Jump to content

Recommended Posts

Posted
ప్రకంపనలు సృష్టించే కుంభకోణం‌ బయటపెడతాం
కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు
0547225BRK140-KUTUMBARAO.JPG

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు కేంద్ర ప్రభుత్వంపైనా, భాజపా నేతలపైనా సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంభకోణం త్వరలో వెలుగులోకి రాబోతోందన్నారు. నెల రోజుల్లోనే అన్ని ఆధారాలతో దాన్ని బయట పెడతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీకి దగ్గరగా ఉండే వ్యాపార సంస్థకు లబ్ధి చేకూర్చారన్న అంశం ప్రకంపనలు సృష్టించబోతోందన్నారు. గుర్తు పెట్టుకోండి.. కచ్చితంగా ప్రకంపనలు పుట్టిస్తాం అని భాజపా నేతలను హెచ్చరించారు. కేంద్రం చేసిన కుంభకోణంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామన్నారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. యూసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పరిశీలనకు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు సిద్ధమా? అని ప్రశ్నించారు. జీవీఎల్‌ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోబెల్స్‌ మాదిరిగా ప్రచారం చేయడంలో ఆయనకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై వాస్తవాలు వెల్లడించేందుకు కేంద్రం తరఫున నలుగురిని, రాష్ట్రం తరఫున నలుగురిని పెట్టి చర్చిద్దామని సవాల్‌ విసిరినా జీవీఎల్‌ స్పందించలేదని కుటుంబరావు ఆరోపించారు. 2016లో దిల్లీ - ముంబయి పారిశ్రామిక కారిడార్‌కు రూ.495 కోట్లు కేటాయిస్తే.. దేశంలో ఉన్న మిగతా వాటికి కేవలం 4.5 కోట్లు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. ఎస్పీవీ పెడితే శ్రీకాళహస్తి, కృష్ణపట్నం అభివృద్ధి చేస్తామంటున్నారని గుర్తు చేశారు. దేశంలో 25 నోడ్స్‌ ఉంటే ఐదు నోడ్స్‌ గుజరాత్‌లోనే ఉన్నాయన్నారు. ఈ ఐదు నోడ్స్‌లో కూడా డొలేరాకు ఎక్కువ నిధులు ఇస్తున్నారని విమర్శించారు. కృష్ణపట్నం నోడ్ విషయంలో కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. యూసీలు అడగడానికి జీవీఎల్‌ ఎవరని నిలదీశారు. నిధుల మళ్లింపు, యూసీల విషయంలో సమావేశం ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. తప్పని తేలితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమన్నారు.

వాళ్లు వార్డు సభ్యులు కూడాకాలేరు!

జీవీఎల్‌ సహా భాజపా నేతలెవ్వరూ వార్డు సభ్యులు కూడా కాలేరని విమర్శించారు. తొమ్మిది నెలల్లో అద్భుతంగా భాజపా జాతీయ కార్యాలయాన్ని నిర్మించారని, ఆ స్థాయిలో ఒక్క సంస్థ అయినా నిర్మాణం అయ్యేలా ఏపీకి సహకరించారా? అని నిలదీశారు. పారిశ్రామిక కారిడార్లు, యూసీలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు.పీఎంవోలో ఫైల్‌ కదలాలంటే ఆరు నెలల సమయం పడుతోందని ఆరోపించారు. ఎయిర్‌ ఏషియా వ్యవహారంలో 85శాతం పని యూపీఏ-2లో పూర్తయిందని.. ఎయిర్‌ ఏషియా వ్యవహారానికి ఆమోదం తెలిపింది మోదీ కేబినెటేనన్నారు.

Posted

This is the Brahmastram from TDP. Eee debba tho BJP gone.

Posted
కేంద్రంలో ప్రకంపనలు వస్తాయ్‌ 
నెలరోజుల్లో 2 అతిపెద్ద కుంభకోణాలను బయటపెడతాం 
ప్రధానికి సన్నిహితమైన వ్యాపారసంస్థకు లాభం చేకూర్చారు 
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు ఆరోపణ 
ఈనాడు - అమరావతి 
5ap-main3a.jpg

