Jump to content

Recommended Posts

Posted

0352149BRK-RAJKUMAR.JPG

ముంబయి: తాను సినిమా రంగంలోకి రావాలనుకున్నప్పుడు పడిన బాధలు అన్నీఇన్నీ కావని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌. చేసింది తక్కువ సినిమాలే అయినా ఐశ్వర్యరాయ్‌, అనిల్‌ కపూర్‌లాంటి స్టార్లతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ పేజ్‌లో రాజ్‌కుమార్‌ ఇండస్ట్రీలోకి రావడానికి తాను పడిన కష్టాలను పంచుకున్నారు.

‘షారుక్‌ ఖాన్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన పోస్టర్లను చూస్తూ సినిమా రంగంతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తి సూపర్‌స్టార్‌ అయినప్పుడు నాలాంటి సామాన్యుడు కూడా ఏదో ఒక రోజు సాధించగలను అనుకునేవాడ్ని. నేను ముంబయి రాగానే నాకు ఎలాంటి పని దొరకలేదు. చిన్న చిన్న ప్రకటనల్లో నటించేవాడిని. వార్తాపత్రికలో వచ్చే ప్రకటనలో నేను ఎక్కడో మూలకు ఉండేవాడిని. అలా నెలకు రూ.8 నుంచి రూ.10వేల దాకా సంపాదించేవాడిని. కొన్నిసార్లు ఆ డబ్బులు కూడా వచ్చేవి కావు. దాంతో నా స్నేహితులకు ఫోన్‌ చేసి ‘భోజనానికి ఇంటికి రావచ్చా’ అని అడిగేవాడిని. ఇన్ని కష్టాలున్నా సినిమా రంగాన్ని మాత్రం వదులుకోవాలన్న ఆలోచన రాలేదు. ఆడిషన్లకు వెళుతూనే ఉండేవాడిని. ఎందరో క్యాస్టింగ్‌ డైరెక్టర్లను కలిశాను. చిన్న చిన్న పాత్రలకు పిలిచేవారు. పెద్ద పాత్రలకు ఆడిషన్‌ ఇస్తా అని చెప్పేవాడిని. కానీ, ఇందుకు వారు ఒప్పుకొనేవారు కాదు. అయినా బాధపడలేదు. అతుల్‌ మోంగియా అనే క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ను అవకాశం ఇవ్వమని అడుగుతుండేవాడిని. ఓసారి ‘లవ్‌ సెక్స్‌ ఔర్‌ ధోఖా’ అనే సినిమాలో ఓ పాత్రకు నన్ను ఆడిషన్‌కు పిలిచారు. ఆ తర్వాత వారం రోజుల వరకు వారి నుంచి ఎలాంటి ఫోన్‌ రాలేదు. ఓరోజు నాకు ఫోన్‌ రానేవచ్చింది. ‘నువ్వు సెలక్ట్‌ అయ్యావ్‌’ అని చెప్పారు. దాంతో సంతోషం పట్లలేక ఏడుపొచ్చేసింది.’ అని వెల్లడించారు రాజ్‌కుమార్‌ రావ్.

ఆయన కీలక పాత్రలో నటించిన ‘ఫన్నే ఖాన్‌’ ఇటీవల విడుదలైంది. ఇందులో అనిల్‌కపూర్‌, ఐశ్వర్యరాయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ రావ్‌ ‘స్త్రీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన శ్రద్ధా కపూర్‌కు జోడీగా నటిస్తున్నారు.

Posted
39 minutes ago, cellphone said:

bigg boss ganesh bob padina kastamundu nuvventha ani anutunna #ganniarmy president @TOM_BHAYYA

Agreed.. #GannyCultz road meedha pandukunnanni rojulu undadhu veedi movie career .. 

Posted
Just now, Spartan said:

this guys is nice actor.. 

+1

Posted
34 minutes ago, Spartan said:

this guys is nice actor.. 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...