Jump to content

Formula1 boat racing in Amaravathi


Recommended Posts

Posted
ఫార్ముల-1 బోట్‌ రేస్‌ ఒప్పందం 23న 
నవంబరు 10 నుంచే కృష్ణా నదిలో పోటీలు 
అమరావతి బోట్‌ నమూనా సిద్ధం
ఈనాడు, అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో పవర్‌బోట్‌లతో నిర్వహించనున్న ఫార్ములా-1 రేసు (ఫాఫ్‌-1హెచ్‌2ఓ) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమవుతోంది. పోటీల నిర్వహణ సంస్థ యూఐఎం రాష్ట్ర పర్యాటక శాఖతో ఈ నెల 23న ఒప్పందం చేసుకోనుంది. అదేరోజు యూఐఎం ప్రతినిధులు రాష్ట్రానికి వస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగే అవకాశం ఉందని పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ పోటీలు నవంబరు 22-24వరకు జరగాల్సి ఉంది. తాజాగా ఈ షెడ్యూల్‌లో మార్పు చేశారని, నవంబరు 10నుంచే ఇక్కడ పోటీలు ప్రారంభమవుతాయని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పోటీలు నిర్వహిస్తూ వస్తారు. ఫైనల్‌కు చేరుకుని గెలుపొందే బోట్‌, ఆ బోట్‌ డ్రైవర్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. ఇప్పటికే మేలో పోర్టీమావో(పోర్చుగల్‌), జూన్‌లో లండన్‌(యూకే)లో పోటీలు జరిగాయి. ఆగస్టు 26 నుంచి హార్బిన్‌(చైనా)లో జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే ఒక బోటుకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి థీమ్‌తో నమూనాను సిద్ధం చేశారు. థీమ్‌లో భాగంగా లేత పసుపురంగు బ్యాక్‌గ్రౌండ్‌ పైన ఎరుపు రంగులో ‘అమరావతి’ పేరు, దాని కింద ఏపీ టూరిజం అని రాసి ఉంటుంది. చైనా(లీజుహు)లో ఇదే ఏడాది సెప్టెంబరులో మరోసారి జరిగే పోటీలోనూ అమరావతి థీమ్‌ను ప్రదర్శిస్తారు. ఆ తర్వాత అమరావతిలో జరిగే పోటీలోనూ థీమ్‌ బోటు ఉంటుంది. డిసెంబరులో షార్జా(యూఏఈ)లో ఈ ఎఫ్‌-1హెచ్‌2ఓ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ముగియనున్నాయి.
Posted
అమరావతికే ఓ అద్భుతంగా..
15-07-2018 10:09:01
 
636672461381756565.jpg
  • కృష్ణానదిలో పవర్‌ బోటింగ్‌
  • నవంబరులో ఎఫ్‌1 హెచ్‌2ఓ వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌
  • ప్రకాశం బ్యారేజీ, భవానీ ద్వీపం ప్రాంతాల్లో పోటీలు
  • 12 దేశాలు, తొమ్మిది టీములు 400 మంది క్రీడాకారులు
  • 2 వేల మంది విదేశీ వీక్షకులు రాక
  • వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో టీమ్‌ అమరావతి
‘పవర్‌ బోటింగ్‌ రేస్‌ మజా ఎలా ఉంటుందో చూడాలని ఉందా? మరో మూడు నెలలు ఓపిక పడితే.. బెజవాడ చెంతన కృష్ణానదిలో ప్రత్యక్షంగా చూసే అవకాశం రాబోతోంది! నేవీ షో వంటి కార్యక్రమాల తర్వాత మరో అద్భుతం కనువిందు చేయబోతోంది! వాటర్‌లో జరిగే ఫార్ములా వన్‌రేస్‌ను చూసేందుకు సిద్ధం కండి..!
 
 
విజయవాడ: నీళ్లలో సర్‌.. ర్‌.. ర్‌ మంటూ దూసుకుపోయే ఎఫ్‌1 హెచ్‌2 పవర్‌ బోట్‌ రేసింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ కృష్ణాతీరంలో నవంబర్‌ 14, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పర్యాటక శాఖ ద్వారా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తోంది. రోజుకు లక్ష మందికి పైగా స్వదేశీయులు, రెండు వేల మందికి పైగా విదేశీయులు మూడు రోజుల పాటు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టబోతున్నారు.
 
