Jump to content

Recommended Posts

Posted

వాడికి శిక్ష పడేవరకూ పోరాడతా!

కళ్లముందే అక్క మరణం....ఆమెను కుంగదీసింది. 
అది హత్య అని గుండెలవిసేలా చెబుతున్నా... కాదని కొట్టిపారేశారు పోలీసులు. దాంతో న్యాయం కోసం ఒంటరిపోరాటం మొదలుపెట్టింది. 
సహకారం లేకపోయినా నిరూపించాలనుకుంది. 
తన అక్క చావుకు కారకులైన నలుగురు నిందితులు కటకటాల పాలయ్యే వరకూ ఆగలేదు.  ఇప్పుడు ఏడాదిన్నర ఆమె పోరాటంలో మొదటి మెట్టు ఎక్కింది.  ఆమే దంగేటి పావని.  ప్రమాదంగా చిత్రీకరించి మూసేసిన కేసుని హత్యకేసు అని రుజువు చేయడానికి ఆమె పడిన కష్టాన్నీ, పోరాటాన్ని ‘వసుంధర’తో పంచుకుందిలా. 
 రోజు కళ్లముందే జరిగింది ఆ ప్రమాదం. అది హత్యేననీ అక్కను ఓ పథకం ప్రకారమే చంపేశారని నాకు తెలుసు. నాకు కొందరిమీద అనుమానం వచ్చింది. ఆ వివరాలనే  పోలీసులకు చెప్పినా, ప్రమాద సంఘటనగానే తేల్చారు. కేసునూ మూసేశారు. అన్యాయం జరుగుతోందని తెలిసి ఏడుపు ఆగలేదు.   కంటిమీద కునుకు రాలేదు. అలాని నిరుత్సాహపడి అక్కడితో ఆగిపోతే అక్క ఆత్మకు శాంతి కలగదు.  పైగా మరో ఆడపిల్లకూ ఇటువంటి అన్యాయమే జరగొచ్చు. అందుకే ధైర్యంగా పోరాడేందుకే సిద్ధమయ్యా. సమస్యలు ఎదురైనా ప్రతి సాక్ష్యాన్ని సేకరించేందుకు ప్రయత్నించా. చివరకు నేను అనుకున్నదే నిజమైంది. ఇప్పుడు పోలీసులు ఆ కేసును రీఓపెన్‌ చేశారు. హత్యకేసుగా నమోదు చేశారు. నిందితుల్ని అరెస్టు చేసి సబ్‌జైలుకు పంపించారు. ఆ నలుగురికీ న్యాయస్థానంలో శిక్షపడేవరకూ నేను ఈ పోరాటం  ఆపను. అసలు ఏమయ్యిందంటే... 
అందుకే చదువు ఆపేశా... 
మాది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం. మధ్యతరగతి కుటుంబం. మా నాన్న నర్సింహస్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. అమ్మ అనంతలక్ష్మి. మేమిద్దరమూ  ఆడపిల్లలమే. నాన్న చనిపోయాక అమ్మే మాకు సర్వస్వం. అక్క ఎంబీఏ చదివింది. తన లక్ష్యం సివిల్స్‌. దాన్ని సాధించి ఇంటికి అండగా నిలబడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నాన్న అనారోగ్యంగా ఉన్న సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితీ, ఆసుపత్రిలో అమ్మకు తోడు అవసరమై నేను ఇంటర్‌తోనే చదువు ఆపేశా. ఆర్థిక ఆసరా కొసం నరసాపురం, పాలకొల్లులో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేదాన్ని. అక్క మాత్రం ఎంబీఏ అయ్యాక చిన్న ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి ప్రిపేర్‌ అయ్యేది. 
కళ్లముందే ఘోరం... 
అది 2017 జనవరి 18. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తే. అక్కకు ఒంట్లో బాలేదు. దాంతో మేమిద్దరం కలిసి బండిపై పాలకొల్లులోని ఆసుపత్రికి వెళ్లాం. అక్కడ నుంచి తిరిగి బయలుదేరే సరికి రాత్రయ్యింది. దారిలో ఓ టాటా సఫారీ వాహనం మమ్మల్ని వెంబడించడం గమనించాం. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాం కానీ చివరకు అది మా బండిని ఢీకొట్టింది. ఇద్దరం ఒక్కసారిగా కిందపడిపోయాం. నాకు బాగా గాయాలయ్యాయి. బాధతో విలవిల్లాడుతున్నా. అక్క కోసం చుట్టూ చూశా కానీ ఎక్కడా కనిపించలేదు. నేనేమో కదల్లేని పరిస్థితి. ఈలోగా 108 వాహనంలో ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ వెంటనే ఏం జరిగిందో నాకు తెలియదు. స్పృహ కోల్పోయా. ఎప్పటికో మెలకువ వచ్చింది. వెంటనే అక్క ఎక్కడ అని అడిగా. నా పక్కనే ఉన్న సజ్జా వీరవెంకట సత్యనారాయణ(బుజ్జి) భీమవరంలో సర్జరీ చేయిస్తున్నాను అని చెప్పాడు. నా పరిస్థితేమో ఒళ్లంతా గాయాలు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి 24 గంటల తరువాత ఇంటికి పంపించారు. 
రహస్యంగా పెళ్లి... 
ఆసుపత్రి నుంచి బంధువులకు నన్ను తీసుకొచ్చారు. ఇంటికొచ్చేసరికి చుట్టూ జనాలు. కొందరు జాలిగా చూస్తే... మరికొందరు ఏడుపు ఆపుకొంటూ నా దగ్గరకు వస్తున్నారు. అమ్మ ఒక్కసారిగా నన్ను పట్టుకుని పెద్దగా ఏడ్చేసింది. అప్పుడే తెలిసింది అక్క మమ్మల్ని వదిలి వెళ్లిపోయిందని. తట్టుకోలేక పోయా. వెక్కివెక్కి ఏడ్చా. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఆలోచిస్తే... నాలో ఆనుమానం మొదలైంది. ఈ సమయంలో బుజ్జి చేసిన ప్రతి పనీ నాలో అనుమానాన్ని ఇంకా పెంచింది.

