Jump to content

H4 EAd thisesthe: Canada Velli pothamu ani Uncles blackmailing


Recommended Posts

Posted

‘నేను, నా భార్య ఏడాదికి 50 వేల డాలర్లు (రూ.33.50 లక్షలు) అమెరికా ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తాం. ఇప్పుడు ఈఏడీ విధానం కింద నా భార్య ఉద్యోగం చేయడానికి వీల్లేదంటూ ట్రంప్‌ సర్కార్‌ చట్టం తేబోతోంది. అదే జరిగితే నేను పక్కన ఉన్న కెనడాకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటా’’అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే టాప్‌ టెన్‌ విశ్వవిద్యాలయాలలో ఒకటైన బర్కిలీలోని యూనివర్సిటీ అఫ్‌ కాలిఫోర్నియాలో పీజీ పూర్తి చేసి క్యాంపస్‌ నియామకాలలో ఆపిల్‌ కంపెనీలో చేరిన అశ్విన్‌ రాచమల్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘‘ఇక్కడ పని చేస్తున్నందుకు లక్షల్లో పన్నులు చెల్లిస్తున్నాం. అయినా మేమేదో దొంగతనం చేస్తున్నామన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఈఏడీపై మరో కంపెనీలో నా భార్య ఉద్యోగం చేస్తుంది. ఐఐటీ గ్రాడ్యుయేట్‌ అయిన ఆమె ఇప్పుడు ఉద్యోగం చేయటానికి వీల్లేదని నిర్ణయం చేస్తే మరుక్షణం ఈ దేశాన్ని వదిలేస్తా. ఈఏడీ మాకు ఎంత ముఖ్యమో ఇక్కడి ఐటీ కంపెనీలకు అంతే ముఖ్యం’’అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సిలికాన్‌ వ్యాలీలో పని చేస్తున్న భారతీయ ఐటీ నిపుణుల్లో దాదాపు 5 నుంచి 6 శాతం మంది యూరప్‌ దేశాలకు తరలిపోయారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1.ప్రముఖ కంపెనీలు ముందు జాగ్రత్తగా తమ ఆఫీసులు కొన్నింటిని ఇక్కడ్నుంచి తరలించడం, 2. ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ) రద్దు ప్రతిపాదన. 

ఎక్కడ చూసినా ఉద్యోగ ఖాళీలే 
ఒక ఐటీ ఉద్యోగాలే కాదు అమెరికాలోని ఆపిల్, ఫేసుబుక్, పేపాల్‌ సహా అనేక కంపెనీల హెడ్‌ క్వార్టర్స్‌ కేంద్రమైన శాన్‌ జోస్‌ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. అయితే సరిపడ ఉద్యోగులు దొరకడం లేదు. ‘‘మేం గంటకు 15 డాలర్లు ఇస్తాం. ఒక్క కాలిఫోర్నియాలో మాకు 5 వేల మంది ఉద్యోగులు కావాలి. కానీ దొరకడం లేదు. ఈఏడీ ఉన్న కొందరితో పని చేయించుకుంటున్నాం. ఇప్పుడు దానిని రద్దు చేస్తే మాకు ఇబ్బందులు తప్పవు’’అని వాల్‌ మార్ట్‌ కాలిఫోర్నియా హెచ్‌ఆర్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ రిచర్డ్‌ సన్‌ చెప్పారు.

Posted
Quote

మేం గంటకు 15 డాలర్లు ఇస్తాం. ఒక్క కాలిఫోర్నియాలో మాకు 5 వేల మంది ఉద్యోగులు కావాలి. కానీ దొరకడం లేదు.

california lo hour ki 15$ istham ani edo 200k job offer sesinattu septhunnadu kada @3$%

Posted

నేను, నా భార్య ఏడాదికి 50 వేల డాలర్లు (రూ.33.50 లక్షలు) అమెరికా ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తాం. ఇప్పుడు ఈఏడీ విధానం కింద నా భార్య ఉద్యోగం చేయడానికి వీల్లేదంటూ ట్రంప్‌ సర్కార్‌ చట్టం తేబోతోంది. అదే జరిగితే నేను పక్కన ఉన్న కెనడాకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటా’’అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే టాప్‌ టెన్‌ విశ్వవిద్యాలయాలలో ఒకటైన బర్కిలీలోని యూనివర్సిటీ అఫ్‌ కాలిఫోర్నియాలో పీజీ పూర్తి చేసి క్యాంపస్‌ నియామకాలలో ఆపిల్‌ కంపెనీలో చేరిన అశ్విన్‌ రాచమల్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

 

Phd anta Apple lo Job anta Cali lo and wife kuda working anta kani iddaru kalisi pay chese tax 50k ne anta! ma orilo sampadinchukovachu ra iddaru kalsi ade 150k...daniki phd,Apple,Cali avasarama ra Japan ga

Posted
39 minutes ago, TampaChinnodu said:

california lo hour ki 15$ istham ani edo 200k job offer sesinattu septhunnadu kada @3$%

Asalu tintaniki miguluthada 

Posted
12 minutes ago, futureofandhra said:

Asalu tintaniki miguluthada 

I still don't know how low paying hourly workers live in California. 

