిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా చేసిన ఘనత తెదేపాది. మిత్ర ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటే దొంగల పార్టీతో కలిసి మిత్ర ధర్మానికి వెన్నుపోటు పొడిచింది భాజపా నేతలే.

29 సార్లు దిల్లీకి తిప్పుకొన్నారు.. 
విభజన హామీల సాధన కోసం నాలుగేళ్లు ఒపికతో ఎదురుచూశాం. తొలి ఏడాది హోదా ఇస్తామన్నారు. రెండో ఏడాది ఇదిగో ఇస్తామన్నారు. మూడో యేట ఏ రాష్ట్రానికీ ఇవ్వట్లేదు. హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తామన్నారు. దీంట్లో భాగంగా తొలుత నిధులిస్తామన్నారు. తర్వాత బ్యాంకుల నుంచి నిధులు ఇస్తామన్నారు. సీఎంను 29సార్లు దిల్లీ చుట్టూ తిప్పుకొన్నారు. నాలుగో ఏడాది ఇతర రాష్ట్రాలకు ఇచ్చి మనకు నమ్మకద్రోహం చేశారు. 2014లో లోటుబడ్జెట్‌తో ప్రభుత్వం ఏర్పాటుచేశాం. అయినా ప్రజలకు లోటులేకుండా చంద్రబాబు పరిపాలన కొనసాగుతోంది.

ఆ ఘనత చంద్రబాబుదే.. 
రూ.24వేల కోట్ల మేర రైతు రుణాలను మాఫీచేసిన ఘనత చంద్రబాబుది. గత ప్రభుత్వాలు చాలీచాలని పింఛను ఇస్తే దాన్ని మరిన్ని రెట్లు పెంచి సుమారు అరకోటి మందికి పింఛన్లుస్తున్నాం. రేపోమాపో నిరుద్యోగ భృతి కూడా ప్రవేశపెడుతున్నాం. పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా గర్వంగా చెబుతున్నా. ఒక కి.మీ సీసీరోడ్డు వేయాలంటేనే గతంలో ఇబ్బంది ఉండేది. గడిచిన మూడేళ్లలో 16వేల కి.మీల మేర సీసీరోడ్లు వేసిన ఘనత సీఎంది. 68 ఏళ్ల వయస్సులో అహర్నిశలు సీఎం శ్రమిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించాల్సింది పోయి భాజపా నేతలు నమ్మక్రదోహం చేశారు.

కర్ణాటకలో తెలుగు ప్రజలు ట్రైలర్‌ చూపించారు 
వాజ్‌పేయీ, అడ్వాణీలాంటి మహానీయులు నడిపించిన పార్టీ భాజపా. ఈ రోజు కుళ్లు రాజకీయాలు చేస్తోంది. తమిళనాడులో ప్రజలు భాజపాను తరిమికొట్టారు. నిన్న కర్ణాటకలో భాజపాకు కాళ్లు విరగ్గొట్టారు. తిరుపతి వేదికగా సీఎం చంద్రబాబు భాజపాకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా పనిచేయాలని ఇచ్చిన పిలుపునందుకున్న కర్ణాటకలో తెలుగు ప్రజలు భాజపాకు ట్రైలర్‌ చూపించారు. 2019లో ఆంధ్ర ప్రజలు భాజపాకు అసలైన సినిమా చూపించబోతున్నారు. అనేక కేసుల్లో ముద్దాయి జగన్‌. అలాంటి వ్యక్తితో భాజపా నాయకులు కలిసి ముందుకెళ్తున్నారంటే మనం ఆలోచించాలి. అవినీతికి వ్యతిరేకంటోన్న మోదీ.. గతంలో స్కామాంధ్రగా మార్చొద్దని చెప్పిన మోదీ ఈ రోజు జగన్‌తో కలిసి ఎలా పనిచేస్తారని అడుగుతున్నా. కుట్ర రాజకీయాలతో తెలుగు ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. భాజపా, వైకాపా క్విడ్‌ప్రోకో రాజకీయాలకు పాల్పడుతున్నాయి.

చెడ్డపేరు తీసుకురాను.. 25 ఎంపీ సీట్లు మావే! 
నాపై ఓ పెద్దాయన ఆరోపణలు చేస్తున్నారు. నేను అవినీతిపరుడిని అని. ఎప్పుడు తప్పుచేశాను? ఎక్కడ, ఎలా చేశానో ఆధారాలతో ముందుకు రావాలని సవాల్‌ విసురుతున్నా. నా వయస్సు 30 ఏళ్లు. ఇంకా 40 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటా. మా తాత, నాన్నలా మంచి పేరు వస్తుందో, రాదో నాకు తెలీదు గానీ వారికి చెడ్డపేరు మాత్రం తీసుకురాను. భాజపా నేతలకు నా హెచ్చరిక. ఇందిరా గాంధీయే తెలుగుజాతి పౌరుషానికి తట్టుకోలేకపోయారు. మెజార్టీ ఉన్న ఎన్టీఆర్‌ను దించితే.. తెలుగు ప్రజలు గర్జించారు. ఆ గర్జన తట్టుకోలేక 31 రోజుల్లో మళ్లీ అన్నగారిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. 102 ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేస్తే డిపాజిట్లు కూడా ప్రజలు దక్కనీయలేదు. ఇప్పుడు భాజపా తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా కుట్ర రాజకీయాలు చేస్తున్నందున వారికీ అదే గతి పడుతుంది. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అప్పుడు రాష్ట్రంలో ఏర్పడబోయే తెదేపా ప్రభుత్వం సాధిస్తుంది’’ అని లోకేశ్‌ అన్నారు.

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    8

  • ARYA

    3

  • Anthanaistam

    3

  • MuPaGuNa

    2

Top Posters In This Topic

Posted
Quote

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకున్నది కాదని 

True excluding your U-Turn father. Who wrote in support of Telangana multiple times.

Posted
Quote

ఇందిరా గాంధీయే తెలుగుజాతి పౌరుషానికి తట్టుకోలేకపోయారు. మెజార్టీ ఉన్న ఎన్టీఆర్‌ను దించితే.. తెలుగు ప్రజలు గర్జించారు. 

Ade Telugu prajanu NTR ni second time dinchinappudu kooda garjinchaaraCITI_c$y

Posted

Trailer ke 40 to 104 seats ante full. Movie ki 275 seats nunchi 400 MP seats ki potaru Emo easy ga

Posted
2 minutes ago, TampaChinnodu said:

True excluding your U-Turn father. Who wrote in support of Telangana multiple times.

Can never forget than u - turn . Good times good timesCITI_c$y

Posted
Quote

ఒక కి.మీ సీసీరోడ్డు వేయాలంటేనే గతంలో ఇబ్బంది ఉండేది

avunu chinna babu, mee government ki mundu assalu AP lo roads ee levu. lol CITI_c$y

nee self goal thagileyya. gatham lo antey andulo 9 years mee dad government kooda vundi babu CITI_c$y

Posted

Oh my lord CITI_c$y

 

కర్ణాటకలో తెలుగు ప్రజలు సీఎం పిలుపు మేరకు ట్రైలర్‌ చూపించారనీ,

Posted
1 minute ago, ARYA said:

repost 

@langa batch antha digindhi endhi ee thread lo uncle +-

Posted

Image result for pulka drive gifs.... Andhra lo enti....... America lo Kooda chakram tipputam..... we rock......@3$%@3$%@3$%

Posted

మిత్ర ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటే దొంగల పార్టీతో కలిసి మిత్ర ధర్మానికి వెన్నుపోటు పొడిచింది భాజపా నేతలే.

Image result for chandrababu gifs

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...