TampaChinnodu Posted June 1, 2018 Report Posted June 1, 2018 అమరావతి పనుల్లో వేగమేదీ? ఐదు నిమిషాల వీడియో కూడా తయారు చేయలేకపోతే ఎలా? సీఆర్‌డీఏ అధికారులపై చంద్రబాబు అసంతృప్తి ఈనాడు - అమరావతి ఈనాడు, అమరావతి: ఎంతో గర్వపడేలా పోలవరం ప్రాజెక్టు పనులను 55 శాతం పూర్తి చేయగలిగామని, అదే అమరావతి విషయంలో ఆ స్థాయిలో పనులు వేగంగా జరగడం లేదని సీఆర్‌డీఏ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధానిలో జరుగుతున్న పనులను మహానాడు వేదికగా.. చూపించేందుకు ఐదు నిమిషాల వీడియోను తయారు చేయాలని సూచిస్తే దానినీ జనాలకు అర్థమయ్యేలా రూపొందించలేకపోవడమేంటని ప్రశ్నించారు. అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించిన ప్రతిపాదనలను ముందే పరిశీలించి, వాటిలో మార్పులు, చేర్పులను సూచించేలా తన దగ్గరకు రాకుండా నేరుగా తనతోపాటే దానిని చూస్తే ఎలా అని నిలదీశారు. వెలగపూడి సచివాలయంలో గురువారం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. పేరుకు పదుల సంఖ్యలో సలహాదారులను పెట్టుకుని కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా పనులను ఎందుకు పరుగెత్తించలేకపోతున్నారని ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు. సీడ్ యాక్సెస్ రహదారి ప్రాంతంలో ఒక చోట దుమ్ము లేచి ఆ దారిన వెళ్లే వారికి ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. వర్షాకాలం రానున్నందున నిర్మాణ పనులు అనుకున్నట్లుగా సాగవని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. 6అమరావతి బాండ్లు రాజధాని నిర్మాణానికి నిధుల సేకరణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్న రూ.2వేల కోట్ల విలువైన అమరావతి బాండ్లను జూన్ 6న విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినందున ఆర్‌బీఐ విధాన ప్రకటన తర్వాత వీటిని జారీ చేయాలని తీర్మానించారు. 6 నెలల్లో త్రీడీ డిజైన్లు అమరావతి త్రీడీ సిటీ డిజైన్లను 6 నెలల్లో పూర్తి చేయాలని చంద్రబాబు డస్సాల్ట్ సిస్టమ్ సంస్థ ప్రతినిధులను కోరారు. తొలుత వారు ఈ డిజైన్లపై సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నగర ప్రణాళికలు, ప్రకృతి వైపరీత్యాలు, భూ ప్రకంపనలకు సంబంధించి సూచనలు అందజేయడంలో ఈ త్రీడీ డిజైన్లు కీలకమవుతాయని, నిర్మాణాలను ఎప్పటికప్పుడు వాస్తవ సమయంలో ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి ఉపకరిస్తాయని వారు చెప్పారు. భూగర్భ పైపు లైన్లు మొదలు భవంతుల మధ్య గాలి, వెలుతురు వరకూ త్రీడీ సాంకేతిక సాయంతో అంచనా వేయొచ్చని వివరించారు. 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేందుకు.. రాజధాని ప్రాంతంలో ఎండలు, ఉష్ణోగ్రతల తీవ్రతపై అధ్యయనం చేసిన నార్మన్ ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు... ఆ అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. గత మూడు రోజుల్లో విజయవాడలో నమోదైన వాస్తవ ఉష్ణోగ్రత కంటే ప్రజలకు అనిపించే (ఫీలయ్యే) ఉష్ణోగ్రత అధికంగా ఉందని, దాదాపు 60 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నట్లు అనిపించిందని తెలిపారు. రాజధానిలో పది డిగ్రీల సెంటిగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. *అన్న క్యాంటీన్ల నిర్మాణ ఆకృతులను పరిశీలించిన ముఖ్యమంత్రి అవసరమైన నిధుల కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అన్న క్యాంటీన్లకు నిధులు సమకూర్చుకోవచ్చని చెప్పారు. * ప్రీ ఫ్యాబ్రికేటేడ్ సామగ్రితో రాజధానిలో మూడు నక్షత్రాల హోటల్ నిర్మాణం చేపట్టేందుకు ఫార్చ్యూన్ మురళీ యాజమాన్యం ముందుకొచ్చిందని సీఆర్‌డీఏ అధికారులు వివరించారు. Quote
Vaampire Posted June 1, 2018 Report Posted June 1, 2018 Cbn okkadey kastapaduthunnadu. Migitha govt officials ministers antha kastapadatam ledhu... idhey projection... eenadu maradhu.. 1995-2004 ilaney project chesaru. Janalu budhi chepparu. Malli same 2 same ayedhey. Lucky cbn. Inko waste gaadu opposition leader ga unnadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.