Jump to content

Recommended Posts

Posted

మహాకూటమికే అధికార పగ్గాలు

 

హైదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధి : అనుకున్నంత అయింది, చంద్రబాబు వ్యూహం ఫలించింది. ప్రజారాజ్యం రాకతో తమకేమి నష్టం లేదని ఇన్నాళ్ళు మేకపోతు గాంభీ ర్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌ భారీ మూల్యం చెల్లించు కున్నది. ముఖ్యంగా రెండోవిడత ఎన్నికలు జరిగిన జిల్లాల్లో కాంగ్రెస్‌ విజయావకాశాలను ప్రజారాజ్యం భారీగా గండి కొట్టింది. ఇటీవలి రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అత్యధికంగా 146 స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టనున్నది. అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోనున్నదని పోలింగ్‌ సరళిని అద్యయనం చేసిన నిపుణులు వివరిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రానున్నామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ పార్టీ గరిష్టంగా 89 స్థానాలకే పరిమితం కాను న్నది.

 

 

ప్రజారాజ్యం పార్టీ అనూహ్యంగా పుంజుకుని,అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్‌ సంప్రదాయ ఓట్లబ్యాం్‌ ను తన ఖాతాలో జమచేసుకోవడమే ఇందుకు ప్రధానకారణంగా విశ్లేషిస్తున్నారు. రాష్ర్టంలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలపై అన్ని ప్రధానపార్టీలు భరోసా వ్యక్తం చేయడం,ఓటర్ల నాడి అంచనాకు అందకపోవ డంతో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే విషయంలో అన్నివర్గాల్లో తీవ్రఉత్కంఠ నెలకొన్నది.జనసామాన్యం మాటెలా ఉన్నా కీలకస్థానాల్లో ఉన్నప్రభుత్వ ఉన్నతాధి కారులు, బ్యూరోక్రాట్‌లలో కూడా ఇదే సందిగ్ధత నెల కొన్నది. దీంతో రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌ సరిళితో పాటు ఏ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోనున్నదనే అం శంపై కొందరుసీనియర్‌ అధికారులు సుదీర్ఘంగా విశ్లేషణ జరిపారు.అత్యంత విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు వారి పరిశీలన,అంచనాలు ఇలా ఉన్నాయి.

 

ఎన్నికల విశ్లేషణకు ప్రాతిపదిక ఏమిటి?

 

 

రాష్ర్టంలోని వివిధ నియోజక వర్గాల పోలింగ్‌ సరళి, ఓటర్ల ప్రాధాన్యత అంశాలను,అభ్యర్ధుల గుణగణాలను, ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసిన అంశాలను సీని యర్‌ అధికారులు సేకరించారు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమైన ఈ సమాచారాన్ని వారు నాలుగురోజుల పాటు సుదీర్ఘంగా దశల వారీగా విశ్లేషిం చారు. అంతిమంగా ఐదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో తీవ్రంగా వ్యతిరేకత నెలకొ న్నది,ఇది అక్కడి తిరిగి బరిలో నిలిచిన మంత్రులు, సిట్టింగ్‌లపై తీవ్రస్థాయిలో నివురుగప్పిన నిప్పులా అంత ర్లీనంగా ఆ పార్టీకి వ్యతిరేక ఓటుగా మారింది.

 

అధికారుల విశ్లేషణ ప్రకారం ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారి తీసిన కారణాలకంటే, మంత్రులు,సిట్టింగ్‌లపై ఉన్న వ్యతిరేకతకు స్థానిక కారణాలు మాత్రం అన్నిప్రాంతాల్లో ఒకేలా ఉన్నాయి. స్థూలంగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉన్న ఓటర్లను ఎన్నికలబరిలో నిలిచిన ప్రజా రాజ్యం పార్టీ పెద్ద ఎత్తున ఆకర్షించగలిగింది. మరో వైపు తన ఓటు బ్యాంక్‌ చెక్కుచెదరకుండా నిలుపు కోవడంలో, వారిని తన వైపు ఆకర్షించుకోవడంలో తెలుగుదేశంపార్టీ సఫలమైంది. నాయకులు పార్టీని వీడినా కేడర్‌ను కాపాడుకోవడంలో,ఓటు బ్యాంక్‌కు నమ్మకం కలిగించ డంలో చంద్రబాబు చేసిన మహాకూటమి ప్రయోగం అనూహ్యంగా ఫలితాలను ఇచ్చింది.