కేంద్ర ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించే రెండు అతిపెద్ద కుంభకోణాలను నెలరోజుల్లో బయటపెడతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు ప్రకటించారు. అది కూడా ప్రధాని మోదీకి బాగా సన్నిహితమైన వ్యాపార సంస్థ(గ్రూప్‌)కు చేసిన లాభమని పేర్కొన్నారు. దానిపై న్యాయస్థానాన్నీ ఆశ్రయిస్తామన్నారు. మంగళవారం ఆయనిక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎయిర్‌ ఏషియా అంశంలో ఏమీ లేకపోయినా బురదజల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థుడు, ప్రధానమంత్రి అభ్యర్థి కూడా అవగలరు. ఆయన చెబితే పనులు అవుతాయి, ఆయన మంత్రే కదా విమానయానశాఖ మంత్రిగా ఉన్నారు’’ అని ఎయిర్‌ ఏషియా అధిపతి టోనీ ఫెర్నాండెజ్‌,    ఆ సంస్థ సీఈఓ ఫోన్‌లో మాట్లాడుకుంటే.. చంద్రబాబును, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజును ఇందులో ఇరికించాలని చూడడమేంటని ప్రశ్నించారు. ‘‘ఆ సంభాషణలో అవినీతిని బలపరిచే ఒక్క పదమైన ఉందా? వారు(భాజపా) చెబితే వారి     తోక పత్రిక సాక్షి రాయడమేంటి? అసలు దేశంలో పౌరుల ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతి ఉందా? ఎయిర్‌ ఏషియా ఓనర్‌, సీఈఓ ఫోన్‌ సంభాషణను ఎవరు ట్యాప్‌ చేశారు? మొదట అది బయటపెట్టాలి’’ అని డిమాండ్‌ చేశారు. ‘‘ఆ అంశానికి సంబంధించి 85శాతం నిర్ణయం యూపీఏ-2 హయాంలో జరిగింది. ఆ నిర్ణయాన్ని నరేంద్రమోదీ మంత్రిమండలి ఆమోదించింది. అంటే మోదీతో సహా కేంద్ర మంత్రిమండలి మొత్తం డబ్బు తినే ఆమోదించిందా? లేదా అందులో తప్పుంది అనుకుంటే మంత్రిమండలి చూడలేదా? చూడదా’’ అని కుటుంబరావు ప్రశ్నించారు.

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని ఒక్కసారైనా నోరుతెరిచారా? 
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని ఒక్కసారైనా నోరుతెరిచి సమాధానం చెప్పారా?అని కుటుంబరావు ప్రశ్నించారు. 2016-17లో దిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్‌కు రూ.495.49 కోట్లు ఇవ్వగా మిగిలిన కారిడార్లన్నింటికీ కలిపి రూ.4.50కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 2017-18లో దిల్లీ-ముంబయి కారిడార్‌కు రూ.1031.79 కోట్లు ఇస్తే మిగిలినవాటికి రూ.13కోట్లు ఇచ్చారని వివరించారు. ఒక్క దిల్లీ-ముంబయి కారిడార్‌లో 25 అభివృద్ధి చేస్తున్న ప్రాంతాలుండగా అందులో 5 గుజరాత్‌లోనే ఉన్నాయన్నారు. ఆ అయిదింటిలో ప్రధాని మానసపుత్రిక అయిన ధొలేరా ఒకటని అన్నారు. ఆయన సింగపూర్‌, కెనడా, దుబాయ్‌కు వెళ్లినపుడు ధొలేరాకు ప్రాజెక్టులు వచ్చేలా వ్యవహరించారన్నారు. ‘‘కెనడియన్‌ పెన్షన్‌ ఫండ్‌ భారత్‌కు వస్తుండగా పీఎంఓ దాన్ని ధొలేరాలో పెట్టమందని, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ విషయంలోనూ ఇలాగే జరిగిందని ఈ మాదిరి ప్రపంచవ్యాప్తంగా ప్రధాని ప్రభావితం చేసి ధొలేరాకు రూ.50వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు మార్గం సుగమం చేశారని అన్నారు.

జీవీఎల్‌ నరసింహారావువి పచ్చి అబద్ధాలు 
భాజపా జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ఏపీకి వచ్చి పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రభుత్వంపై నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబరావు విమర్శించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్రం రూ.8వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్రం తీసుకోవట్లేదంటున్నారని మరి ఆ ప్రాజెక్టులేంటో ఆయన ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన యూసీల్లో తేడా ఉంటే 24 గంటల్లోపే కేంద్ర ప్రభుత్వ అధికారులను పంపి తనిఖీ చేయించాలని తప్పుంటే తలదించుకుంటామని సవాల్‌ విసిరారు. చెన్నై-బెంగళూరు కారిడార్‌లో కృష్ణపట్నం పెడుతూ డిసెంబరు-2017లోనే సంబంధిత ట్రస్టుతో ఏపీ ప్రభుత్వం ఒప్పంద ప్రక్రియ పూర్తిచేయగా దానికి కేంద్రం ఇప్పటివరకూ క్లియరెన్స్‌ ఇవ్వలేదన్నారు. అలాగే విశాఖ-చెన్నై కారిడార్‌ విషయమూ కేంద్రం వద్దే పెండింగులో ఉందన్నారు.

Posted
Quote

ఆ సంభాషణలో అవినీతిని బలపరిచే ఒక్క పదమైన ఉందా? వారు(భాజపా) చెబితే వారి     తోక పత్రిక సాక్షి రాయడమేంటి? అసలు దేశంలో పౌరుల ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతి ఉందా? ఎయిర్‌ ఏషియా ఓనర్‌, సీఈఓ ఫోన్‌ సంభాషణను ఎవరు ట్యాప్‌ చేశారు? మొదట అది బయటపెట్టాలి’

bl@st

Posted
14 hours ago, Idassamed said:

This is the Brahmastram from TDP. Eee debba tho BJP gone.