 
ఎఫ్‌ 1 హెచ్‌ 2.. ఓ అంతర్జాతీయంగా హైస్పీడ్‌ బోటింగ్‌ రేస్‌లు నిర్వహించే సంస్థ. ఈ సంస్థ పవర్‌ బోట్‌, ఆక్వా రేసింగ్‌, వరల్డ్‌ నేషన్స్‌ కప్‌ పోటీలను నిర్వహిస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఈ సంస్థ నేతృత్వంలో వరల్డ్‌ చాంపియన్‌ సిరీస్‌లు జరుగుతాయి. ఈ ఏడాది మొత్తం ఈ సంస్థ పది వరల్డ్‌ చాంపియన్‌ సిరీస్‌లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పోర్చుగల్‌ (మే 18), లండన్‌(జూన్‌ 15 - 16 ), ఫ్రాన్స్‌(జూన్‌ 29 - జూలై 1 ) తేదీల్లో పోటీలను నిర్వహించారు. నాలుగు, ఐదు చాంపియన్‌ షిప్‌లు చైనాలో ( ఆగస్టు 24- 26, సెప్టెంబర్‌ 15 - 16 ) జరగనున్నాయి. అమరావతిలో ఆరో చాంపియన్‌ షిప్‌ను నిర్వహిస్తోంది. తర్వాత అబుదాబిలో డిసెంబర్‌ 1- 8, ఆ తర్వాత షార్జాలో 13 - 15 లలో ఇలా చాంపియన్‌ షిప్‌లను నిర్వహిస్తుంది.
 
 
అమరావతికి సాకారం ఇలా
అమరావతి రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్‌ చేయటానికి వీలుగా ఇంటర్నేషనల్‌ బిగ్‌ ఈవెంట్‌ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో పర్యాటకశాఖ నేతృత్వంలో ఆ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సూచించింది. దీంతో పర్యాటక శాఖ ప్రపంచ స్థాయి ఈవెంట్లను అధ్యయనం చేయగా ఎఫ్‌1 హెచ్‌2 ఓ సంస్థ గురించి తెలిసింది. మాలక్ష్మీ గ్రూపు సంస్థకు చెందిన సీఈఓ సందీప్‌ సహకారంతో ఆ సంస్థతో సంప్రదింపులు చేశారు. దాదాపుగా ఆరునెలల కిందట ఈ సంస్థతో పాటు, యూఐఎం సంస్థ ప్రతినిధులు వచ్చి అమరావతిని పరిశీలించి ఎంపిక చేశారు.
 
 
యూఐఎం ప్రమాణాలు
ప్రపంచవ్యాప్తంగా స్పీడ్‌ బోట్‌ పోటీలు నిర్వహించాలంటే యూఐఎం సంస్థ ప్రమాణాలు పాటించాలి. పోటీలు నిర్వహించటానికి ఏది అనుకూలం? ఎక్కడ ఏర్పాటు చేయాలి? రేసర్ల అర్హతలు ఏమిటి? వంటివి కూడా ఈ సంస్థే నిర్దేశిస్తుంది. ఎఫ్‌1 హెచ్‌2 ఓ సంస్థతో పాటు ఈ సంస్థ ప్రతిధులు కూడా కృష్ణానదిని పరిశీలించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కృష్ణానదిలో ప్రధానంగా 23 కిలోమీటర్ల పాటు సుదూర వాటర్‌ ఫ్లో ఉంది. ప్రకాశం బ్యారేజి నుంచి పవిత్ర సంగమం వరకు ఒకేలైన్‌లో ఫ్లో ఉండటం అనుకూలాంశం. కృష్ణానది వెడల్పు 400 మీటర్లు ఉండటం, పన్నెండు మీటర్ల లోతు ఉండటం కూడా కలిసొచ్చిన అంశాలుగా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి పోటీలు ప్రారంభించి.. భవానీ ద్వీపం వరకు 23 కిలోమీటర్ల వాటర్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తారు.
  •  పవర్‌ బోటింగ్‌ రేస్‌ సాహసోపేతమైన క్రీడ. బోట్లలో పైలట్స్‌ దిగువున కూర్చుని ఉంటారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నీటిలో దూసుకుపోతాయి. ఇవి మలుపులు తిరిగే సమయంలో కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి.
  • ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోర్చుగల్‌, టర్కీ, స్వీడన్‌, అబుదాబి, చైనా, షార్జా, లండన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ తదితర మొత్తం 12 దేశాల నుంచి 9 టీమ్‌లు పాల్గొంటున్నాయి. మొత్తం 400 మంది అభ్యర్థులు పాల్గొనబోతున్నారు.
  • వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో టీమ్‌ అమరావతి కూడా పాలు పంచుకుంటోంది. యూఎంఐ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన అత్యుత్తమ్మ రేసర్లను ఎంపిక చేసి పోటీలకు పంపించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. అమరావతికి బ్రాండింగ్‌ కల్పించటానికి వీలుగా కూడా టీమ్‌ అమరావతి లోగోను స్పీడ్‌ రేస్‌ బైక్‌పై ప్రత్యేకంగా కనిపించేలా ఏర్పాటు చేస్తారు. అమరావతి కంటే వచ్చే నెలలో చైనా దేశంలో జరిగే రెండు మెగా ఈవెంట్లలో ముందుగా టీమ్‌ అమరావతి రేసర్లు పాల్గొంటారు.
  • మూడు రోజుల పాటు జరిగే పోటీలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున లక్ష మందికి పైగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీపై 20 వేల మందికి గ్యాలరీలు ఏర్పాటు చేయవచ్చని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు.
  • ప్రపంచ పవర్‌ బోటింగ్‌ రేస్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రేస్‌ పోటీలకు ఆయా దేశాల నుంచి మొత్తం 2 వేల మందికి పైగా వచ్చే అవకాశం ఉంది. దీంతో విదేశీయుల రాకతో బెజవాడ కళకళలాడనుంది. విదేశాల నుంచి 40 మందికి పైగా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కూడా వస్తున్నారు.
 
