whatsapp Posted May 25, 2018 Report Posted May 25, 2018 😛🤣😛😢😭😂 నిన్న నేనొక ఫంక్షన్ కి అటెండ్ అయ్యా..దాదాపు 50 మంది అతిథులు కుర్చీల్లో ఆశీనులయ్యారు..నేను ముందు వరుసలో కూర్చున్నా..ఆకలిగా అనిపించింది. కాసేపయ్యాక ఒకామె ట్రేలో స్నాక్స్ తెచ్చి వెనుక వరుస నుండి అతిథులకు అందించడం ప్రారంభించింది..ముందుకి కూర్చున్న నా వరకు వచ్చేసరికి స్నాక్స్ అయిపోయాయి..చిరాగ్గా అనిపించింది.తిన్నగా లేచివెళ్లి వెనుక వరుసలో కూర్చున్నా. ఈలోగా మరొక ఆమె కూల్డ్రింక్స్ తెచ్చి ముందువరుస నుండి పంపకం మొదలెట్టింది..అనుమానించినట్టే వెనక్కు వచ్చేలోపు అవికూడా అయిపోయాయి.. కోపం పట్టలేక వెళ్లిపోదాం అని లేచి నిల్చున్నా..సరిగ్గా అదే టైమ్ కి ముగ్గురు మహిళలు ట్రే లలో ఘుమ ఘుమలాడే వంటకాలను తీసుకువచ్చారు..స్మార్ట్ గా ఆలోచించి ఈసారి మధ్య వరుసలో కూర్చున్నా. ఒకామె ముందునుండి, మరొకామే వెనుక నుండి అందించడం మొదలెట్టారు..థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు టెన్షన్ గా అనిపించింది..ఊహించరాని విధంగా మధ్య వరుస వచ్చేసరికి సమాప్తం.. అందరూ తింటుంటే ఏం చేయాలో తోచక అయోమయంగా తలదించి కోపంగా నా చేతులవైపు చేసుకుంటున్నా.. సరిగ్గా అదేసమయంలో మూడవ మహిళ నా వద్దకు వచ్చి..తన చేతిలో ఉన్న బౌల్ ని చూపించి తీసుకోమన్నట్టు సైగ చేసింది..ఆతృతగా బౌల్ లో చెయ్యిపెట్టి బయటకు తీసా..అదేంటో తెలుసా?? టూత్ పిక్..పళ్ళసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తీసే కర్రపుల్లలు..ఛి ఛీ.ఎదవ జన్మ. నీతి : జీవితంలో మీ పొజిషన్ ని తరచుగా మార్చడానికి ప్రయత్నించొద్దు. దేవుడు మీరు ఎక్కడుంటే మంచిదో అక్కడే ఉంచుతాడు. కాదూ,కూడదు అని తొందరపడితే దొరికేది "టూత్ పిక్" లే. 😀😀😂😂😁😁😎😎 1 Quote
Biskot Posted May 25, 2018 Report Posted May 25, 2018 2 hours ago, Heroin said: navvali antava lite thisko... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.