turtle Posted July 26, 2018 Report Posted July 26, 2018 వర్షంలో యువతి కనిపించగానే.. రాక్షసుడు నిద్రలేచాడు..! 26-07-2018 11:12:30 అత్యాచారయత్నం కేసులో ఆర్మీ జవాన్ అరెస్టు అప్పట్లో కలకం సృష్టించిన కేసు... ఏడు నెలల క్రితం బాలికపై అత్యాచారం చేసిన నేరస్థుడూ ఇతడే నిందితుడ్ని పట్టుకోవడంలో సాహసం చూపిన కానిస్టేబుల్ కానిస్టేబుళ్లకు ప్రశంసలు ప్రెస్‌మీట్‌లో సీపీ అంజనీకుమార్ హైదరాబాద్: తిరుమలగిరి ఠాణా పరిధిలో అమ్మాయిపై అత్యాచారం చేసిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఘటన జరిగిన ప్రాంతంలోనే మరో యువతిపై లైంగిక దాడికి యత్నించిన నిందితుడ్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడంతో యువతిని దాడి నుంచి రక్షించడమే కాకుండా ఏడు నెలలుగా మిస్టరీ వీడని సంచలన కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసు ఛేదనలో అత్యంత సాహసం చూపిన ముగ్గురు కానిస్టేబుళ్లను సీపీ అంజనీకుమార్ పొగడ్తలతో ముంచెత్తారు. వా రిలో చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్‌ను పోలీస్ శాఖ హీరోగా అభివర్ణించారు. అరెస్టయిన నిందితుడిపై పోక్సో చట్టంతో పా టు అత్యాచారం, అత్యాచారయత్నానికి సంబంధించిన కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంతకు ముందు కూడా అతడు నేరాలు చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేసిన సీపీ అతడి పాపాల చిట్టాను రాబడతామన్నారు. అత్యాచారయత్నం బిహార్ రాష్ట్రం మథురాపూర్‌లోని రాణిపూర్ ప్రాంతానికి చెందిన బ్రిజేశ్‌కుమార్ యాదవ్(32), సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని సిగ్నల్ రెజిమెంట్‌లో సిపాయిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 23న రాత్రి 8.15గంటల సమయంలో తిరుమలగిరి ఠాణా పరిధిలోని అమ్ముగూడ రైల్వే గేట్ సమీపంలోని కోహె ఇమాం దర్గా ప్రాంతంలో ఓ యువతి(19) వర్షం కురుస్తుండడంతో తన స్నేహితుడితో కలిసి అక్కడ నిల్చుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరూ కనిపించడంతో బ్రిజే్‌షకుమార్‌లోని రాక్షసుడు నిద్రలేచాడు. వారి వద్దకు చేరుకుని యువకుడిపై పిడిగుద్దులతో దాడి చేశాడు. దీంతో అతడి పళ్లు ఊడిపోయి రక్తం కారుతూ తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని ప్రతిఘటించడానికి ప్రయత్నించిన యువకుడ్ని... యువతిని కర్రతో కొడుతూ వారి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని యువతిని లాక్కుని పక్కకు తీసుకెళ్లాడు. అతడి చేష్టలకు భయపడిన యువతి అరుస్తూ బిగ్గరగా ఏడ్వ సాగింది. ఓ వైపు వదిలేయమని అతడ్ని ప్రాధేయపడుతూనే... రక్షించమని అరవ సాగింది. హీరో కానిస్టేబుల్ చంద్రశేఖర్ తిరుమలగిరి నాగదేవర టెంపుల్ వద్ద విధులు నిర్వహిస్తున్న పెట్రోల్ కారు సిబ్బందికి సమీపంలో ఏదో అలజడి అవుతోందని అర్థమైంది. వర్షం పడుతున్న సమయంలో పొదల్లో ము గ్గురు వ్యక్తులు ఏదో ఘర్షణ పడుతున్నారని అనుమానించిన పెట్రోల్ కారు సిబ్బంది ఆ వైపు పరుగులు తీశారు. ముందుగా కానిస్టేబుల్ ఎస్.చంద్రశేఖర్(పీసీ 4691) వేగంగా వెళ్తుండగా యువతి అరుపులు వినిపించాయి. కానిస్టేబుల్ రాకను గమనించి అతడిపై కూడా దాడికి యత్నించగా... ధైర్యం చేసిన కానిస్టేబుల్ అతడ్ని పట్టుకోడానికి ప్రయత్నించాడు. అప్పటికే రక్షక్ డ్రైవర్ హరిరామ్ శర్మ (మాజీ సైనికుడు, ఎస్‌పిఓ 0525) కూడా అక్కడికి చేరుకున్నాడు. వీరిని చూసి నిందితుడు యువతిని వదిలి పారిపోడానికి యత్నించాడు. సుమారు 700 మీటర్లు కానిస్టేబుల్ వెంబడించినా అతడు చిక్కకుండా 10మీటర్ల ఎత్తు నుంచి దూకాడు. క్షణం ఆలస్యం చేయకుండా కానిస్టేబుల్ చంద్రశేఖర్ కూడా అతడి వెనకనే దూకి గట్టిగా పట్టుకున్నాడు. ఈ ప్రయత్నంలో చంద్రశేఖర్ తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతడ్ని పట్టుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ క్షణంలో తాము అక్కడికి చేరుకోకపోతే యువతిని అత్యాచారం చేసి హత్య చేసి ఉండే వాడని హరిరామ్‌శర్మ తెలిపాడు. వీరితోపాటు నరేందర్ అనే బ్లూకోల్ట్ కానిస్టేబుల్ సకాలంలో వారికి లాఠీలు అందించి నిందితుడ్ని పట్టుకోవడంలో తన వంతు కృషి చేశాడు. ఈ ముగ్గురి సాహసోపేతమైన చర్యలతో కీలక నిందితుడు పోలీసులకు చిక్కాడని సీపీ వివరించారు. గతేడాది ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన దృష్ట్యా ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ ముమ్మరం చేశామని... ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి 9గం టల మధ్యలో నిరంతరాయంగా పెట్రోలింగ్ చేస్తుంటామని చంద్రశేఖర్ తెలిపారు. ఆ విధి నిర్వహణ విజయం సాధించి ప్రధాన నిందితుడ్ని పట్టించిందని గర్వంగా చెప్పారు. తన జీవితంలో సాహసోపేతమైన విధి నిర్వహణ అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉందని చంద్రశేఖర్ వివరించాడు. 24 గంటల్లో పాత కేసు ఛేదన అత్యాచార యత్నం... నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారన్న సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపీ సుమతి, బేగంపేట ఏసీపీతో పాటు తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్, ఇతర సిబ్బంది నిందితుడ్ని విచారించారు. విచారణలో భాగంగా అతడ్ని తీసుకుని సీన్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా అదే ప్రాంతానికి వెళ్లడంతో గతంలో అదే ప్రాంతంలో జరిగిన సంఘటనపై పోలీసులు దృష్టి సారించారు. గతేడాది డిసెంబర్ 21న అదే ప్రాంతంలో ఓ ఆర్మీ అధికారి కూతురు తన స్నేహితురాలి వద్దకు వెళుతున్న సమయంలో దారికాచిన ఓ అపరిచిత వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసిన ఘటనపై దృష్టి సారించి నిందితుడి వద్ద నుంచి ఆధారాలు సేకరించారు. అప్పటి ఆధారాలు... నిందితుడి డీఎన్‌ఏ మ్యాపింగ్ ఆధారాలు సేకరించిన పోలీసులకు ఆ సమయంలో అత్యాచారం చేసింది కూడా ఇతనేనని నిర్ధారించి అప్పటి నుంచి మిస్టరీ వీడని కేసులో కూడా నిందితుడు చిక్కడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రకంగా యు వతిపై అత్యాచార యత్నం... బాలికపై అత్యాచారానికి సంబంధించిన కేసులో నిందితుడు అరెస్టయినందున అతడ్ని రిమాండ్‌కు తరలించారు. అతడ్ని తిరిగి కస్టడీకి తీసుకుని విచారించి అతడి పాపాల పుట్టను తిరిగి తోడుతామని సీపీ వివరించారు. విచారణ జరిగింది ఇలా... గత డిసెంబర్‌లో.. ఈ నెల 23న జరిగిన రెండు నేరాలు కూడా ఒకే తరహాలో జరిగాయి. రెండు ఘటనలు కూడా అమ్ముగూడ రైల్వే గేటు వద్ద... ఒకే సమయంలో చోటు చేసుకున్నాయి. సహకరించమంటూ తీవ్రంగా కొట్టినట్లు బాధితులిద్దరూ వివరించారు. రెండు ఘటనల్లోనూ నిందితుడు నల్ల ప్యాంటు ధరించి ఉండడం.. ఎదుటి వైపు నుంచి రావడంతో పాటు యువకులతో కలిసి ఉన్న వారిని గుర్తించి దాడి చేయడం. నిందితుడు ఒకే మోటార్ సైకిల్ వాడడం.. ఆ తర్వాత దాన్ని దాచివేసి ఆ ప్రాంతంలో కర్ర తీసుకుని తిరగడాన్ని పోలీసులు గుర్తించారు. రెండు కేసుల్లోనూ వారితో ఉన్న యువకులను తీవ్రంగా కొట్టడం.. దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేయడం కనిపించింది. డిసెంబర్‌లో జరిగిన కేసులో 16మంది అనుమానితులు.. బాధితురాలి పరిచయస్థులను విచారించడం జరిగింది. ఘటన జరిగిన ప్రాంతంలో ప్రతి చిన్న ఆధారాన్ని సేకరించిన పోలీసులు ఎట్టకేలకు సంచలనం సృష్టించిన కేసు చిక్కుముడిని విడదీశారు. Quote
turtle Posted July 26, 2018 Author Report Posted July 26, 2018 Bayataki kanabadani nalugo simham humanity ani proove sesavu. Sabhash. Quote
tutankhamun Posted July 26, 2018 Report Posted July 26, 2018 1 minute ago, turtle said: Bayataki kanabadani nalugo simham humanity ani proove sesavu. Sabhash. good job kosi 10gaali parts edavalaki Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.