ఎందుకంటే...

అక్కకు బుజ్జితో కొన్నాళ్లక్రితమే పెళ్లయ్యింది. అంత్యక్రియల సమయంలో అతను వివాహిత స్త్రీకి జరిపినట్లు కాకుండా అవివాహితకు చేసినట్లుగా కార్యక్రమాన్ని దగ్గరుండి చేయించాడు.  అసలు అక్క పెళ్లి విషయంలో ఏం జరిగిందంటే... అక్క ఉద్యోగం చేస్తున్నప్పుడు బుజ్జి పరిచయమయ్యాడు. అప్పటికే తనకు పెళ్లయ్యింది. పిల్లలూ ఉన్నారు. అయితే భార్యతో తనకు సత్సంబంధాలు లేవనీ విడాకులు ఇవ్వాలనుకుంటున్నానీ చెప్పాడు. అక్కను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఇవన్నీ అక్క నమ్మి అతనికి దగ్గరైంది. అలా 2016లో రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు అక్క విషయం బయటపెట్టింది. ఆ తరువాత... అతను తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడం, అక్క బంధాన్ని బయటపెట్టకపోవడంతో అభద్రతకు లోనైంది. పైగా మేమూ ప్రశ్నించడంతో అతడిని ‘రహస్యంగా పెళ్లి చేసుకుని నా జీవితాన్ని, మా కుటుంబాన్ని నాశనం చేశావు, ఇద్దరం కలసి ఉందాం...’ అంటూ చాలాసార్లు నిలదీసింది. ఆమె ఒత్తిడితో అతను పాలకొల్లులో ఒక ప్లాట్‌ తీసుకుని కాపురం పెడతాననీ, కొన్నాళ్లు ఆగమని చెప్పాడు. మళ్లీమళీ అడిగితే రెండునెలల సమయం అడిగాడు. నెలలు గడిచినా ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడంతో అక్క ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దాంతో అతడు ఉద్దేశ పూర్వకంగానే మా అడ్డుని తొలగించుకోవాలనుకున్నాడు. మా ఇద్దరినీ చంపేసి ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. దానికి మరికొందరి సాయం తీసుకున్నాడు. అలా ఆ రోజున యాక్సిడెంట్‌ చేయించాడు. 
పోలీసులు నమ్మలేదు... 
ఇవన్నీ ఊహించి నేను ఈ వివరాలన్నీ పాలకొల్లు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశా. మా అమ్మ లిఖితపూర్వకంగాను రాసి ఇచ్చింది. కానీ పోలీసులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదమని చెప్పి కేసు మూసేశారు. జిల్లా పోలీసు అధికారులైనా న్యాయం చేస్తారనుకుంటే ‘నువ్వు కావాలనే ఆరోపణలు చేస్తున్నావు. ఎలా నిరూపిస్తావు...’ అని నన్నే ప్రశ్నించారు. ఆ మాటలు విన్నాక ఎలాగైనా సరే ఈ అన్యాయాన్ని బయటపెట్టాలనుకున్నా. వారికి శిక్ష పడేలా చేయాలనుకున్నా. ప్రమాదం జరిగిన రోజున అక్క ఫోను డ్యామేజీ అయ్యింది. అయినా ఆ నంబరు నుంచి డేటా సేకరించే ప్రయత్నం చేశా. మా అక్క వాడిన ఫోనులో వాట్సాప్‌, ఇతర మేసేజ్‌ల ఆధారంగా మొత్తం వివరాలు తెలుసుకోగలిగా. ఫోనులో 6,500 పైగా వాట్సాప్‌ మెసేజ్‌లూ, 11,088 సాధారణ  మేసేజ్‌లు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రింటు చేయించి ఓ పుస్తకంగా తయారు చేయించా. అవన్నీ చూపించి మాది యాక్సిడెంట్‌ కాదని మాపై జరిగింది హత్యా ప్రయత్నమేనని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కలిసి వివరించా. ఆ పుస్తకాన్నీ చూపించా. ఆ అధికారులు సానుకూలంగా స్పందించి మొదటిసారి నా మాట విన్నారు. 
