TampaChinnodu Posted May 29, 2018 Author Report Posted May 29, 2018 ప్రమాదంలో కొడుకు.. పోకెమన్ ఆటలో తండ్రి పారిస్: పారిస్‌లో నాలుగేళ్ల చిన్నారి నాలుగో అంతస్తు బాల్కనీని పట్టుకుని ప్రమాదకరంగా వేలాడుతూ కన్పించడంతో ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడిన విషయం తెలిసిందే. దీంతో స్పైడర్‌మ్యాన్‌లా వచ్చి బాలుడిని రక్షించాడంటూ ఆ యువకుడిని ప్రశంసించారు స్థానికులు. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సదరు చిన్నారి బాల్కనీకి వేలాడుతూ ప్రమాదంలో ఉన్న సమయంలో అతడి తండ్రి పోకెమన్ గో ఆట ఆడుతూ రోడ్డుపై ఉండిపోయాడట. ఈ కేసును విచారిస్తున్న అధికారులు ఈ మేరకు వెల్లడించారు. గత శనివారం ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారి నాలుగో అంతస్తు బాల్కనీకి వేలాడుతూ కన్పించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కాపాడండి అంటూ కింద నుంచి అరిచారు. ఇంతలో అక్కడికి వచ్చిన మాలికి చెందిన మమోడు గసామా.. బాబును చూసి వెంటనే స్పందించాడు. ఎలాంటి తాడు సాయం లేకుండానే ఒట్టి చేతులతోనే ఒక బాల్కనీ నుంచి మరో బాల్కనీ ఎక్కుతూ నాలుగో అంతస్తుకు చేరాడు. బాబును నెమ్మదిగా పట్టుకుని బాల్కనీలోకి చేర్చాడు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే సదరు చిన్నారి బాల్కనీలో ప్రమాదకరంగా ఉన్న సమయంలో అతడి తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరని పారిస్ అధికారులు తెలిపారు. తల్లి వేరే ప్రాంతానికి వెళ్లగా.. తండ్రి ఆ చిన్నారిని ఒంటరిగా వదిలేసి కిందకు వచ్చినట్లు చెప్పారు. ముందు పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లిన చిన్నారి తండ్రి.. ఆ తర్వాత పోకెమన్ గో ఆడుతూ రోడ్డుపైనే ఉండిపోయినట్లు చెప్పారు. దీంతో చిన్నారిని నిర్లక్ష్యంగా వదిలేసినందుకు గానూ అతడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం సోమవారం అతడిని విడిచిపెట్టారు. ఘటనపై బాబు నానమ్మ స్పందించారు. గసామా నిజంగా ఓ హీరో అని ప్రశంసించారు. తన మనవడిని కాపాడిన అతడికి కృతజ్ఞతలు తెలిపారు. Quote
tennisluvr Posted May 29, 2018 Report Posted May 29, 2018 6 minutes ago, TampaChinnodu said: Great story, great guy Quote
Rushabhi Posted May 29, 2018 Report Posted May 29, 2018 Intha irresponsible people pillalni enduku kantaro Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.