Jump to content

Recommended Posts

Posted

ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇవ్వడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు తక్షణమే సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల్లోంచి తొలగించాల్సి వస్తుందని ఘాటు హెచ్చరికలు చేశారు. గురువారం రాత్రి ఆయన మంత్రులు, సీఎస్‌, డీజీపీ, ఆర్టీసీ ఎండీతో ప్రగతిభవన్‌లో సమావేశమైన ఆయన ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. అసమంజసమైన కోరికల వల్ల ఆర్టీసీకి ఏటా మరో రూ.900 కోట్ల నష్టాలు వస్తాయని తెలిపారు. కొందరు స్వలాభం కోసం చెబుతున్న మాటలను నమ్మి కార్మికులు నష్టపోవద్దని సూచించారు. సమ్మె చేస్తే ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందన్నారు. తెలంగాణ అంటే కేవలం 53వేల మంది కార్మికులే కాదని, తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలదన్నారు. ఆర్టీసీ సమ్మె ఆలోచన ఆత్మహత్యాసదృశ్యమని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆర్టీసీ కార్మికులు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

తమ సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సమస్యల పరష్కారానికి సమ్మె తప్ప వేరే మార్గం లేదనే నిర్ణయానికి వచ్చిన కార్మిక సంఘాల నేతలు ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు. దీనిలో భాగంగా ఉద్యమ కార్యాచరణను సైతం ప్రకటించారు. ఈ నెల 7న భోజన విరామ సమయంలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నాలు, 8న రీజినల్‌ కార్యాలయాల ముందు ఒక రోజు సామూహిక దీక్షలు చేపట్టాలని సోమవారం ఎల్బీనగర్‌లో జరిగిన టీఎంయూ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

70618slider145.jpg

 
 
Posted

On a side note, Mr. Kodhandam supported RTC union's indefinite strike

Posted

Major disadvantage of TG is weak opposition. I think congress did not even respond on this issue till now.. em peekthunnaru ra grand old saleyssss

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...