Posted
1 hour ago, TampaChinnodu said:

california lo hour ki 15$ istham ani edo 200k job offer sesinattu septhunnadu kada @3$%

@3$%

Posted

Costco lo per hour 19$ istharu..

 

It job 15$ per hour uh..

 

Love you raaja..

 

Desi prime vendors rock..

 

All full time 1 year chesthe veelantha mayam

Posted

ఈఏడీ ద్వారా ఉద్యోగం చేసుకుంటున్న వారిలో 75 శాతం మంది ఐటీ నిపుణులే. వీరిలోనూ 65 శాతం మంది సిలికాన్‌ వ్యాలీ ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. అందువల్లే ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్‌ వంటి అగ్రశ్రేణి సంస్థలు ఈఏడీ రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ విధానాన్ని రద్దు చేస్తే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయినా ట్రంప్‌ ప్రభుత్వం దీన్ని రద్దు చేసేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. ‘‘కాలిఫోర్నియా నిబంధనల ప్రకారం మాకు వచ్చే వేతనంలో 34 శాతం పన్నులకే పోతోంది. మరి ఇలాంటప్పుడు భార్య, భర్త పని చేయకుండా ఎలా నెట్టుకురాగలం? ఒకవేళ ఈఏడీ రద్దు చేస్తే మేమెందుకు ఉండాలి? మా కష్టంలో సగం పన్నులకే ఎందుకు చెల్లించాలి’’అని గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బ్రహ్మరెడ్డి ప్రశ్నించారు. ఫేస్‌బుక్, ఆపిల్‌ కంపెనీల్లోనే దాదాపు 24 వేల మంది ఈఏడీతో పని చేస్తున్నారు. ‘‘నా భర్త ఐఐటీ గ్రాడ్యుయేట్‌. ఆయనకు ఫేస్‌బుక్‌లో ఉద్యోగం వస్తే ఆయనతో పాటు వచ్చి ఈఏడీపై ఇన్ఫోసిస్‌లో నేను పని చేస్తున్నా. ఇప్పుడు దీన్ని రద్దు చేస్తే నేను ఖాళీగా ఇంట్లో ఉండాలా. ఒకవేళ అదే జరిగితే నేను నా భర్త స్వదేశానికి తిరిగిపోతాం’’అని పిన్నపరెడ్డి ప్రసూన అన్నారు. ‘‘ఇప్పటికే ఇక్కడ ఐటీ కంపెనీల్లో వేలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు దొరకడం లేదు. ఫలితంగా అనేక ప్రాజెక్టులు కోల్పోవాల్సి వస్తుంది’’అని టీసీఎస్‌ ఉత్తర అమెరికా మానవ వనరుల విభాగం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆపరేషన్స్‌ మురళీ శర్మ ఇటీవల అమెరికా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Posted

maa daantlo strict buy american hire american started @~` - esp in IT .......platform revamp kosam new app development going on - strict rule from Top management......no visa sponsorships.......this trigerrs a doubt in existing fte candidates about their future.....and mostly hiring college graduates .....even with minimal exp......

Posted
28 minutes ago, kakatiya said:

Costco lo per hour 19$ istharu..

 

It job 15$ per hour uh..

 

Love you raaja..

 

Desi prime vendors rock..

 

All full time 1 year chesthe veelantha mayam

It is probably Walmart store job . Looks like some h4 ead aunties are working in walmart 

‘‘మేం గంటకు 15 డాలర్లు ఇస్తాం. ఒక్క కాలిఫోర్నియాలో మాకు 5 వేల మంది ఉద్యోగులు కావాలి. కానీ దొరకడం లేదు. ఈఏడీ ఉన్న కొందరితో పని చేయించుకుంటున్నాం. ఇప్పుడు దానిని రద్దు చేస్తే మాకు ఇబ్బందులు తప్పవు’’అని వాల్‌ మార్ట్‌ కాలిఫోర్నియా హెచ్‌ఆర్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ రిచర్డ్‌ సన్‌ చెప్పారు

Posted
Quote

It is probably Walmart store job . Looks like some h4 ead aunties are working in walmart 

maa city lo I have seen h4 aunties working in fedex and cvs stores

Posted
27 minutes ago, TampaChinnodu said:

It is probably Walmart store job . Looks like some h4 ead aunties are working in walmart 

‘‘మేం గంటకు 15 డాలర్లు ఇస్తాం. ఒక్క కాలిఫోర్నియాలో మాకు 5 వేల మంది ఉద్యోగులు కావాలి. కానీ దొరకడం లేదు. ఈఏడీ ఉన్న కొందరితో పని చేయించుకుంటున్నాం. ఇప్పుడు దానిని రద్దు చేస్తే మాకు ఇబ్బందులు తప్పవు’’అని వాల్‌ మార్ట్‌ కాలిఫోర్నియా హెచ్‌ఆర్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ రిచర్డ్‌ సన్‌ చెప్పారు

Walmart don't give you more than 9.5$ they are worst jobs

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...