 
14 ఏళ్ల తర్వాత..
14 సంవత్సరాల కిందట ఈ సంస్థ నేతృత్వంలో ముంబైలో ఒకసారి పోటీలను నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు మన దేశంలో నవ్యాంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధాని ప్రాంతంలోని విజయవాడ చెంతన కృష్ణానదిలో చాంపియన్‌ పోటీలను నిర్వహిస్తున్నారు.
 
 
అమరావతికే ఓ అద్భుతం
అమరావతికి ఒక అద్భుతంగా ఎఫ్‌1 హెచ్‌2 ఓ పవర్‌ బోటింగ్‌ పోటీలు ఉంటాయి. పద్నాలుగేళ్ళ తర్వాత దేశంలో.. గోవా, ముంబై, ఢిల్లీలను కాదని మన కృష్ణానదిలో జరుగుతున్నాయి. అమరావతికి ప్రపంచంలో బ్రాండింగ్‌ కల్పించటానికి ఇంతకంటే మంచి అవకాశం లేదు. ప్రభుత్వపరంగా ఈ పోటీలకు పెద్దగా ఖర్చేమీ చేయటం లేదు. బేసిక్‌ ఎమినిటీస్‌ కల్పిస్తున్నాం. ఈ పోటీల నిర్వహణ ద్వారా.. టీవీ రైట్స్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ రైట్స్‌ ద్వారా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. లక్ష మంది కూర్చుని చూసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. - హిమాన్షు శుక్లా, పర్యాటక శాఖ ఎండీ
 
 
అద్భుతం.. కృష్ణా ప్రాంతం..
ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల పోటీలను నిర్వహించాం. ఇక్కడ అత్యద్భుతమైన నది ఉంది. దీవులు కూడా ఉన్నాయి. పవర్‌ బోట్‌ రేస్‌ పోటీలు నిర్వహించటానికి ఇది అత్యంత అనుకూలమైన ప్రాంతం.ప్రపంచంలో చూసిన పలు ప్రాంతాల కంటే ఇక్కడ భిన్నమైన వాతారణం ఉంది. చాలా బాగుంది. ఇక్కడ పోటీలు నిర్వహించటానికి ప్రభుత్వం పోర్టు చేస్తోంది. - పాల్‌, ఎఫ్‌1 హెచ్‌ 2 ఓ డైరెక్టర్‌
Posted

mundu godavari nadi lo boat la sangathi choodamanu, vaati licenses etc...... taravata formula 1 luchoodachu

Posted
1 hour ago, fake_Bezawada said:

osari ee bezawada lone ga padava boltha padi chachipoyaru 

Hyd lo gokul chat lo baamb pelindhani Hyderabad ki evarni raavodhani cheppara bro. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...