BJP ni bondha pedutunnara mana chaNAKKAyabl@st

Posted
14 hours ago, SeemaLekka said:

is this guy new spokesperson for tdp?

If this is a government post. Then nagarjuna gaaru prize money ithanike. 

Posted
15 hours ago, Idassamed said:

This is the Brahmastram from TDP. Eee debba tho BJP gone.

Inthaki kutumba rao manodena??? Adhe ntr rakthama ani adiga 

Posted
4 minutes ago, JaiBoloJaiBolo said:

Inthaki kutumba rao manodena??? Adhe ntr rakthama ani adiga 

ya mana andhorde bhayya..inthaki nuvu andhroniva leka langaa va

Posted
16 hours ago, TampaChinnodu said:
ప్రకంపనలు సృష్టించే కుంభకోణం‌ బయటపెడతాం
కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు
0547225BRK140-KUTUMBARAO.JPG

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు కేంద్ర ప్రభుత్వంపైనా, భాజపా నేతలపైనా సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంభకోణం త్వరలో వెలుగులోకి రాబోతోందన్నారు. నెల రోజుల్లోనే అన్ని ఆధారాలతో దాన్ని బయట పెడతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీకి దగ్గరగా ఉండే వ్యాపార సంస్థకు లబ్ధి చేకూర్చారన్న అంశం ప్రకంపనలు సృష్టించబోతోందన్నారు. గుర్తు పెట్టుకోండి.. కచ్చితంగా ప్రకంపనలు పుట్టిస్తాం అని భాజపా నేతలను హెచ్చరించారు. కేంద్రం చేసిన కుంభకోణంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామన్నారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. యూసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పరిశీలనకు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు సిద్ధమా? అని ప్రశ్నించారు. జీవీఎల్‌ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోబెల్స్‌ మాదిరిగా ప్రచారం చేయడంలో ఆయనకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై వాస్తవాలు వెల్లడించేందుకు కేంద్రం తరఫున నలుగురిని, రాష్ట్రం తరఫున నలుగురిని పెట్టి చర్చిద్దామని సవాల్‌ విసిరినా జీవీఎల్‌ స్పందించలేదని కుటుంబరావు ఆరోపించారు. 2016లో దిల్లీ - ముంబయి పారిశ్రామిక కారిడార్‌కు రూ.495 కోట్లు కేటాయిస్తే.. దేశంలో ఉన్న మిగతా వాటికి కేవలం 4.5 కోట్లు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. ఎస్పీవీ పెడితే శ్రీకాళహస్తి, కృష్ణపట్నం అభివృద్ధి చేస్తామంటున్నారని గుర్తు చేశారు. దేశంలో 25 నోడ్స్‌ ఉంటే ఐదు నోడ్స్‌ గుజరాత్‌లోనే ఉన్నాయన్నారు. ఈ ఐదు నోడ్స్‌లో కూడా డొలేరాకు ఎక్కువ నిధులు ఇస్తున్నారని విమర్శించారు. కృష్ణపట్నం నోడ్ విషయంలో కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. యూసీలు అడగడానికి జీవీఎల్‌ ఎవరని నిలదీశారు. నిధుల మళ్లింపు, యూసీల విషయంలో సమావేశం ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. తప్పని తేలితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమన్నారు.

వాళ్లు వార్డు సభ్యులు కూడాకాలేరు!

జీవీఎల్‌ సహా భాజపా నేతలెవ్వరూ వార్డు సభ్యులు కూడా కాలేరని విమర్శించారు. తొమ్మిది నెలల్లో అద్భుతంగా భాజపా జాతీయ కార్యాలయాన్ని నిర్మించారని, ఆ స్థాయిలో ఒక్క సంస్థ అయినా నిర్మాణం అయ్యేలా ఏపీకి సహకరించారా? అని నిలదీశారు. పారిశ్రామిక కారిడార్లు, యూసీలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు.పీఎంవోలో ఫైల్‌ కదలాలంటే ఆరు నెలల సమయం పడుతోందని ఆరోపించారు. ఎయిర్‌ ఏషియా వ్యవహారంలో 85శాతం పని యూపీఏ-2లో పూర్తయిందని.. ఎయిర్‌ ఏషియా వ్యవహారానికి ఆమోదం తెలిపింది మోదీ కేబినెటేనన్నారు.

who is this GudumbaRao ?

Posted
1 minute ago, SuryaBhai_itsabrand said:

ya mana andhorde bhayya..inthaki nuvu andhroniva leka langaa va

Andhra langaa emo

Posted
1 minute ago, SuryaBhai_itsabrand said:

ya mana andhorde bhayya..inthaki nuvu andhroniva leka langaa va

enti Bro... nenu adigindhi ntr rakthama ani.. nuvvu andhrodu ani maa ballayya babu maata nijam chesavu kadha "andhra logo ke rago rago mein ntr khoond bahraha hein"

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...