సీఐడీతో న్యాయం... 
నా ఫిర్యాదును రాజమండ్రి సీఐడీ విభాగానికి పంపించారు. నన్ను సీఐడీ సీఐ శేఖర్‌బాబు పిలిచి సంఘటనను పూర్తిగా వివరించమన్నారు. మొత్తం చెప్పడంతో పాటూ నా దగ్గరున్న ఆధారాల్నీ చూపించా. తరువాత వారిదైన శైలిలో ఎంక్వయిరీ మొదలుపెట్టారు. మేం మళ్లీ కేసు రీఓపెన్‌ చేస్తున్నామని తెలిసి... బంధువులు కొందరు, అతడి తరఫువారు కొందరు  రాజీ కుదర్చాలని ప్రయత్నించారు. కేసు వదిలేయమని కూడా చెప్పారు. అమ్మ కూడా ఎందుకొచ్చిన గొడవలు... అక్కే పోయిందని బాధపడింది. కానీ నేను మాత్రం అక్కకు న్యాయం జరగాలని వెనకడుగు వేయలేదు. డబ్బు సమస్యలు ఎదురైనా ఉద్యోగం లేకపోయినా ఏడాదిన్నరపాటు పోరాటం చేశారు. ఇప్పుడు బుజ్జి వాడితోపాటూ మిగిలిన ముగ్గుర్నీ అరెస్టు చేయించగలిగా. ఇది నా మొదటి విజయం మాత్రమే. కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా. చాలామంది అమ్మాయిలు చిన్నచిన్న సమస్యలకే భయపడిపోతారు. కానీ మా సంఘటన కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నా.

Posted

Hi Diana darling how r u ?

 

maaku insipiring antey fire undali ila

 

Posted
2 minutes ago, kiladi bullodu said:

Hi Diana darling how r u ?

 

maaku insipiring antey fire undali ila

 

Oka chinna ammayi alone ga e help lekunda system and murderers to fight cheyadam anedi mamulu vishayam ayite kadu

Posted
Just now, Diana said:

Oka chinna ammayi alone ga e help lekunda system and murderers to fight cheyadam anedi mamulu vishayam ayite kadu

oka now i got the synopsis 

lng weekend plans endi 

Posted
1 minute ago, kiladi bullodu said:

oka now i got the synopsis 

lng weekend plans endi 

Weekend is busy with other small works

Me plans enti?

 

Posted
Just now, Diana said:

Weekend is busy with other small works

Me plans enti?

 

naa plans mamuley flah hoisting , clebrating Independence with Amerrican strippers and then hitting biryani place 

Posted

Valla sister story kuda savitri gari story similarities unnay 

father leru .. cheated by a married guy 

Posted

*=: hope that little girl wins, and that bastard gets the punishment he deserves. 

Indian system is nothing but just a pos 

  • Upvote 1
Posted
12 hours ago, kiladi bullodu said:

Hi Diana darling how r u ?

 

maaku insipiring antey fire undali ila

 

deeenni kooda edo oka english movie nunchi lepi 10nguntaadu mana jakkad

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...