 

గతఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌,తెలుగుదేశంపార్టీలకు సమానంగా 38 శాతం ఓట్లుపోలయ్యాయి. అయితే అప్పట్లో తెలుగుదేశంను ఓడించేందుకు కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ రాష్టస్రమితి, ఉభయకమ్యూనిస్టులతో ఎన్నికల పొత్తుపెట్టుకోవడంతో అదనంగా పదిశాతం ఓటింగ్‌ కలిసి వచ్చి,ఆ పార్టీ అధి కారం చేపట్టేందుకు దోహదపడింది. ప్రస్తుతం చంద్ర బాబు చేసిన మహా కూటమి ప్రయోగంతో తొలివిడత ఎన్నికలు జరిగిన తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు గంపగుత్తగా మహాకూటమి వైపు మళ్ళింది. రెండో విడతలో కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు ప్రజారాజ్యంపార్టీకి అనూహ్యంగా లాభించిందనేది వారి విశ్లేషణల సారాంశం.

 

లెక్కల్లో కూడా కూటమికే మిగులు

 

రాష్ర్టంలో నమోదైన 5.67 కోట్ల ఓటర్లలో ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నది 4.27 కోట్ల ఓటర్లు మాత్రమే. గతంలో రెండో శిబిరాలు ఎన్నికల బరిలో నిలవగా, ఈసారి మూడోపార్టీ రాకలో జరిగిన ముక్కోణపు పోటీలో ఏ పార్టీ కోటీ నలభై లక్షల ఓట్లు రాబట్టుకుంటుందో ఆ పార్టీ విజేతే. అయితే సంస్థాగత లోటుపాట్లుతో బరిలోకి దిగిన ప్రజారాజ్యం అధికారం చేపట్టే అవకాశాన్ని దూరం చేసుకోగా ఇక మిగిలింది కాంగ్రెస్‌,మహాకూటమి మాత్రమే. కొత్తగా వచ్చిన పార్టీ ఇరుపార్టీల ఓటుబ్యాంక్‌ను సమానస్థాయిలో చీల్చినప్ప టికీ,కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు మాత్రం మహాకూటమి, ప్రజారాజ్యానికిపడిందనేది ఉన్నతాధికారుల అంచనా. అందుకు వారు చెప్పే వివరణలు ఇలాఉన్నాయి.

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు,తెలుగుదేశంపార్టీలకు సమాన స్థాయిలో 38 శాతం ఓటు బ్యాంక్‌ నమోదైంది. ప్రస్తుతం ప్రజారాజ్యం ఆరెండుపార్టీల నుంచి కనిష్టంగా ఎనిమిది శాతం చొప్పునచీల్చుకున్నా కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీలు చెరి 30 శాతం ఓటు బ్యాంక్‌ను కలిగి ఉన్నట్టు అనుకుందాం. కాంగ్రెస్‌కు కలిసి వచ్చే పార్టీలు లేకపోగా,తెలుగుదేశానికితెలంగాణలో ఏడు శాతం ఓట్లున్న తెలంగాణ రాష్టస్రమితి,నాలుగు శాతం ఓట్లున్న కామ్రేడ్‌లు కలిసి రావడంతో మహాకూటమి మొత్తం 41 శాతం ఓట్లతో అగ్ర స్థానం కైవసం చేసుకో నున్నదనేది వారి అంచనా.

 

అంతేకాకుండా కాంగ్రెస్‌కు కొమ్ముకా స్తారనుకున్న దళితులు,కాపులకు చెందిన యువ ఓటర్లు ప్రజారాజ్యం వైపు, మహిళలు,బిసీలుకూటమి వైపు చీలి పోవడంతో ఈ మేరకు కాంగ్రెస్‌ భారీగా నష్టపో యిందనేది వారి విశ్లేషణ.స్థూలంగావారి అంచనాలు ఇలా ఉన్నాయి మహాకూటమికి చెందిన అభ్యర్ధులు అత్యధికంగా 146లో విజయభావుటా ఎగుర వేయనున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు 89 స్థానాల్లో, ప్రజారాజ్యం పార్టీ 50 స్థానాల్లో పాగావేయనున్నదనేది ఉన్నతస్థాయి అధికార వర్గాల అంచానా.

 

Posted
2 minutes ago, JANASENA said:

avunu nakka gaadu PM aithadu.  @3$%

aa sance, maa jagan anna kottesthadu, dont worry 

Posted
Just now, Kontekurradu said:

aa sance, maa jagan anna kottesthadu, dont worry 

CM of AP in 2019 

Posted
2 minutes ago, JANASENA said:

CM of AP in 2019 

Anni kudirithe PM in 2024 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...