kakatiya Posted August 6, 2018 Report Share Posted August 6, 2018 సుందిళ్ల (సెంటినరీకాలనీ), న్యూస్టుడే: రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల చేతుల్లోని తినుబండారాలను లాక్కెళ్లుతున్న కోతులను చూస్తుంటాం. కాని రామగిరి మండలంలోని సుందిళ్లలో ఓ కోతి పొయ్యిలోని నిప్పుకర్రను లాక్కొని తాటిచెట్లకు నిప్పంటించిన ఘటన ఆదివారం చోటుచేసుకొంది. కోతి తన కొంటె చేష్టలతో గ్రామస్థులను ఆందోళనకు గురిచేసింది. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వివరాలిలా...సుందిళ్లకు చెందిన జనగామ వెంకటేష్ ఇంటిలోని తినుబండారాలను లాక్కోవటానికి కోతి వచ్చింది. వెంకటేష్ కర్రతో కోతిని బెదిరించటంతో కోపం తెచ్చుకొన్న మర్కటం ఇంటి ఆవరణలోని పొయ్యిలోని కొర్రాయిని తీసుకొని తాటిచెట్టుపైకి ఎక్కి నిప్పు పెట్టింది. తాటిచెట్టుకు అంటుకొన్న మంటలు పక్కన ఉన్న మరోచెట్టుకు వ్యాపించాయి. తాటిచెట్లకు అంటుకొన్న మంటలు కింద ఉన్న ఇళ్లకు వ్యాపిస్తాయని గ్రామస్థులు ఆందోళన చెందారు. కాని మంటలు తాటిచెట్ల వరకే పరిమితం కావటంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకొన్నారు. తాటిచెట్లకు అంటుకొన్న మంటలను చూసిన గ్రామస్థులు తొలుత పిడుగుపాటుకు మంటలు వ్యాపించాయని భావించారు. తాటిచెట్టు కింది భాగంలో కొర్రాయితో కోతి కనిపించటంతో ఈ ఘనకార్యం చేసింది మర్కటం అని గుర్తించారు. ఓ కోతి తన కొంటె చేష్టలతో గ్రామస్థులను కలవరానికి గురిచేసింది. Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 6, 2018 Report Share Posted August 6, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Lakhan Posted August 6, 2018 Report Share Posted August 6, 2018 It is @kakatiya Quote Link to comment Share on other sites More sharing options...
bala7 Posted August 6, 2018 Report Share Posted August 6, 2018 3 hours ago, Lakhan said: It is @kakatiya Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted August 6, 2018 Author Report Share Posted August 6, 2018 4 hours ago, Lakhan said: It is @kakatiya 🐒 Quote Link to comment Share on other sites More sharing options...
MagaMaharaju Posted August 6, 2018 Report Share Posted August 6, 2018 LOL Quote Link to comment Share on other sites More sharing options...
Biskot Posted August 6, 2018 Report Share Posted August 6, 2018 ha ha... Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted August 6, 2018 Report Share Posted August 6, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.