Jump to content

Mother killed son - for obstructing affair with BABA


Recommended Posts

Posted
కన్నతల్లే ప్రాణం తీసింది! 
బాబాతో అక్రమ సంబంధం  వద్దన్నందుకు ఘాతుకం 
  అల్లుడితో కలిసి  కుమారుడి హత్యకు కుట్ర 
15brk39a.jpg

నొయిడా: 70 ఏళ్ల బాబాతో అక్రమ సంబంధం వద్దన్న 22 ఏళ్ల కొడుకుని... కిరాయి హంతకులతో గొంతునులిమి చంపించిందో తల్లి! ఇందుకు స్వయానా అల్లుడితో కలిసి కుట్ర పన్నింది!! ఉత్తర్‌ప్రదేశ్‌లో గతనెల 18న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను దాద్రీ సీఐ శనివారం వెల్లడించారు. ‘‘గ్రేటర్‌ నొయిడాలోని దాద్రీ శివారు లుహర్లీలో సురేష్‌దేవి(45), సతీశ్‌కుమార్‌ దంపతులు ఇద్దరు కుమారులు అషుల్‌(22), దీపాషు(12)తో కలిసి నివసిస్తున్నారు. వారి కుమార్తె, అల్లుడు అమిత్‌కుమార్‌లు వేరేచోట ఉంటున్నారు. అయితే- ఉన్నట్టుండి అషుల్‌ గతనెల 18న విగతజీవిగా కనిపించాడు. విచారణ చేపట్టేందుకు మృతుని తల్లి ఆసక్తి చూపలేదు. దీంతో పోలీసులకు అనుమానమొచ్చింది. గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో... ఆమె అసలు విషయం దాచుకోలేకపోయింది.

బాబాగా వచ్చి...: తాను బాబానంటూ నాలుగేళ్లక్రితం కన్నయ్య(70) సురేశ్‌దేవికి పరిచయమయ్యాడు. తర్వాత పూజల పేరుతో తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడు. దేవితో చనువు పెంచుకున్నాడు. ఒకరోజు అషుల్‌ ఇంటికొచ్చేసరికి... కన్నయ్యతో తన తల్లి చెప్పుకోలేనంత సన్నిహితంగా ఉండటం చూశాడు. వద్దని వారించాడు. కానీ...సురేశ్‌దేవికి కన్నయ్యే ఎక్కువయ్యాడు. కొడుకుని అంతంచేస్తే తనకు అడ్డు తొలగిపోతుందని తలపోసిందామె. విషయాన్ని అల్లుడు అమిత్‌కు చెప్పింది. బావమరిది హత్యకు అతడు పథకం రచించాడు. హంతకముఠాకు చెందిన సచిన్‌(25), సత్యేంద్ర(28), అమిత్‌(26)లతో రూ.35వేలకు బేరం కుదిర్చాడు. ఒకరోజు అమిత్‌ వాషింగ్‌మిషీన్‌ కొందాం రమ్మంటూ అషుల్‌ను బైక్‌పై కూర్చోబెట్టుకుని... నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ హంతకముఠా కాచుకుని ఉంది. అమిత్‌తో వారు విషపూరిత శీతల పానీయం తాగించి, ఆపై గొంతు నులిమేశారు’’ అని సీఐ నిషాంత్‌శర్మ వివరించారు.

Posted

Tu .. don't post this type of news man .n sad to say. media is highlighting These type of news

  • Upvote 1
Posted
48 minutes ago, Unityunity said:

Tu .. don't post this type of news man .n sad to say. media is highlighting These type of news

not about other things ... but .. how weird things happen in the name of religion ..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...